సబ్ ఫీచర్

తల్లిదండ్రులకు పరీక్షా సమయం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లిదండ్రులకు పరీక్షా సమయం వచ్చింది. పిల్లలు పైతరగతికి ప్రమోట్ అయినా, ఒకవేళ ఉద్యోగరీత్యా బదిలీపై మరోచోటికి వెళ్లినా ఎదురయ్యే ముఖ్య సమస్య మంచి స్కూలు ఎంపిక. అసలు పిల్లల ఉజ్జ్వల భవిత తల్లిదండ్రులు ఎంపిక చేసే విద్యా సంస్థపైనే ఆధారపడి వున్నదనేది వాస్తవ విషయం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు స్కూళ్ళ ప్రచార జోరుకి లొంగిపోక, ఆయా పాఠశాలల వాస్తవ స్థితిగతుల్ని, బోధనా సిబ్బంది శక్తి సామర్థ్యాలను కూలంకషంగా విచారించాలి. ఆయా పాఠశాలల్లో చదివిన, చదువుతున్న బాల బాలికల తల్లిదండ్రులను వ్యక్తిగతంగా కలిసి, ఆ పాఠశాల పుట్టు పూర్వోత్తరాలను, గత సంవత్సరపు ఫలితాలను పరిశీలించి, పరిశోధించి ముందడుగు వేయడం పిల్లల భవితను కోరే తల్లిదండ్రుల కనీస కర్తవ్యం. కొన్ని స్కూళ్ళలో సంవత్సరం పొడుగునా ఏదో ఒక పేరుతో డబ్బులు వసూలు చేస్తూనే వుంటారు. ముందు పిల్ల ల్ని చేర్పించేసి, ఆనక మేము అవి కట్టం, ఇవి కట్టం అంటే అటు మీకు, ఇటు స్కూలు యాజమాన్యానికి మధ్యలో నలిగిపోయేది మీ చిన్నారు లే. కొన్ని స్కూళ్ళల్లో చదువులు బాగుంటా యి. ఫలితాలు బాగున్నాయి కదాని వెంటనే పిల్లల్ని తీసుకెళ్లి ఆయా స్కూళ్ళలో చేర్పించయకూడదు. పిల్లల ఫలితాల పట్ల అమితమైన శ్రద్ధతో వాళ్ళు మరీ కష్టతరమైన పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్నారేమో గమనించాలి. ఇటువంటి విషయాల్లో ఆ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రుల్ని సంప్రదిస్తే ప్రయోజనం వుండదు. పిల్లల్నే అడిగి తెలుసుకోవాలి. స్కూల్లో ఆటస్థలం వుందా, పిల్లలు ఆటల పట్ల శ్రద్ధ వహిస్తున్నారా లేదా అనే విషయా లు కూడా గమనించాలి. ఇక రెసిడెన్షియల్ స్కూళ్ళలో చేర్పించదలచుకుంటే స్కూళ్ళ ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ విద్యాబోధన పద్ధతులు, ఫలితాల గురించే కాకుండా హాస్టలు వసతి, పిల్లలకి అన్ని సదుపాయాలున్నాయా లేదా? ఎటువంటి ఆహారం ఇస్తున్నారు? అక్కడ పనిచేసే సిబ్బంది ఎలాంటివారు మొదలైన విషయాలు కూడా గమనించవలసి వుంటుంది. ముఖ్యంగా చేర్పించబోయే స్కూలు పట్ల మీ పిల్లల అభిప్రాయాల్ని కూడా కనుక్కోవడం మం చిది. మీరు నిర్ణయించిన స్కూళ్ళలో చేరడానికి మీ పిల్లలకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో కనుక్కోవాలి. ఆ పిల్లలకేం తెలుసు అని మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యతిరేకత తరువాత వారి చదువులలో కనబడుతుంది. ఫీజు లు తక్కువని ప్రచార ఆర్భాటాలకు లొంగిపోయి, ఏదో ఒక స్కూల్లో చేర్పిస్తే ఆనక ఓ విద్యా సంవత్సరంపాటు ఇటు మీరు, అటు పిల్లలూ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మెలకువతో మంచి స్కూలును ఎంచుకోవాలి.

- ఆళ్ళ నాగేశ్వరరావు