సబ్ ఫీచర్

భగవద్దర్శనము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమహంసగారి గురువును అంతయు బ్రహ్మమయమని చెప్పువాడను అగు తోతాపురియు ఒక సమయమున నాగ్రహవేశడైనాడు. శ్రీరామకృష్ణ పరమహంస బిగ్గరగా హరినామ సంకర్తీనము చేయుచు ‘‘గురువే భగవంతుడు, భగవంతుడే గురువు. ఓ గోవిందా! నా జీవాధారమా! మనస్సు శ్రీకృష్ణమయము, ప్రాణము కృష్ణమయము, జ్ఞానము కృష్ణమయము, ఊహలన్నియు కృష్ణమయము, బుద్ధి కృష్ణమయము, నీవే ప్రపంచము, ప్రపంచము నీయందున్నది, నీవు యజమానుడవు, నేను నీ చేత కీలుయంత్రమును’’ అనుచు సమాధిని విరమించిన తరువాత కూడా భజన చేయుచుండిరి. ఒకనాడు తోతాపురితో ఆత్మ విషయమై సంభాషించుచుండగా సాయంకాలమయ్యెను. యధాప్రకారముగా పరమహంస చేతులు తట్టుచూ భగవ్నామ స్మరణ చేయుచుండిరి. ‘‘ప్రారంభ దశలో భగవన్నామము చేయుదురుగాని, ముక్తపురుషుడగు ఈతడును భగవన్నామము చేయుచు, చేతులు తట్టుచు, నృత్యము చేయుచున్నాడేమి?’’ అని తోతాపురి నవ్వుచు అతడింకను అజ్ఞాన స్థితిలోనే ఉన్నాడేమో అని తలచి ఇట్లనెను.
‘‘ఏమి మీరు రొట్టెలు చేయుచున్నారా ఏమి?’’- శ్రీరామకృష్ణ పరమహంస నవ్వుచూ సిగ్గు సిగ్గు బుద్ధిలేనట్లున్నది. నేను భగవంతుని నామ సంకీర్తనము చేయుచు ఆ సందర్భమున చేతులతో భజన చేయుచుండ, మీరు రొట్టెలు చేయు పనితో పోల్చితిరా? సిగ్గు సిగ్గు అని పల్కిరి. తోతాపురియు వారు చేయు పనిలో ఏదో గూఢభావముండునని గ్రహించి, నవ్వుచు ఊరకుండను. మరొక సాయంకాలం తోతాపురి అగ్నిహోత్రమును చేసి జపము చేసుకొనుచుండెను. అప్పుడే పరమహంస వచ్చిరి. ఇరువురును వేదాంతమును చెప్పుకొనుచుండిరి. అంతలో ఆ తోటలోని సేవకుడు ఆ అగ్నిలోని కొన్ని కణములను హుక్కా నిమిత్తమై తీసెను. తోతాపురి వారిని చూచి క్షణమే మండిపడి లేచి తన అగ్నిహోత్రమును మైలపరచినందులకు అతనిని కొట్టబోయెను. పరమహంస అది చూచి సిగ్గు సిగ్గు అని అరచుచు వెర్రి నవ్వుతో నేలపై దొరలాడుచుండిరి. తన శిష్యుని ప్రవర్తనము చూచి తోతాపురి- మీరింత నవ్వవలసిన కారణమేమున్నది? ఈ బుద్ధి తక్కువవాడు చేసిన పని మీకు నచ్చినదా? అని ఆశ్చర్యపడుచుండెను. శ్రీరామకృష్ణ పరమహంస నవ్వుతూ ‘‘అవును, మీ జ్ఞానమెంత లోతుగా ఉన్నదాయని నేను చూచుచుంటిని. ఇంతకుముందే మీరు బ్రహ్మమే సత్యమనియు, అంతయు అసత్యమనియు, ప్రపంచమును బ్రహ్మమయమే అనియు పలికిరి. ఉత్తర క్షణంలో అదంతయు మరచి భేదభావముతో ఒకనిని కొట్టబోవుచుండిరి. మాయ యొక్క అత్యద్భుత శక్తికి నాకు నవ్వు వచ్చినది అని ప్రత్యుత్తరమిచ్చిరి.
తోతాపురియు దీర్ఘాలోచన చేసి కొంచెము సేపు వౌనము వహించి తరువాత ఇట్లు అన్నారు. అవును మీరు చెప్పినది వాస్తవమే. క్రోధమునకు లోనై అంతా మరిచితిని, ఇంద్రియములు బలవత్తరమగు శత్రువులై ఉన్నవి. వాని చేష్టలు మిగుల బాధాకరములై ఉన్నవి. ఈ రోజు మొదలు కోపమును విసర్జించితిని. మరలా నేను కోపించుట మీరు చూడరు. అట్లే తన వాగ్దానమును నెరవేర్చుకొని ధన్యుడయ్యెను.
శ్రీరామకృష్ణ పరమహంస ‘‘మనుష్యుడు - రాముని, కాముని ఇరువురను సేవించలేడు, కొంతసేపు కాముని సేవించుటయని కొంతసేపు రామునికి దూరమున నుండుటయే సంపూర్ణముగా తన దేహము, మనస్సు, హృదయము, రామునకిచ్చినగాని భగవద్దర్శనము కలుగదు. ఒక్క ఇంద్రియమును ఒక్క క్షణమును భగవతదిర విషయమున జొన్పినను ఇంద్రియ నిగ్రహము కానేరదు. కావున సర్వేంద్రియములును భగవత్పరము చేయవలయును. అందువలననే కులశేఖరాళ్వారులు ఇట్లు చెప్పియున్నారు.
నీ పాదములయందు భక్తిలేని పుణ్యహీనులను జన్మ జన్మాంతరములలో ఒక్క క్షణమైనను చూడకుందును గాక /కన్నులు నీ భక్తులను చూచుట యందే వినియోగింపబడునుగాక / నీ చరితమును వదలి వినుటకింపైనను మరియొక చరిత్రను వినకుందునుగాక. శ్తోత్రములు నీ చరిత్రలు వినుటయందే వినియోగపడుగాక. మాధవా, లోక ప్రభూ! నిన్ను మనస్సుచేనైనను నిందించువారిని తలపకుందునుగాక! నా మనస్సు నిన్ను పూజించువారియందే లగ్నమగుగాక! ఎన్ని జన్మములైనను నీ పూజా సంబంధమును లేనివాడను కాకుందునుగాక! నా కరములెప్పుడును నీ పూజయందే వినియోగపడునుగాక! నాలుకా, భగవద్గుణ వర్ణన చేయుము! మనసా మురారిని స్మరింపుము. చేతులారా శ్రీ్ధరుని పూజింపుడు. చెవులారా అచ్యుతుని కథలను వినుడు. కన్నులారా శ్రీకృష్ణుని చూడండి. పాదములారా, భగవత్ సన్నిధికి పొండు. నాసికమా! భగవంతునికర్పింపబడిన తులసిని వాసన చూడుము. శిరమా! భగవంతుని మ్రొక్కుము. సర్వకాల సర్వావవస్థలయందును ఇట్లా చరించువానికి ఇంద్రియ నిగ్రహము కాకుండునా? ప్రహ్లాదుడిట్లా చరించి ఉండలేదా? ఇట్లు మరలించినపుడే ఇంద్రియములు విషయ వాసనలకు దూరమై స్వాధీనములగును. ఇంకను మార్గములున్నను ఇంద్రియ నిగ్రహమున కిదియే సులభ సాధనము. బుద్ధ భగవానుని ధమ్మపదములో ఓ భిక్షులారా! వీడు నన్ను కొట్టెను. వీడు నన్ను తిట్టెను. వీడు నన్ను ఓడించెను. వీడు నన్ను దోచుకొనెను అని విచారపడువానిని క్రోధము విడువదు. ద్వేషము ద్వేషమువలన ఎన్నటికిని నశింపదు, ప్రేమవలనే అది శాంతించును. ఇది సనాతనమైన ధర్మము. ఇట్లు పురుషులు ఇంద్రియలోలురగుదురని భగవానులు సోపానములు చెప్పియున్నారు. కావున ఒక్కొక్కరును ప్రథమముగానే వస్తు దృష్టిచేసి ‘సంగము’ విషయములు తలచుట అను సోపానము నెక్కరాదు. అథవా ఎక్కినను ఆ విషయమును మననం చేయక కోరికయను ద్వితీయ సోపానమునుండియే దిగవలయును. కావుననే ప్రహ్లాదుడు విశ్వమందు గన్న విన్న యర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛ వీడడు.

-వడ్డూరి రామకృష్ణ 9959117167