సబ్ ఫీచర్

న్యాయనిర్ణయం క్లిష్టమైందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ పదవికి నేను పనికిరానని. అయినా ప్రయత్నించి చూస్తాను. ఆ ప్రయత్నంలో ఉంటే నేనైనా ఉంటాను లేదా మీ న్యాయవ్యవస్థ, మీ చట్టాలు, మీ సమాజం మీకుంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటే జరుగుతుంది. బహుశా నేనే ఉండకపోవచ్చు. ఎందుకంటే, మీ న్యాయవ్యవస్థ చాలా తప్పుగా ఉంది. మీరేమనుకున్నా సత్యం చెప్పక తప్పదు’’ అన్నాడు.
ఇచ్చిన మాట ప్రకారం ఉన్నత న్యాయస్థాన బాధ్యతలను స్వీకరించిన లావోట్జూ ముందుకు ఒక ధనవంతుని, అతని ఖజానాను దోచుకున్న దొంగను ప్రవేశపెట్టి తీర్పు చెప్పమన్నారు. అన్ని విషయాలు విన్న లావోట్జూ దొంగతోపాటు ధనవంతునికి కూడా ఆరునెలలు జైలుశిక్ష విధించాడు. ఆశ్చర్యపడ్డ ధనవంతుడు ‘‘ఇదేమి తీర్పు? ఇది అన్యాయం, అక్రమం. దొంగ నా డబ్బు దొంగిలించాడని రుజువైంది. అందుకే అతనికి శిక్ష విధించారు. అది సరిగానే ఉంది. కానీ, ఏ తప్పుచెయ్యని నాకెందుకు జైలుశిక్ష విధించారు?’’అని అడిగాడు.
వెంటనే లావోట్జూ అతనితో ‘‘దొంగ చేసినది తప్పే. కానీ, బీదరికంవల్లనే అతను ఆ పనిచేశాడు. కానీ, అలాంటి దొంగలు తయారయ్యేందుకు వ్యాపారం పేరుతో అందరి డబ్బు దోచుకుంటూ బీదరికాన్ని సృష్టిస్తున్న నీలాంటి దురాశాపరులైన ధనవంతులే ముఖ్యకారణం. అందుకే దొంగతోపాటు నీకుకూడా శిక్ష విధించాను’’అన్నాడు. వెంటనే ఆ ధనవంతుడు ‘‘మీ తీర్పు ఇక్కడి చట్టాలకు విరుద్ధంగా ఉందని నేను చక్రవర్తికి ఫిర్యాదుచేస్తాను’’ అన్నాడు. ‘‘నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నా తీర్పు తప్పుకాదు. ఇక్కడి చట్టాలే తప్పుగా ఉన్నాయి. వెళ్ళి చక్రవర్తికి విన్నవించుకో. నా తీర్పులో మార్పులేదు’’అన్నాడు లావోట్జూ. వెంటనే ఆ ధనవంతుడు చక్రవర్తిని కలిసి ‘‘మీరు కొత్తగా నియమించిన న్యాయమూర్తిని ఆ పదవి నుంచి వెంటనే తొలగించండి.
లేకపోతే, మీకే ప్రమాదం. ఆయన చాలా తెలివైన, అతి ప్రమాదకరమైన వ్యక్తి. ఆయన ఇచ్చిన తీర్పు సవ్యంగానే ఉంది. నేను ఆయనను అర్థంచేసుకోగలను. కానీ, ఆయన ఆ పదవిలో ఉంటే మన కొంప మునుగుతుంది. ఇవాళ నాకు జైలుశిక్ష విధించాడు. అలాగే రేపు మీకుకూడా జరగవచ్చు. ఒక్కసారి ఆలోచించండి’’అన్నాడు.
ఆలోచనలోపడ్డ చక్రవర్తి ‘‘ఏ తప్పుచెయ్యని ఆ ధనవంతుడే దోషి అయినప్పుడు, అందరికన్నా ధనవంతుడినైన నేను లావోట్జూ దృష్టిలో అతి పెద్ద దోషినవుతాను కదా! అప్పుడు నన్నుకూడా జైలుకు పంపేందుకు ఆయన ఏమాత్రం సంకోచించడు. కాబట్టి, ఆ ధనవంతుడు చెప్పినది నిజమే’’అని భావించి, వెంటనే లావోట్జూను ఆ పదవినుంచి తొలగించాడు.
‘‘మీరు అనవసరంగా నా సమయాన్ని వృథాచేశారు. నేను ఆ పదవికి పనికిరానని మీకు ముందే చెప్పాను. మీ సమాజంతోపాటు మీ చట్టాలు, మీ న్యాయవ్యవస్థ చాలా తప్పుగా ఉన్నాయి. కేవలం దుర్మార్గులే వాటిని సవ్యంగా నిర్వహించగలరు’’అని చెప్పి వెళ్ళిపోయాడు లావోట్జూ.
లావోట్జూ తీర్పు తర్కబద్ధంగానే ఉంది. అతి తక్కువమంది ధనవంతులు, అనేకమంది బీదవాళ్ళు ఉన్న సమాజంలో అసమానతల అసహనాలు దోపిడీలకు దారితీస్తాయి. వ్యాపారం పేరుతో అందరినీ దోచుకుంటూ బీదరికాన్ని సృష్టిస్తున్న అతి దురాశాపరులైన ధనవంతులున్న సమాజంలో దొంగలు తయారవుతూనే ఉంటారు. వారిని ఎవరూ ఆపలేరు. వారి దోపిడీ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ పరిస్థితిని అరికట్టాలంటే ఎవరూ తమ అవసరాలకు మించి దురాశతో అనవసరంగా ధనాన్ని కూడబెట్టకుండా ఉండడమొక్కటే ఏకైక మార్గం.
కానీ, మనిషి గందరగోళంలో పడిపోకుండా ఉండేందుకు మనం ఏర్పరచుకున్న వ్యవస్థాగతమైన బలగాల శక్తులు మరింత బలపడి మానవాళికే అవి శత్రువులుగా పరిణమించాయి. అదే అసలు సమస్య. ఎందుకంటే, మీరు మీదైన స్వేచ్ఛతో చాలా అప్రమత్తంగా, పూర్తి ఎరుకతో మీ చైతన్యాన్ని పెంచుకుంటూ పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగేందుకు వారు ఏమాత్రం ఇష్టపడరు. అందుకే వారు మీకు ఆ అవకాశాన్ని ఎప్పుడూ ఇవ్వరు. ఎందుకంటే, అదే జరిగితే పోపులు, మతాధికారుల అవసరం మీకుండదు. అప్పుడు వారి ఉద్యోగాలు, అధికారాలు, పరపతి పూర్తిగా నాశనమవుతాయి. వారికి వ్యతిరేకంగా పోరాడడం నా విధానం కాదు. ఎందుకంటే, వారికి కావలసినంత డబ్బు, సైన్యం, అధికారం అన్నీ ఉన్నాయి. వారితో మీరు పోరాడలేరు. అదే జరిగితే వారు మిమ్మల్ని నాశనంచేస్తారు. కాబట్టి, నిశ్శబ్దంగా మీ చైతన్యాన్ని పెంచుకోవడమొక్కటే ఆ గందరగోళంనుంచి మీరు బయటపడేందుకున్న ఏకైక మార్గం. ఆ ప్రయత్నంలో మీలో లోపల జరిగే దానిని వారు తెలుసుకోలేరు. అందుకే వారు మీ ప్రయత్నాన్ని అడ్డుకోలేరు, ఆపలేరు.
అంతర్గత పరిణామ రసవాద రహస్యాన్ని నేను మీకు చెప్తాను. దాని ప్రకారం మీరు మీ లోలోపలి ఉనికిని సమూలంగామార్చి పరిణామం చెందండి. అలా మీరు పూర్తిగా పరిణామం చెందిన మరుక్షణం మీరు బానిస కాదని, బందిఖానాలో లేరని తెలుస్తుంది. మీ బానిసత్వానికి కారణం మీలోని గందరగోళమే.
రష్యా విప్లవం ముగిసిన వెంటనే ఒక స్ర్తి నడిరోడ్డుపై నడవడం ప్రారంభించింది.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్