సబ్ ఫీచర్

స్వేచ్ఛ అంటే బాధ్యతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే పోలీసు ఆమెను అడ్డుకుని ‘‘ఇలా నడిరోడ్డుపై నడవడం తప్పు’’అన్నారు. ‘‘అదేమిటి, మనకు స్వేచ్ఛ లభించింది కదా!’’ అంది ఆమె.
‘‘స్వేచ్ఛ లభించినంత మాత్రాన రోడ్డు నియమాలను ఉల్లంఘించకూడదు. అలాచేస్తే అనేక ప్రమాదాలు జరుగుతాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మీరు చట్టప్రకారం నడుచుకునేలా చేస్తారు’’ అన్నాడు పోలీసు.
కాబట్టి, మీ ఇష్టమొచ్చినట్లు గజిబిజిగా, గందరగోళంగా జీవించడం స్వేచ్ఛకాదు. స్వేచ్చ అంటే మరింత ఎక్కువ బాధ్యత. కాబట్టి, మీరు మరింత ఎక్కువ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మీ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవలసిన అవసరముండదు. అప్పుడు మీపై ఎవరి ప్రభావము ఉండదు. ఫలితంగా మీరు పూర్తిస్వేచ్ఛతో ఒంటరిగా హాయిగా ఉంటారు.
నేను అనుసరించే విధానమిదే. మీరు నిజంగా మానవాళి పరిణామాన్ని కోరుకుంటున్నట్లైతే ప్రతి వ్యక్తి స్వయంగా ఎదుగుతూ పరిణామం చెందాలి. నిజానికి, అలా ఎదిగేందుకు ఏ గుంపుతోనూ పని లేదు.
ఏ గుంపుతోనూ ఎలాంటి అవసరం లేకుండా తల్లి గర్భంలో శిశువు ఎలా ఎదుగుతాడో అదే ఎదగడమంటే. తల్లి కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. మీలో నవీన మానవుడు ఉదయించాలంటే మీరుకూడా అందుకోసం గర్భం ధరించాలి. కానీ, మీరు గర్భం ధరించినట్లు ఎవరికీ తెలియదు. అలా ఎవరికీ తెలియకపోవడమే మంచిది.
అప్పుడు మీ పనులు మీరు మామూలుగా చేసుకుంటూ ఈ ప్రపంచంలో అతి సాధారణంగా జీవిస్తూ ఉంటారు. అంతేకానీ, మీరు ప్రతిస్పందనాత్మకంగా, విప్లవాత్మకంగా, దౌర్జన్యపూరితంగా, ఎందుకూ పనికిరాకుండా తయారవరు. అలా తయారవడం మరీ మూర్ఖత్వం.
కేవలం నిరాశ, నిస్పృహలవల్లనే మీరు అలా తయారవుతారని నేను అర్థంచేసుకోగలను. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అయినా అదికూడా ఒక రకమైన పిచ్చి. ఈ సమాజమే పిచ్చిగా ఉంది. అందుకే మీరు కూడా పిచ్చిగా తయారవుతారు. కాబట్టి, పిచ్చివాళ్ళను చూసి సమాజం ఎప్పుడూ భయపడదు. పూర్తి చైతన్యవంతులై తమ ఉనికి కేంద్రానికి చేరుకోగలవారికి మాత్రమే ఈ సమాజం భయపడుతుంది. ఎందుకంటే, అలాంటి వ్యక్తులు ఏ పనిచేసినా సరిగానే ఉంటుంది. వారు ఎప్పుడూ తప్పుచెయ్యరు. అందుకే వారు దేనికీ భయపడరు, ఏ అధికార బలానికి చిక్కరు, లొంగరు.
వ్యక్తులు ఎదిగితే సమాజం తరిగిపోతుంది. ప్రభుత్వం, సైన్యం, పోలీసులు, చట్టాలు, చెరసాలలు, న్యాయస్థానాలు- ఇలాంటి వాటినే సమాజమని భావిస్తున్న వ్యక్తుల సమూహం నిస్సందేహంగా తరిగిపోతుంది. ఎందుకంటే, అత్యున్నతంగా ఆలోచించే పూర్తి చైతన్యవంతులైన నవీన మానవులు కచ్చితంగా ఈ ఉనికిలోకి వస్తారు. వారిని నేను ‘సమాజం’అనడానికి ఇష్టపడను. ఎందుకంటే, ఆ పదానికి ఉన్న గందరగోళం నాకు తెలుసు. అందుకే అలాంటివారిని నేను ‘కమ్యూన్’ (్భవ సారూప్య వ్యక్తుల సమిష్టికలయిక) అంటాను.
ఆ పదానికి చాలా ప్రాముఖ్యముంది. అక్కడ కేవలం కలిసి జీవించడమేకాకుండా తమ ఆలోచనలను, భావాలను పరస్పరం పంచుకునే ప్రదేశమది.
పట్టణాలు, రాష్ట్రాలలోని పెద్దపెద్ద భవంతులలో అనేక వేల మంది కలిసి జీవిస్తున్నారు. కానీ, ఎవరికీ తమ పొరుగువారి గురించి ఏమీ తెలియదు. అది కలిసి జీవించడమంటారా? ఏమాత్రం కాదు. అది కేవలం ఒక గుంపు మాత్రమే.
అంతేకానీ, అది కలిసి జీవించే సమిష్టిసమూహం కాదు. కలిసి జీవించడమంటే తమ భావాలను, ఆలోచనలను కలిసి పంచుకోవడం. అందుకే నేను ‘సమాజం’అనే పదాన్ని తొలగించి దానిస్థానంలో ‘కమ్యూన్’ అనే పదాన్ని చేర్చాను.
సమాజం కొన్ని వౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. వాటిని మీరు తొలగించాలి. లేకపోతే, సమాజం అంతరించదు. సమాజంలోని అతి ముఖ్యమైన అంశం కుటుంబ వ్యవస్థ. అది ప్రస్తుతమున్న స్థితిలోనే కొనసాగితే చర్చిలు, మసీదులు, మతాలతో కూడిన సమాజం ఇక ఎప్పటికీ అంతరించదు. అప్పుడు నూతన మానవాళితోకూడిన సమైక్య ప్రపంచాన్ని మనం సృష్టించలేం.
కుటుంబ వ్యవస్థ ఎప్పుడూ ఉన్నట్లుగా లేదు. దానికి కాలం చెల్లింది. గతంలో కుటుంబ వ్యవస్థే లేని కాలముంది. ప్రజలు గిరిజనులుగా జీవించేవారు. వివాహవ్యవస్థ, కుటుంబ వ్యవస్థ లేని ఆరోజుల్లో స్ర్తిపురుషులు ప్రేమతో కలుసుకునేవారు. వ్యక్తిగత ఆస్తి ప్రాచుర్యంలోకి రాగానే అంతవరకు లేని కుటుంబ వ్యవస్థ పుట్టుకొచ్చింది.
ఫలితంగా పురుషుడు స్వాధీనతాభావంతో స్ర్తిని తన ఆస్తులలో భాగంగా పరిగణించి ఆమెపై అధికారం చెలాయించేవాడు. ఆ రోజుల్లో మిగిలినవారికంటే ఎక్కువ వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టిన కొంతమంది శక్తిమంతులు ఆ ఆస్తులను తమ పిల్లలకు ఇవ్వాలని కోరుకునేవారు. అప్పటినుంచి సమస్య మొదలైంది.
భారతీయ భాషలలో స్ర్తిని ఒక ఆస్తిగా పరిగణించడం జరిగింది. చైనాలో కూడా స్ర్తిని ఒక ఆస్తిగా పరిగణించినప్పటికీ అక్కడ ఆమె పరిస్థితి మరీ దారుణం.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్