సబ్ ఫీచర్

ఎంతకాలం ఈ బాధ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం తెల్లవారుఝామున మావోయిస్టులు, మిలీషియా సభ్యులు భారీ సంఖ్యలో కుమార్ సాంద్రా రైల్వేస్టేషన్‌కు వచ్చి స్టేషన్‌ను తగులబెట్టారు. స్టేషన్ పూర్తిగా కాలిపోయింది. సిగ్నలింగ్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి’ అని ఈనెల 15న ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వార్త. ఓ చోట విద్యుత్ సబ్ స్టేషన్ దహనం, మరోచోట మానవ దహనం. ఇలా ప్రతిరోజు ఏదో ఒక పత్రికలో ఒక సామాజిక విధ్వంసం వార్త..్ఫటోలతోసహా.
ఈదేశంలో ఇలాంటి వార్తలు చదివిన వాళ్లలో ఎవరికీ కనీసం చీమ కుట్టినంత బాధకూడా అనిపించదు. అసలు ఆ వార్తే ఎవరూ పట్టించుకోరు.
ఒక దళితుడో, ఒక నిరుపేదో పొట్టకూటి నౌకరీకోసం వెళ్లాల్సిన ఇంటర్వ్యూకు వెళ్లలేడు. ఒక బీద విద్యార్థి తన భవిష్యత్తును నిర్ణయించే విద్యాసంవత్సరాంత పరీక్షకు హాజరుకాలేడు. కన్నతల్లి కడపటి చూపుకోసం కళ్లనిండా నీళ్లతో, గుండెనిండా బరువుతో పరుగెత్తుకొచ్చి, ఆగిపోయిన రైలును చూసి అమ్మకంటే ముందే తాను అనంతవాయువుల్లో కలిసిపోతాడు. ఒక అభాగ్యుడు తన తల్లికి అంత్యక్రియలు జరిపి కొంత రుణమైనా తీర్చుకునే ఆఖరి అవకాశం కూడా కోల్పోతాడు. ఒక దిక్కులేని ముసలి తండ్రి ఎవరో ఒక చిన్ననాటి స్నేహితుడు తనకు చివరి ఊపిరి ఊదడానికి వస్తున్నాడని విని ఆఖరి ఆశల జాలి చూపులతో వాకిలివైపు చూస్తూ రైళ్లు ఆగిపోయినాయి, ఆ ఆప్తమిత్రుడు రావడం లేదని తెలిసి నిరాశా నిస్పృహల నీరసపు చూపులతో అలా కళ్లు తేలవేసి చచ్చిపోవాల్సిందే.
తన తలను, ఆలి మెడలోని తాళిని తాకట్టు పెట్టి నాలుగు రూకలు అప్పు చేసి ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టి గుండెలమీద బండలాంటి బరువు-బాధ్యతలను తీర్చుకుందామనుకుంటూ పెళ్లివారి రైలుకోసం ఎండలో ఎదురుచూస్తున్న దంపతులు ‘రైల్వే స్టేషన్‌కు నిప్పు-రైళ్ల రద్దు’ అన్న ప్రకటన విని కుప్పకూలిపోవాల్సిందే.
రాత్రివేళ సబ్‌స్టేషన్ పేల్చివేతతో చీకట్లో చిక్కుబడిపోయిన ఆ ప్రాంతపు ఏ విద్యార్థీ పరీక్షకు ప్రిపేర్ కాలేక హతాశుడై చావాల్సిందే. ఇలా ఎన్నని చెప్పుకోగలం? ఎన్ని గుండెలు కకావికలైపోనివ్వగలం? ఎన్నిరకాల గమనాలు? ఎన్ని పరుగులు? ఎన్ని బ్రతుకుల చినుగులు? పెళ్లిళ్లు, పరీక్షలు, ఇంటర్వ్యూలు, నౌకరీ అవకాశాలు, అమ్మల ఆఖరి చూపులు, నాన్నల చివరి పలకరింపులు, అక్కయ్యల ఆరాటాలు, అన్నయ్యల ఎదురుచూపులు, కన్నబిడ్డల కౌగిలింతలు, ఆత్మీయులు, ఆప్తుల ఓదార్పు కలయికలు, ప్రాణాన్ని నిలిపే వైద్యులు, జలాన్ని నిలిపే ఇంజనీర్లు, ‘గూళ్లను’ కట్టే కూలీలు, కూడును ఇచ్చే కర్షకులు, కర్మయోగులైన కార్మికులు, శ్రమ దానాల శ్రామికులు, వస్తువులిచ్చే వర్తకులు జీవమున్న రాళ్లలాగా, ‘గుండెలు’ పగిలిన బండల్లాగ ఎక్కడి వాళ్లక్కడ ఉండిపోవాల్సిందేనా?
ఇదేనా ఈ దేశపు మావోయిస్టులు, పోరాటవాదులం అని చెప్పుకునే వాళ్లు కోరుకునే, ప్రచారం చేసుకునే ప్రజాశ్రేయస్సు, సాంఘికాభ్యుదయం, జనచైతన్యం, పురోగతికోసం పోరాటం, ప్రజలకై బిగించిన ‘పిడికిలి’?
సగటు మనుషులు, మధ్య తరగతి కుటుంబీకులు, చాలీచాలని రాబడుల బడుగు బ్రతుకుల సామాన్య జనులు కష్టపడి సంసారాలు ఈదుకుంటూ నిజాయితీగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో కోట్లకొలది రూపాయలను ప్రభుత్వ ఖజానాలకు ధారపోస్తున్నారు. అలాంటి ప్రజల కష్టార్జితపు సొమ్ముల వాటాతోనే వేలకోట్ల ఖర్చులతో రైల్వేస్టేషన్లు, రవాణాసౌకర్యాలు, విద్యుత్సదుపాయాలు, నీటి సరఫరాలు మొదలైనవి ఏర్పాటవుతుంటే ఒక్కక్షణంలో అవి ఇలా బుగ్గిపాలైపోయి ప్రజలు క్షోభించాల్సిందేనా?
పోరాటం పేరుతో ఇలా సామాన్య జనులను క్షోభపెట్టే అసమర్థనీయమైన దుందుడుకు మార్గపు హక్కును ఈ మావోయిస్టులకు ఎవరిచ్చారు? ఇంకెవరు? ఈ దేశంలో విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో, సాహిత్య సంస్థల్లో, కొన్ని పత్రికల సంపాదక వర్గాల్లో, కొందరు బాధ్యతా రహిత పుస్తక రచయితల్లో ప్రచురణ కర్తల్లో, స్థానబలం సంపాదించుకొని స్థిరపడిన కుహనా మేధావులు, గతి తప్పిన తార్కికులు, ‘పడమటి’ వెడగుగాలుల ప్రాచార్యులు, ఆచార్యులు, ఉపన్యాసకులు, ఉపాధ్యాయులు, రచయితలు, కవులు, కళాకారులు, కొందరు పత్రికా సంపాదకులు, కొన్ని అమ్ముడుపోయిన ఛానళ్లూను.
ధనబలంతో, స్థానబలంతో, కండకావరంతో, కొన్నిచోట్లల కులవర్గ్ధాపత్య జవసత్వ ఆధిక్యంతో కొందరు ధూర్తులైన మోతుబరులు, కామందులు, కులపెద్దలు-వీరిలో ఎవరో ఒకరు తమ 4పాంతంలోని నోరులేనివాళ్లను, బీదబిక్కీలను, పని-పాటక జనాన్ని, రైతుకూలీలలను, శ్రామికులను పీడిస్తూ వాళ్ల రక్తాన్ని పిండుకుంటూ, వాళ్ల మానప్రాణాలను దోచుకుంటున్నారు. ఈ రకమైన దొర రూపపు దొంగల దోపిడీని అంతం చేసి సమసమాజ స్థాపన చేయడానికే మారుూ మావోయిస్టుడ చర్యలన్నీ- అది రక్షణశాఖ జవాన్లను కాల్చేయడం కానివ్వండి, రక్షక భటులను పేల్చేయడం కానివ్వండి. వంతెనలను కూల్చివేయడం కానివ్వండ, మందుపాతరల ఏర్పాట్లు, పోలీస్‌స్టేషన్ల, రైల్వేస్టేషన్ల, టెలిఫోన్ లైన్ల, రవాణా మార్గాల, వివిధ ప్రజాకోటి సదుపాయాల విధ్వంసం-ఇలా ఏదైనా కానివ్వండి’ అంటున్నారు మావోయిస్టులు, వాళ్ల పుస్తక-పత్రికా మాధ్యమం ద్వారా. వీరు చెబుతున్న ప్రజాకంటకుల సంగతి సరే. ప్రాణం లేని కట్టడాలు ఏం నేరం చేశాయి.? స్వార్థపరులైన కొందరు వ్యక్తులు సమాజం మీద పెత్తనం చలాయిస్తున్న ఈ పరిస్థితికి కారణాలు.. 1947నుంచి నేటివరకు మనదేశాన్ని నడుపుతున్న రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలు, వివిధ రాజకీయ పక్షాల పెడత్రోవలు, వాళ్లు నెరపుతున్న సంకుచిత, కుటిల రాజకీయాలూను. కీలెరిగి వాతపెట్టాలి. రోగలక్షణము-మూలము తెలుసుకుని మందివ్వాలి. పాము ఎక్కడ ఉందో చూసి దానిని చంపాలి. చేతనైతే వివిధ కుటిల రాజకీయ నాయకుల భరతం పట్టాలి. అంతేగాని కొంతమంది అమాయకులు, విద్యావంతులైన నిరుద్యోగులను సమీకరించి విధ్వంసంమే అభ్యుదయ మార్గం అనుకోవడం అవివేకమే.
గతంలో నక్సలైట్ భావజాలంతో ఆయుధం పట్టి అడవులకు వెళ్లి ఏదో చేసేద్దాం, ఎంతో సాధిద్దాం అనుకుని ముందుకెళ్లిన కీ.శే. జ్వాలాముఖి ఆ తరువాత ఆ ఉద్యమం వదలిపెట్టి బయటకు వచ్చి ఒక బహిరంగ సభలో ‘తుపాకీ పేల్చడంతోను, మనుషులను కాల్చటంతోను ఏమీ సాధించలేం. జనాన్ని మన ఉద్దేశం వైపు ఆలోచింపచేసి, వాళ్లకు నచ్చజెబ్బి మానసికంగా ఒప్పించి సంఘాన్ని మార్చాలి అని అన్నారు. ఇదీ-సరైన మార్గం. కుటిల రాజకీయ నాయకుల కళల్లుల తెరిపించడం విద్యావంతుల మేధావుల ప్రథమ కర్తవ్యం.మనిషి చేయాల్సింది మంచిమార్పు. కానీ మారణకాండ కాదు. దొంగలు పడితే సొమ్మేపోతుంది. తగలబడితే సర్వం పోతుంది. ధనంకంటే వస్తువు విలువైనదని ఆర్థికశాస్త్రం చెబుతుంది. వంద రూపాయల కరెన్నీ నోటును ముద్రించే ఖర్చుకంటే వంద రూపాయలు దొరికే సుమారు ఒక కిలో ఇనుమును ఉత్పత్తి చేసే ఖర్చు పదిరెట్లు ఎక్కువ ఉంటుంది.
మనిషి ప్రాణం యొక్క అమూల్యత, అతనికి పనికివచ్చే ప్రతి వస్తువు యొక్క విలువ-వీటిగూర్చి ఆలోలచించాలి.. సమాజంగాని, మావోయిస్టులుగానీ. అంతకంటే ముందు ఇలా విచికిత్స, వివేచనలు చేయడం ఈ దేశంలో ప్రతి కవి, రచయిత, విద్యావంతుడు చేయాల్సిన పని. సదాశయానికి సమగ్రాలలోచన సోపానం. సమగ్రాలోచనకు సదాచరణే ప్రమాణం. ఇదే నేడు ‘అక్షర తపస్వుల’ కర్తవ్య. ఎంతనేరం విద్యావంతుల కర్తవ్య విమూఢత్వం?! ఎంతకాలం సమాజానికి ఈ సలపరింత?

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం