సబ్ ఫీచర్

ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడే వాడు మీ పట్ల చాలా కృతజ్ఞతతో ఉంటాడు. లేకపోతే ఏ పసివాడైనా తన తల్లిదండ్రులపట్ల చాలా కోపంతో ఉంటాడు. ఎందుకంటే, స్వీయానుభవం లేని తల్లిదండ్రులు నియమ నిబంధనల పేరుతో వాడి స్వేచ్ఛను హరించి, వాడు ఏదైనా ప్రశ్నించేందుకు ముందే ఎందుకూ పనికిరాని నకిలీ సమాధానాలతో వాడి మనసును నింపి, అన్ని రకాలుగా వాడిని సర్వనాశనం చేస్తారు. అలా ఈ ప్రపంచమంతా మానసిక బానిసత్వంలో జీవిస్తోంది.
స్వేచ్ఛ యొక్క మూడవ పార్శ్వం ‘ఆధ్యాత్మిక స్వేచ్ఛ’. అంటే, మీరు శరీరము కాదని, మనసు కాదని, శుద్ధ చైతన్యమే మీరని తెలుసుకోవడమే. ఇదే స్వేచ్ఛ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయం. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే అది మీకు తెలుస్తుంది. ధ్యానం మిమ్మల్ని మీ శరీరం నుంచి, మీ మనసు నుంచి వేరు చేసి చివరికి మిమ్మల్ని నిర్మలమైన ఎరుకతో కూడిన శుద్ధ చైతన్యంగా మలుస్తుంది. ‘ఆధ్యాత్మిక స్వేచ్ఛ’ అంటే అదే. కాబట్టి పైన చెప్పిన భౌతిక స్వేచ్ఛ, మానసిక స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛలే వ్యక్తి స్వేచ్ఛకున్న మూడు వౌలిక పార్శ్వాలు.
ఏ సమూహానికైనా కేవలం పేరు మాత్రమే ఉంటుంది. ఆ పేరు కూడా కేవలం ఒక పదం మాత్రమే. అంతేకానీ, దానికి ఆత్మ, మనసు, శరీరాలు అనేవి ఉండవు. పైగా దానికి స్వేచ్ఛతో పనిలేదు. ఎందుకంటే, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉన్నట్లైతే సమూహానికి స్వేచ్ఛ ఉన్నట్లే కదా. కానీ, మనం మనకే తెలియకుండా ఏ మాత్రం పస లేని పదాల ప్రభావానికి కూడా చాలా ఎక్కువగా గురి అవుతాం. సంఘం, సమాజం, మతం, చర్చి- ఈ సమూహాలన్నీ కేవలం పదాలు మాత్రమే. అంతేకానీ, వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదు. నిజానికి, వ్యక్తులలోనే వాస్తవముంటుంది. లేకపోతే, పెద్ద సమస్య ఉన్నట్లే. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్‌లు కేవలం పేర్లు తప్ప వాటికున్న స్వేచ్ఛ ఏమిటి?
సమూహమనేది చాలా ప్రమాదకరమైన భావన. దానిపేరు మీద వ్యక్తులు ఎప్పుడూ బలి అవుతూనే ఉంటారు. నేను దానికి పూర్తిగా వ్యతిరేకిని. ‘దేశం’ అనేది కేవలం పేరు మాత్రమే. కానీ దేశం పేరుమీద అనేక దేశాలు అనేకమందిని బలి చేశాయి. ప్రపంచ పటాలలో మీరు గీసిన దేశాల సరిహద్దుల గీతలు ఈ భూమిపై ఎక్కడా ఉండవు. కానీ, అవాస్తవమైన ఆ సరిహద్దుల గీతల కోసం జరిగిన యుద్ధాలలో అనేక లక్షలమంది ప్రజలు మరణించారు. కేవలం ప్రపంచ పటాలలో గీసిన కొన్ని పిచ్చిగీతల కోసం అనేకమంది ప్రజలు చనిపోతున్నారు. అలా చనిపోయినవారిని మీరు జాతీయ వీరులుగా ప్రకటిస్తూ అమరవీరులుగా చిత్రీకరిస్తున్నారు. ఇదంతా కేవలం మీరు ఆడే ఆట.
కాబట్టి, సమూహమనే భావనను పూర్తిగా నాశనం చెయ్యాలి. లేకపోతే, ఏదో ఒక విధంగా మనం వ్యక్తులను బలి చేస్తూనే ఉంటాం. చివరికి మతం పేరు మీద, ధర్మయుద్ధాల పేరుమీద కూడా మనం అనేకమందిని బలి చేశాము. కలలో కూడా ఎవరూ ఊహించలేని సుఖాలతో కూడిన స్వర్గం ఇస్లాం కోసం మరణిస్తున్న ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా లభిస్తుందని మహమ్మదీయ గురువులందరూ అందరికీ బోధిస్తారు. అందువల్ల ‘‘తనకు కచ్చితంగా స్వర్గం దక్కుతుందని’’ ‘జిహాద్’ పేరుమీద ధర్మయుద్ధంలో చనిపోతున్న ప్రతి మహమ్మదీయునికి తెలుసు. ఇంకా చెప్పాలంటే, ఒక మహమ్మదీయునిచేత చంపబడ్డ ప్రతి మహమ్మదీయుడు స్వర్గానికి వెళ్తాడు. అది అతని హక్కు. అందువల్ల ‘‘మీరు ఒక వ్యక్తిని చంపారు’’ అనే అపరాధ భావనతో మీకు ఏ మాత్రం పనిలేదు. ఎందుకంటే, మీరు చంపిన వ్యక్తి కూడా ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు కదా!
క్రైస్తవులు కూడా ధర్మాయుద్ధాల పేరుమీద సజీవ దహనాలతో అనేక మారణహోమాలు చేసినవారే. ఎందుకో తెలుసా? కేవలం క్రైస్తవ సమూహాన్ని మరింత పెంచేందుకే వారు అలా చేశారు. క్రైస్తవం, బౌద్ధం, హిందూత్వం, ఫాసిజం, సామ్యవాదం- ఇలా ఒక సమూహానికి సంబంధించిన ఏ పదమైనా కావచ్చు. వాటికోసం ఎంతమందినైనా బలి చెయ్యగలం. అయితే, అలాంటి సమూహాలు ఉండవలసిన అవసరం ఏ మాత్రం లేదు. అందుకు ఎలాంటి కారణమూ కనిపించదు. భౌతిక స్వేచ్ఛ, మానసిక స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛలతో కూడిన వ్యక్తులుంటే చాలు. అలాంటి వ్యక్తులతో కూడిన సమూహం సహజంగానే ఆధ్యాత్మిక స్వేచ్ఛ కలిగి ఉంటుంది.
‘‘అనేకమంది వ్యక్తులతో కూడుకున్నదే సమూహం. ఒక వ్యక్తి ఎప్పటికీ ఒక సమూహం కాలేడు. అతడు ఎప్పుడూసమూహంలో ఒక భాగం మాత్రమే’’ అని బోధించడం జరిగింది. కానీ, అది నిజం కాదు. ఒక వ్యక్తి కేవలం సమూహంలో ఒక భాగం మాత్రమే కాదు. అనేకమంది వ్యక్తుల కలయికకే సమూహమనే పేరు లాంఛనప్రాయంగా వచ్చింది. కాబట్టి, సమూహంలోని వారందరూ ఎవరికివారు స్వతంత్రులు. అంతేకానీ, వారు దేనిలోనో భాగం కారు, కాలేరు. మనకు నిజంగా స్వేచ్ఛా ప్రపంచం కావాలంటే, గతంలో సమూహాల పేరు మీద అనేక ఘోర మారణకాండలు జరిగాయని, అలాంటి వాటికి వెంటనే స్వస్తి పలికే సమయం ఇపుడు ఆసన్నమైందని ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అంతేకాదు, సమూహాల పేరులకున్న గత వైభవం పూర్తిగా అంతరించిపోవాలి. దానితోపాటు వ్యక్తులందరూ ఉన్నతమైన విలువలతో ఉండాలి. (ఇంకా ఉంది)

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్