సబ్ ఫీచర్

శాపాలతోనే జన్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురాణ వ్యక్తులు - పూర్వజన్మలు

నేను అందరికీ మంచిని బోధిస్తుంటాను. లోక కల్యాణం కోసం చేసే పనులను చూసి కొందరు కలహభోజనుడని కూడా నన్ను అంటుంటారు కదా. అసలు ఈ ముల్లోకాలను తిరుగుతూ ఉండడానికి కారణం మీకు తెలుసా? నేను బ్రహ్మ మానసపుత్రుడిని కదా. నాకు తెలిసినప్పటినుంచి నేను విష్ణునామాన్ని జపిస్తూ తిరిగేవాడిని. ఒకసారి నా తండ్రి నన్ను సృష్టిని పెంచమని చెప్పాడు. ‘తండ్రీ ఈ సంసార లంపటం నాకెందుకు? నేను నిరంతరమూ విష్ణ్ధ్యునం చేసుకుంటూ ఉంటాను. నేను నీవు చెప్పిన పనిని చేయజాలను’ అని చెప్పాను. చెప్పిన పని చేయలేదని మా తండ్రి నన్ను ‘స్ర్తి కాముకుడవై చరిస్తూ ఒక శూద్రయోనిలో పుడుదువుగాక’ అని శపించాడు. దీనికి ఎంతో విచారించి మా తండ్రిని నన్ను అనుగ్రహింపుమని కోరుకున్నాను. అపుడు బ్రహ్మ దయతలచి నీకు విష్ణ్భుక్తులైన బ్రాహ్మణుల వలన తిరిగి నీలో విష్ణ్భుక్తి మేల్కొంటుంది పో అని శాపానుగ్రహం ఇచ్చాడు. నేను దానికి చింతిస్తూ కాలం గడుపుతున్నాను.
అంతేకాదు నేను దక్షునివలన కూడా శాపం పొందాను. ఒకసారి దక్షుడు తన కుమారులకు సృష్టిని పెంచే పనిని అప్పగించాడు. ఆ కుమారులు కూడా తండ్రి చెప్పిన పని చేయడానికి ముందుకు వచ్చారు. ఆ సంగతి నేను విని వారి వద్దకు వెళ్లి ‘ఎందుకయ్యా మీకీ గోల? హాయిగా విష్ణునామాన్ని జపిస్తూ ముక్తికోరక ఈ సృష్టి కార్యం అనుకుంటూ విష్ణుమాయలో పడిపోతున్నారు. మీరెన్నాళ్లు ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుంటారు?’ అని అడిగాను. అంతేవారు నా మాట విని సృష్టి కార్యం చేయమని చెప్పారు. దక్షుడు జరిగిన సంగతి తెలుసుకున్నాడు. నావల్ల వారి పనికి విఘ్నం కలిగిందని నా తండ్రితో చెప్పాడు. పైగా దక్షుడు ‘నీవు నిల్చున్నచోట నిల్చోకుండా మహతి పట్టుకుని అనుక్షణమూ తిరుగుతుండెదవు గాక!’ అని శపించాడు. ఆయన కోపం చల్లారక నా తండ్రి చేత కూడా ‘దక్షుని పుత్రికకే నీవు జన్మింతువుగాక!’ అని శాపాన్ని ఇచ్చాడు. అట్లా నేను ఒక జన్మలో దక్షుని పుత్రికకు కుమారుడిగా పుట్టాను.
ఒకసారి నాకు విష్ణుమూర్తి మాయ తెలుసుకోవాలని కోరిక కలిగింది. కోరికలే గదా జన్మలకు కారణం. అట్లా నేను ఒకసారి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి నాకు నీ మాయ గురించి చెప్పమని అడిగాను. విష్ణువు సరే అన్నాడు. అదిగో దగ్గరలో కనబడుతున్న తటాకంలో స్నానం చేసి రమ్మన్నాడు.
అంతే.. తటాంలో మునిగిన నాకు పూర్వజన్మ స్మృతి పోయింది. నేను స్ర్తిగా మారాను. నేను కాశీరాజు కుమార్తెగాను, నా పేరు చారుమతిగా మారింది. నేను శిబిని పెళ్లి చేసుకున్నాను. నగ్నజితి, విప్రజిత్తి, విచిత్తి, చారువక్త్రుడు, చిత్తుడు అనే కుమారులు పుట్టారు. వీరిని వీరాధివీరులుగా పెంచాను. నా భర్త అంటే నాకు చాలా అనురాగం ఉండేది. ఆయనకు సాటి వచ్చే వీరులు ఎవరూ లేకుండేవారు. దానితో ఆయన రాజ్యవిస్తరణ చేయదల్చాడు. పక్కనున్న రాజులతో యుద్ధాలు చేస్తూ జైత్రయాత్ర సాగించాలని బయలుదేరాడు. ఆయనకు తోడుగా నా కుమారులు కూడా వెళ్లారు. కొన్నాళ్లకు వారంతా యుద్ధంలో చనిపోయారు. దాంతో నాకు మతి చలించింది. ఒక్కదాన్ని అందరినీ పోగొట్టుకుని ఎలా జీవిస్తాను అని చాలా బాధపడ్డాను. చివరకు దేవునికి దణ్ణం పెట్టి నన్ను నా వాళ్ల దగ్గరకు తీసుకునిపో అని చెప్పుకుంటూ చితి పేర్చుకుని అందులో దూకపోయాను. అపుడు విష్ణుమూర్తి వచ్చాడు. ‘నారదా! ఎందుకు చితి పేర్చుకుంటున్నావు?’ అని అడిగాడు. నాకు చిత్రం అనిపించింది. అదేంటి? నన్ను నారదా అని పిలుస్తారు. నా పేరు చారుమతి. నా భర్త, కుమారులు అందరూ వీరమరణం పొందారు. వారు లేని ఈ జన్మ నాకెందుకు అని చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పాను. అంతే, విష్ణుమూర్తి పకపకా నవ్వి అటులనా అని నా తలపై చేయి పెట్టాడు. అంతే నాకు పూర్వస్మృతి కలిగింది. నేను విష్ణుమాయను తెలుసుకోవాలనుకున్నాను కదా. ఒక్క కోరికవల్ల నేను ఇన్ని వేల యేండ్లు స్ర్తిగా జీవించానా అని నాకు నేను ఆశ్చర్యపోయాను.
ఇంత అనుభవించిన నేను మరలా కొలనులో స్నానమాడి స్ర్తిగా మారిపోయాను. అపుడు నన్ను తాళ ధ్వజుండు అను రాజు పెళ్లిచేసుకున్నాడు. తన నగరానికి తీసుకునివెళ్లి కాపురం చేశాడు. నలుగురు కొడుకులు పుట్టారు. వారంతా కూడా ఒకానొక యుద్ధంలో చనిపోయారు. అపుడు వారు పోయారని నేను చింతిస్తుంటే విష్ణుమూర్తి వృద్ధునిగా వచ్చి జీవితంలో చనిపోవడం, జన్మించడం అనేవి జరుగుతూ ఉంటాయి. దానికోసం బాధపడనక్కర్లేదని చెప్పి ఒక కొలనులో స్నానం చేసిరా నీ దుఃఖం పోతుందని చెప్పాడు. నేను అట్లా చేసాను. స్నానం చేసి గట్టుకు వచ్చేసరికి ఎదురుగా విష్ణుమూర్తి కూర్చుని ఉన్నాడు. నాకు నారద రూపం వచ్చింది. జరిగిందంతా కలలా కనిపించింది. దానితో అమ్మో విష్ణుమాయను కనుగొనాలనుకుంటే పదే పదే సంసార చక్రంలో పడిపోతానని అర్థమయింది నాకు. నేను వందనం ఆచరించి నాపై కాస్త కృప చూపించమని మాయలో చిక్కుకోకుండా చూడమని వేడుకున్నాను.
ఇంతేకాదు నాకు ఇంకా ఎన్నో జన్మలున్నాయి. వాటి గురించి కూడా చెప్తాను.

(ఇంకా ఉంది)

-డా. రాయసం లక్ష్మి