సబ్ ఫీచర్

పుణ్యపురుషుడు.. ‘మోక్షగుండం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్నారు మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే.. అక్కడ సాంకేతికపరమైన ఇంజనీరింగ్ రంగం పటుత్వంగా ఉండాలి. ప్రపంచంలో గొప్ప ఇంజనీర్‌గా పేరుప్రతిష్ఠలు సాధించి మన దేశ కీర్తిని ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య. 1955లో భారత ప్రభుత్వం మన దేశపు అత్యుత్తమ అవార్డు ‘్భరతరత్న’ బిరుదునిచ్చి సర్ విశే్వశ్వరయ్యను సత్కరించిందంటే, ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 15న వారి 158వ జయంతి. మైసూర్ రాష్ట్రం కోలార్ జిల్లాలోని కుగ్రామంలో జన్మించిన సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య 20వ యేట బెంగుళూర్ కాలేజీలో పట్ట్భద్రుడై, పుణె ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. ఆ రోజుల్లో సింధూ రాష్ట్రంలోని ‘సుక్కూర్’కు నీటికొరత ఉండేది. ఆ కొరతను తీర్చే మార్గాన్ని అనే్వషించవలసిందిగా సర్ విశే్వశ్వరయ్యను ప్రభుత్వం అక్కడకు పంపగా, ఆయన ఎంతో సమర్థతతో సుక్కూర్ వాటర్‌వర్క్స్ స్కీమును రూపొందించి, ఆ నిర్మాణాన్ని పూర్తిచేసి అక్కడి ప్రజలకు నీటికొరతను నివారించి వారి మన్ననలందుకొని తన ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించటంతో కాలక్రమంలో ఆయనకు ఎన్నో ఉన్నత పదవులు లభించాయి.
ప్రఖ్యాత భారత ఇంజనీర్‌గా విశే్వశ్వరయ్య జపాన్, చైనా దేశాలు సందర్శించారు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించి ఆ ప్రభుత్వాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను సలహాల రూపంలో ఆయన నుంచి స్వీకరించాయి. ఆయన ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన చైనా ప్రభుత్వం, ఆ దేశపు ప్రధాన ఇంజనీర్ సలహాదారునిగా నియమించుకోవాలని ప్రయత్నించింది. కాని చైనా ప్రభుత్వ కోర్కెను తిరస్కరించి, తన దేశభక్తిని చాటుకున్న గొప్ప జాతీయవాది మోక్షగుండం విశే్వశ్వరయ్య.
1909లో రిటైర్ అయ్యేనాటికి విదేశాలలోని ఏ ప్రసిద్ధ ఇంజనీర్‌కు తీసిపోని ప్రతిభ, పేరుప్రతిష్టలు, అనుభవాన్ని ఆయన సంపాదించారు. అది విన్న మైసూర్ మహారాజు సర్ విశే్వశ్వరయ్యను తన ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్‌గా, మరికొద్ది కాలానికి ప్రభుత్వ, దివానుగా నియమించడం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.
ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలు, దశవర్ష ప్రణాళికలు మారిస్తే మన ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధి సాధించేదని ఆ మహానీయుడు 1934లోనే ‘ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా’ అనే గ్రంథంలో రాశారు.
వరదలతో ముంచివేస్తుండే ‘మూసీ’ని ముకుతాళ్లతో బంధించిన ఘనత విశే్వశ్వరయ్యకే దక్కింది. ఆయన మేధాసంపత్తితో కృషితో జరిగిన అభివృద్ధి పనులు కోకొల్లలు. అందులో మచ్చుకు కొన్ని మైసూర్ యూనివర్సిటీ, మైసూర్ బ్యాంక్, సబ్బు ఫ్యాక్టరీ, భద్రావతి స్టీలు, వర్క్ మొదలైనవి. మన దేశాన్ని ‘నవభారత’ దేశంగా మార్చేందుకు, నవసూత్ర పథకాన్ని రూపొందించారాయన. అవి, 1) వయోజన విద్యాప్రచారం, 2) పరస్పర సహకారం, 3) స్వయం సహాయం, 4) నిరక్షరాస్యత నిర్మూలన, 5) అవసరాన్నిబట్టి ఆదుకోవడం, 6) ఆధునిక సాధన సామగ్రిని వృద్ధిపరచటం, 7) పొదుపు, 8) నూతన పద్ధతులను ఉపయోగించడం, 9) దేశాభివృద్ధి సాధించడం.
విశేష సేవలందించిన విశే్వశ్వరయ్యకు బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ బిరుదునిచ్చి సత్కరించింది. స్కాట్లాండులోని లేక్‌షైర్ స్టోరేజి రిజర్వాయర్ తలుపులను నిర్మించడంలో అక్కడి ఇంజనీర్లు విఫలమైతే, అక్కడికి వెళ్ళి విశే్వశ్వరయ్య అత్యంత నైపుణ్యంతో వాటిని నిర్మించి మన దేశ ప్రతిష్టను పెంపొందించారాయన. 1861లో జన్మించి 1962లో మరణించి సరిగ్గా నూరు సంవత్సరాలు జీవించిన విశే్వశ్వరయ్య పూర్ణపురుషుడే గాక పుణ్యపురుషుడు కూడా. భారతీయ ఇంజనీరింగ్ రంగంలో విప్లవం తెచ్చి మన ఇంజనీర్లకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి విశే్వశ్వరయ్య చిరస్మరణీయుడు. ఆత్మగౌరవం గల స్వయం పోషకత్వంతో, అభ్యుదయ దృక్పథంగల జాతిగా భారతదేశాన్ని అభివృద్ధిపరచాలని ఎంతగానో ఆశించిన వ్యక్తి విశే్వశ్వరయ్య. తుప్పుపట్టిన ఇనుములా గాక, కరిగిపోయే గంధంలా సమాజసేవకు పాటుపడాలని ఆయన ఆకాంక్ష. ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం విశే్వశ్వరయ్య జన్మదినం సెప్టెంబర్ 15వ తేదీని ‘ఇంజనీర్స్ డే’గా అధికారికంగా ప్రకటించి, ఆరోజు ఉత్తమ ఇంజనీర్లకు అవార్డులను ప్రవేశపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహనీయునికి హృదయ పూర్వక అక్షర నివాళి.

-- కామారపు జగదీశ్వర్, 94404 70338