సబ్ ఫీచర్

ముత్యాల సోయగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దగ్గర ఎన్ని రకాల నగలున్నా ఒక పేట ముత్యాలహారమన్నా లేకపోతే ఏదో వెలితి. ఏ రకపు దుస్తుల మీదికైనా, ఎలాంటి శుభకార్యమైనా, సందర్భమైనా ఒక ముత్యాల ఆభరణం వేసుకుంటే చాలు. ఆ అందమే వేరు. అందుకే ఆడపిల్లల నగలపెట్టెలో ఒక్కటైనా ముత్యాల ఆభరణం ఉంటుంది. నాజూకుదనం, మెరుపు, అందం కలబోసుకున్న ముత్యాలపై ఎవరు మనసు పారేసుకోరు చెప్పండి.. అయితే ఎవరికి ఎటువంటి ముత్యాలు బాగుంటాయో చూద్దాం..
తెల్లని మేనిఛాయ ఉన్నవారికి తెలుపు, గులాబీ, వెండి రంగులలో ఉన్న ముత్యాలు బాగా నప్పుతాయి. చామన ఛాయ ఉన్నవారికి లేత గోధుమ రంగు ముత్యాలు అందం ఉంటాయి. గుండ్రంగా, బొద్దుగా, ముద్దబంతిపూవులా ముఖాకృతి ఉన్నవారికి ఒత్తుగా ఉండే ముత్యాల జూకాలు కానీ, చాంద్‌బాలీలు కానీ ధరిస్తే వచ్చే అందమే వేరు. శంఖంలాంటి పొడవాటి మెడ ఉన్నవారు ముత్యాల చోకర్లు ధరిస్తే అత్యద్భుతంగా ఉంటారు. మెడభాగం కాస్త మందంగా, పొట్టిగా ఉండేవారు పొడవాటి ముత్యాల హారాలను ధరిస్తే బాగుంటుంది. ఇక చిన్న చిన్న పార్టీలకు వెళ్లేవారికి, ఆఫీసులకు వెళ్లేవారికి లావుపాటి ఒంటిపేట ముత్యాల హారం వేసుకుంటే హుందాగా ఉంటుంది. ఇది చీరపైకి అయినా, పంజాబీ డ్రెస్‌పైకి అయినా, కుర్తా పైకి అయినా బాగుంటుంది. ఇకెందుకు ఆలస్యం.. మీకు నప్పే, మీకు నచ్చే ముత్యాల హారాన్ని ఎంచుకుని అందంగా మెరిసిపోండి.