సబ్ ఫీచర్

బీటలువారుతున్న వైవాహిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అత్యంత పురాతనమైన, పవిత్రమైన కుటుంబ వ్యవస్థ భారతదేశంలో వుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ భువిపై మానవ జన్మతో అవతరించి కుటుంబ వ్యవస్థ, మానవుల ధర్మయుత జీవన విధానం ఎలా వుండాలో ఆచరించి చూపారు. ద్వాపరయుగంలో పాండవులు సమైక్యత, పవిత్రత, కుటుంబ ప్రేమానురాగాలకు ప్రతీకలుగా నిలిచారు. ప్రపంచంలో ప్రేమ, త్యాగం, కరుణ, సమైక్యత, ధర్మం, ఆదర్శ దాంపత్యం- ఇత్యాది అత్యున్నత విలువలకు భారతీయ వేదవాఙ్మయమే దిక్సూచిగా నిలిచింది. పవిత్ర కుటుంబ జీవనానికి పునాది వివాహం. నాటి త్రేతాయుగం నుండి కలియుగంలో 21వ శతాబ్దం వరకు వైవాహిక జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే సామాజిక నిపుణులు, ఆధ్యాత్మికవేత్తలు, వివిధ మత గురువులు భారతీయ హైందవ వైవాహిక జీవితం వైపే చూస్తారు. ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా..’ అంటూ పురుషుడు అగ్నిసాక్షిగా స్ర్తి మెడలో మాంగల్యధారణ చేసి పవిత్ర వైవాహిక జీవితానికి నాంది పలుకుతాడు. ‘్ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచః నాతి చరామి’ అంటూ ధర్మార్థ కామ మోక్ష సాధనలో, జీవితాంతం ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నా అర్థాంగి చేయి విడువను అంటూ ప్రాణిగ్రహణం చేసి పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తాడు. అగ్నిచుట్టూ ఏడడుగులు వేసి దాంపత్య జీవితానికి నాంది పలుకుతాడు. పవిత్రమైన వేద మంత్రాల సాక్షిగా ఇద్దరూ ఒక్కటై, ఆ క్షణంనుండి ఇద్దరూ మృత్యువు వరకు కలిసి నడిచే పవిత్రమైన వైవాహిక జీవితం యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అటువంటి వైవాహిక జీవితం క్రమంగా బీటలువారుతోందని ఇటీవలి జాతీయ కుటుంబ సంక్షేమ సంస్థ అధ్యయన నివేదిక తెలియజేయడం ఆందోళనకర పరిణామం. గత అయిదు సంవత్సరాల కాలంలో దేశంలో విడాకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం భారతీయ వివాహ వ్యవస్థకు బీటలు వారుతున్నాయనడానికి సంకేతం.
అభివృద్ధి చెందిన దేశాలలో విడాకులు అన్నది సర్వసాధారణం. అమెరికాలో 1971 గణాంకాల ప్రకారం 64 శాతం వివాహాలు విడాకులతో ముగిసిపోతుండగా, 49 శాతం తిరిగి పునర్వివాహం చేసుకుంటున్నారు. బ్రిటన్‌లో 52 శాతం, ఫ్రాన్స్‌లో 49 శాతం వివాహాలు విడాకులకు దారితీసేవి. 18.25 శాతం కేసులలో వివాహ ప్రక్రియ లేకుండా కొంతకాలం కలిసి వుండడం, తర్వాత విడిపోవడం జరుగుతుండేది. పాశ్చాత్య దేశాలలో దీనినే సహజీవనం అని పిలిచేవారు. అయితే భారతదేశంలో 1971 గణాంకాల ప్రకారం 7 శాతం మాత్రమే వివాహాలు విడాకులతో చట్టుబండలయ్యేవి. ఆ కాలంలో దంపతులకు విడాకులు లభించడం అనేది ఒక దుర్లభమైన ప్రక్రియగా వుండేది. వివాహమైన సంవత్సరం వరకు విడాకులకు అప్లై చేయకూడదన్న విధానంతోపాటు కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం వంటి సుదీర్ఘ ప్రక్రియల అనంతరమే విడాకులు మంజూరు అయ్యేవి. 1971 నాటికి గ్రామీణ భారతంలో 1.5 శాతం విడాకుల రేటుతో భారత్ రికార్డుల పుటలోనికి ఎక్కడంతోపాటు యావత్ ప్రపంచానికి వివాహ వ్యవస్థలో ఆదర్శంగా నిలిచింది. అయితే క్రమేపీ పరిస్థితులు మారాయి. ఛిద్రమవుతున్న వివాహ వ్యవస్థ సమాజాభివృద్ధిపై కనబరిచే దుష్ప్రభావాలను గుర్తించిన ఆధునిక దేశాలు భారతీయతను, భారతీయ హైందవ సంస్కృతి, సనాతన సత్‌సంప్రదాయాలను ఒంటబట్టించుకుని సుస్థిర వివాహ వ్యవస్థ దిశగా నడుస్తున్నాయి. వివాహ జీవితం విజయవంతం అయ్యేందుకు రాజీ ధోరణి అవలంభించడం ఎంతో ముఖ్యమని విదేశీయులు మన వ్యవస్థ ద్వారా తెలుసుకున్నారు. ఒక స్ర్తి, పురుషుడు పదేళ్లు కలిసి ఎలా కాపురం చెయ్యగలరు అనే సందేహం వెలిబుచ్చే విదేశీయులు, పదేళ్లు కాదు వందేళ్లు కలిసివుండాలన్న నిర్ణయానికి వచ్చారు. ఫలితంగా 2016 గణాంకాల ప్రకారం అమెరికాలో విడాకుల శాతం 34కు తగ్గింది. అలాగే బ్రిటన్, ఫ్రాన్స్ ఇతర ఐరోపా దేశాలలో విడాకుల శాతం 20 లోపలికి తగ్గిపోయింది. సుస్థిర వైవాహిక జీవితం పరిపూర్ణ మానవ జీవితానికి అవశ్యం అనే నిర్ణయానికి విదేశీయులు వచ్చారు. అయితే భారతదేశంలో ఇందుకు విభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. 1971లో 7 శాతంగా వున్న విడాకుల శాతం 2016 నాటికి 18 శాతానికి పెరిగింది. గ్రామీణ భారతంలో కూడా విడాకుల శాతం 1.5 నుండి 9 శాతానికి పెరగడం దేశంలో పటిష్టమైన వైవాహిక వ్యవస్థకు బీటలు వారుతోందనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రపంచం భారతీయతవైపు చూస్తుంటే భారతీయులు విదేశీ సంస్కృతిని ఒంటబట్టించుకుంటున్నారు. భారతీయతపై విషం చిమ్మే అధునాతన, పాశ్చాత్య సంస్కృతికి మన దేశస్థులు బానిసలవుతున్నారు. విడాకుల మంజూరులో సరళీకృత విధానాలు, కౌన్సిలింగ్ విధానానికి న్యాయపాలికలు స్వస్తి పలకడం, 498-ఎ చట్టం ద్వారా వివాహ జీవితం చట్టుబండలు అవుతుండడం, స్ర్తి పురుషులకు సమాజంలో అపరిమిత స్వేచ్ఛ లభిస్తుండడం, మహిళలకు పెరిగిన ఉద్యోగ భద్రత, ఆర్థిక స్వేచ్ఛ, పురుషుడు జీవితంలో లేకపోయినా యధేచ్చగా జీవించగలమన్న ఆత్మవిశ్వాసం విడాకుల దిశగా దారితీస్తోంది. స్వేచ్ఛ అపరిమితంగా లభిస్తే సమాజంపై ఎలాంటి దుష్ప్రభావం కనబరుస్తుందో నేడు సమాజంలో చట్టుబండలౌతున్న వివాహాలు, మహిళలు, చిన్నారులపై అకృత్యాలు, సహజీవనం పేరిట ఎలాంటి బంధం లేకుండా కలిసి జీవించడం (ఈ ప్రక్రియనే వేదవాఙ్మయం వ్యభిచారంగా అభివర్ణించింది) వంటి సంఘటనలు చూస్తే తెలుస్తుంది. సమాజంలో ప్రేమ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు ఎక్కువయ్యాయి. తమ ప్రమేయం లేకుండా జరిగే వివాహాలపట్ల సాధారణంగా ఇరుపక్షాల పెద్దలకు వుండే బంధం, కమిట్‌మెంట్ తక్కువగా ఉంటుంది. ఇక ఉమ్మడి కుటుంబాలు పోయి న్యూక్లియర్ ఫ్యామిలీ అనబడే చిన్న కుటుంబాలు వచ్చాయి. ఉద్యోగరీత్యా విడివిడిగా వుండడం వలన భార్యాభర్తలమధ్య వచ్చే చిన్న చిన్న కలతలను పెద్దవి కాకుండా రూపుమాపే పెద్దలు ఇంట్లో వుండరు. ఆర్థిక సమానత్వం పెరగడం వలన దంపతుల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం తగ్గి అహం పెరుగుతోంది. ఒకరి సమస్యలను, బాధలను, ఆందోళనలను మరొకరు అర్థం చేసుకునే ఓపిక, సహనం లేవు. క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే దుర్భలత నేడు యువతలో నెలకొంది. ఇక సమాజం పునర్వివాహం కూడా సమ్మతించడం పెరుగుతున్న వివాహాలకు ఒక కారణం. పెళ్లి అనేది ఒక బాధ్యతగా, బంధంగా కాకుండా కాలక్షేపం వ్యవహారంలా నేటి యువత భావిస్తోంది. విడాకులవలన తమ సంతానానికి సమాజంలో ఏ విధమైన సమస్యలు ఎదురవుతాయన్న కోణంలో ఆలోచిస్తే విడాకుల సంఖ్య తగ్గుతుంది. రోజుకో పెళ్లి, పూటకో బాయ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌లను మార్చే సెలబ్రెటీలను చూసి వారిని అనుకరిస్తూ కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 2010-18 మధ్య సగటున ఏడాదికి లక్షా ఎనభైవేల విడాకులు మంజూరు అవుతున్నట్లు, దేశంలో వివిధ కోర్టులలో ఎనిమిది లక్షల వరకు కేసులు పెండింగ్‌లో వున్నాయన్న జాతీయ న్యాయమండలి గణాంకాలు దేశంలో బీటలువారుతున్న వైవాహిక వ్యవస్థను సూచిస్తున్నాయి.

-సి. ప్రతాప్