సబ్ ఫీచర్

స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో అనేక యాతనలతోపాటు పరవశాలు కూడా ఉంటాయి. అవన్నీ మీవే. కాబట్టి, వాటితో జీవించండి. అందుకు ముఖ్యంగా మీరు ‘యాతన లేని పరవశముండదు, మరణం లేని జీవితముండదు, బాధలు లేని ఆనందముండదు’’ అనే విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, అవి ఎప్పుడూ అంతే. అదే వాటి సహజత్వం. అందుకే వాటిని ఎవరూ మార్చలేరు.
కాబట్టి, మీరు మీరుగా ఉండే బాధ్యతను దాని గుణగణాలతోపాటు అంగీకరించి స్వీకరించండి. ఆ అంగీకారంలోనే మిమ్మల్ని మీరు అధిగమించడం జరుగుతుంది. అపుడే ఎవరికైనా స్వేచ్ఛ లభిస్తుంది.
సామాజిక నియమాలు మనుషుల వౌలిక అవసరాలుగా అనిపిస్తున్నాయి. అయినా మనిషి తనను తాను తెలుసుకునేందుకు ఏ సమాజమూ అతనికి సహాయపడలేదు. వ్యక్తులకు, సమాజానికి మధ్య ఎలాంటి అనుబంధముందో, పరిణామం చెందేందుకు అవి పరస్పరం ఎలా సహకరించుకుంటాయో దయచేసి మీరు వివరించగలరా?
ఇది అతి ముఖ్యమైన, చాలా క్లిష్టమైన ప్రశ్న. మొత్తం అస్తిత్వంలో కేవలం మనిషికి మాత్రమే నియమాలు అవసరం. ఏ ఇతర జంతువుకూ వాటి అవసరం లేదు. ముందుగా తెలుసుకోవలసిన విషయమేమిటంటే నియమాల విషయంలో ఎక్కడో కృత్రిమత్వముంది. అయినా అవి మనిషికి కావాలి. ఎందుకంటే, మానవత్వం మూర్త్భీవించిన వ్యక్తిగా నేటికీ మారని మనిషి అటు పూర్తిగా సహజమైన జంతువు కాకుండా, ఇటు పూర్తిగా మనిషి కాకుండా మధ్యస్థంగా మిగిలిపోయాడు. అందుకే మనిషికి నియమాలు అవసరమయ్యయి. నిజంగా మనిషి మామూలు జంతువే అయితే అతనికి నియమాల అవసరమే లేదు. ఎందుకంటే, ఎలాంటి నియమాలు, చట్టాలు, రాజ్యంగాలు, న్యాయస్థానాలు లేకపోయినా జంతువులన్నీ హాయిగా జీవిస్తున్నాయి. అలాగే మనిషి కూడా కేవలం మాటవరసకు మాత్రమే కాకుండా నిజంగానే మానవత్వం కలిగినవాడుగా మారినపుడు అతనికి కూడా నియమాల అవసరముండదు. ఇంతవరకు ఈ సత్యాన్ని సోక్రటీస్, జరతూష్ట్ర, బోధిధర్మ లాంటి అతి కొద్దిమంది వ్యక్తులు మాత్రమే తెలుసుకున్నారు. అందుకే వారు ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి హాని చెయ్యకుండా చాలా అప్రమత్తంగా ఉన్నారు. అందుకే వారికి ఎలాంటి చట్టాలు, నియమాలు, రాజ్యాంగాల అవసరముండదు. కాబట్టి, వ్యక్తులందరూ మానవత్వం మూర్త్భీవించిన ప్రామాణికమైన మనుషులుగా పరిణామం చెందిన సమాజంలో కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది తప్ప ఎలాంటి చట్టాలు ఉండవు. మనిషి తన సహజ జంతు తత్వాన్ని కోల్పోయినందువల్లనే అతనికి నియమాలు, చట్టాలు, ప్రభుత్వాలు, సైన్యాలు, న్యాయస్థానాలు, రక్షణ వ్యవస్థల అవసరం ఏర్పడింది. ఆ గందరగోళంలో మనిషి అటు పూర్తిగా జంతువు కాకుండా, ఇటు పూర్తిగా మనిషి కాకుండా మధ్యస్తంగా మిగిలిపోయి ఎటూ కాకుండా పోయాడు. ఈ గందరగోళాన్ని నియంత్రించేందుకు మనిషికి అవన్నీ అవసరమయ్యాయి. అందుకే మనిషి ఇంతవరకు నూతన సహజత్వాన్ని పొందలేకపోయాడు. ఇపుడు ఈ సమస్య మరింత జటిలంగా తయారైంది. ఎందుకంటే, మనిషి పరిణామం చెందకుండా నియంత్రించేందుకు పుట్టుకొచ్చిన మతాలు, నియమాలు, చట్టాలు, న్యాయస్థానాలు మరింత బలంగా ఎదిగాయి. వాటికి ఆ అధికారం ఇవ్వక తప్పలేదు. లేకపోతే అవి మనిషిని ఎలా నియంత్రించగలవు? కాబట్టి, మనంతట మనమే బాధాకరమైన బానిసత్వంలో పడిపోయాం. అందుకే బలంగా ఎదిగిన వ్యవస్థలన్నీ వాటి స్వార్థ ప్రయోజనాలను వదులుకోలేక మనిషి పరిణామం చెందకుండా అడ్డుకుంటున్నాయి. అపుడే వాటి ఆటలు సాగుతాయి. అందుకే అవి మనిషి పరిణామం చెందాలని కోరుకోవు. ‘‘వ్యక్తులతోపాటు మొత్తం సమాజం పరిణామం చెందేదెలా?’’ అని మీరు అడుగుతున్నారు. కానీ, అసలు సమస్య మీకు ఏ మాత్రం అర్థం కాలేదు. ఎందుకంటే, వ్యక్తి పరిణామం చెందితే సమాజమే ఉండదు. వ్యక్తి పరిణామం చెందకుండా అడ్డుకోబడుతున్నాడు. కాబట్టే సమాజం మనుగడ సాగిస్తోంది. అంతేకాదు, అది అనేక శతాబ్దాలుగా మనిషి ఎదగకుండా నియంత్రిస్తోంది. అందుకే దాని అధికార దర్పం నేటికీ కొనసాగుతోంది. మనిషి పరిణామం చెందేందుకు ఏ సమాజం సిద్ధంగా లేదు. ఎందుకంటే, మనిషి పరిణామం చెందితే అతనిని నియంత్రిస్తున్న వ్యవస్థలన్నీ ఎందుకూ పనికిరాకుండా పోతాయి. ఇది మీకు స్పష్టంగా అర్థమయ్యేందుకు ఇరవై ఐదు శతాబ్దాల క్రితం చైనాలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను.
తన ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా మహాజ్ఞానిగా పేరొందిన లావోట్జూ వుంటే ధర్మ పరిపాలన సజావుగా సాగుతుందని భావించిన చైనా చక్రవర్తి ఆయనను ఆహ్వానించి తన కోరిక తీర్చమని చాలా వినయంగా అడిగాడు. ‘‘నేను ఆ పదవికి పనికి రాను’’ అన్నాడు లావోట్జూ. కానీ చక్రవర్తి అతనిని మరింత వినయంగా అర్థించాడు అతని మాటను కాదనలేని లావోట్జూ ‘‘సరే, నేను నిజం చెప్పినా మీరు వినట్లేదు మీ తృప్తికోసం ఒక రోజు ఆ పదవిలో ఉంటాను. అపుడే మీకే తెలుస్తుంది.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్