సబ్ ఫీచర్

కృష్ణం వందే జగద్గురుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్లో॥ కృష్ణాయ వాసుదేవాయ- దేవకీ నందనాయచ
నందగోప కుమారాయ- గోవిందాయ నమో నమః॥
దేవకీ వసుదేవులింట పుట్టి యశోదనందులింట పెరిగిన కృష్ణపరమాత్మ ను శ్రావణబహుళాష్టమినాడు జన్మించాడని ఆరోజును జన్మాష్టమిగా భావించి సర్వజనులు పండుగను చేసుకుంటారు.
ఆతండ్రితనకు పుట్టాడని తనకు చన్నిచ్చు భాగ్యం అబ్బిందని యశోద, తన్ను లాలించి పాలించే సౌభాగ్యం నాకు దొరికిందని నందుడు ఆనందించారు. పుట్టీ పుట్టగానే సర్వేశ్వరుడైన పరమాత్మ తమకు కనిపించాడని తమని కరుణించాడని దుష్టలను దునమాడడానికి జగదీశ్వరుడు పుట్టాడని దేవకీవసుదేవులు సంతోషిం చారు.
ఈ కృష్ణుని పూజించని వారు, స్మరించనివారు ఎవరూ ఉండరు. హరేకృష్ణ హరేకృష్ణ అంటూ స్మరిస్తూ జన్మదినవేడుకలు దేవాలయాల్లోనే కాక ప్రతిఇంటా జరుపుకోవడం ఆచారంగా వస్తోంది.
ఆ పాపని జన్మదినం నాడు మాఇంటికి వచ్చాడంటూ ఇంటి వాకిట పాదముద్రలు రంగవల్లులతో ముద్రిస్తారు. దేవుని పూజాగది వరకు పాదముద్రలు వేసుకొంటారు. దేవునిగదిలో వూయల ఏర్పాటు చేసుకొంటారు. ఆ పాపడిని పరుడంబెట్టి ఎన్నో పాటలు పాడుతారు. జో జో అచ్చుతానంద జోజో లాలి... అనే పాటలే పాడే జానపదులే కాదు అన్నమయ్య, త్యాగయ్య క్షేత్రయ్య ఇలా ఎందరో ఆ తండ్రి గురించి ఎన్నో పాటలు పాడారు.
యశోదమ్మ బాలింతరాలు అనీ ఆమెకు కాయం పొడిని పెట్టాలంటూ కాయంపొడి ఇట్లా చేస్తారు.
పిప్పళ్లు - 50 గ్రా , ధనియాలు - 25 గ్రా, మిరియాలు - 25గ్రా, వాము - 25గ్రా, జీలకర్ర - 50 గ్రా, సొంఠి - 50 గ్రా, బెల్లం - 250 గ్రా, నెయ్యి- 100గ్రా
వీటినన్నింటినీ విడివిడిగా వేయించుకుని పొడి చేసుకోవాలి. జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి.బెల్లాన్ని పొడి చేసుకోవాలి.వస్తక్రాగితం పట్టుకుని మెత్తటి పిండిలాగా చేసుకోవాలి. ఈ పొడుల మిశ్రమంలోకి తరిగిన బెల్లపు పొడిని కలపాలి. ఆ తరువాత వేడి వేడిగా నేయి పోస్తూ చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి. దీన్ని కృష్ణ్భక్తులంతా ప్రసాదంగా తీసుకొంటారు. అంతేకాదు స్వామికి వెన్న, మీగడ-అటుకులు- బెల్లం 56 రకాల నైవేద్యాలు నివేదిస్తారు. వాటినంతా కృష్ణప్రసాదం అని భక్తులు సేవిస్తారు.
ప్రేమ భక్తితో తరించిన తపస్విని మీరాబాయ్. గోపాలుడే నా భర్త, అన్యులతో పనిలేదు అని, అంటూ గోవిందుని భజనతో తరించినది మీరా.
సాయంత్రం వేళ కృష్ణుడిని వూయల్లో పడుకోబెట్టి వూయల ఉత్సవాన్ని చేస్తారు.
అరియ శ్రావణ బహుళా ష్టమి చంద్రోదయాన శ్రీకృష్ణుని సిరుల తోను ఉదయించె నిదుగో.... అంటూ
వసుదేవుని పాలిట వరతపోధనం యొసగి దేవకీ దేవి ఎదపై ...... ఉదయించే శ్రీకృష్ణుడు ఇదిగో....
అని వనితలందరూ పాడుతూ వూయలూపుతారు.
మరికొందరు తమ ఒళ్లో పెట్టుకుని చిన్ని కృష్ణునికి ముద్దులు కురిపిస్తూ చేరి యశోదకు శిశువితడు.... .్ధరుణి బ్రహ్మకు తండ్రియు నితడు.... అని కృష్ణావతారాల విశేషాలు స్మరించుకుంటారు.
మరికొందరు కృష్ణుడు అడుగులు వేస్తున్నాడని అరిసెలు పంచి పెడుతూ బాలకృష్ణుని పట్టిపెట్టగ తరమా మనకు అని ఇట్టి ముద్దులాడే బాలుడేలా వాడె వాని పట్టి తెచ్చి పొట్టనిండా పాలు పోయరె.... అంటూ గారాల తనయుడిని మురిపిస్తూ తాము మురుస్తుంటారు.
వసంతరాగంలో శోభనమే శోభనమే వైభవముల పావన మూర్తికి శోభనమే... అంటూ శిశిపాలాదుల చంపిన వైభవాన్ని పాడుకుంటారు. పురంజి రాగం ముద్దుగారే యశోద ముగింట ముత్యమూ వీడు.. దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లెతల మాణిక్యమూ డితడు..... అంటూ నవరత్నాలతో శ్రీకృష్ణుని పొగడిని అన్నమాచార్యుని తలుచుకుంటూ పాటలు పాడుతూ సంతోషిస్తారు. చైతన్య మహాప్రభు, ఏకనాథ్, నామ్‌దేవ్, తుకారామ్, సూరదాస్, లీలాశుకుడు, నారాయణ తీర్థులు, పురందరదాస్, జయదేవుడు, అన్నమయ్య, సదాశివబ్రహ్మేంద్రులు వంటి భక్తశిఖామణులు ఎందరో కృష్ణగానంతలో తరించారు.
అంతేకాదు సాయంసంధ్యావేళ వెనె్నదొంగను స్మరించడానికి ప్రతివారు కృష్ణవేషం వేసుకొంటారు. వీధి కూడళ్లల్లో ఉట్టెలు కొడుతారు. యువతులంతా గోపికలుగా తయారు అవుతారు. కృష్ణలీలను ప్రదర్శించే నృత్యాల పోటీలు జరుపుతారు. చీరలమీద, లంగాలమీద కూడా కృష్ణుని బొమ్మలను చిత్రించుకుని వాటిని ధరిస్తుంటారు.
చిన్న పిల్లలంతా కృష్ణుని వేషం వేసుకొంటారు. కృష్ణుని లీలలను ప్రదర్శిస్తుంటారు.

--వాణి ప్రభాకరి