సబ్ ఫీచర్

సెనే్సషన్.. స్టార్ కిడ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిఫ్త్ జనరేషన్‌కు -స్క్రీన్ ఓ ప్రొఫెషనల్ కెరీర్. సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే, పూర్వీకులు తిష్టవేసి ఉండాలన్న రూల్స్ ఇప్పుడు చెల్లవు. ఒకవేళ చెల్లి వారసులుగా వచ్చినా ‘వండర్స్’ సృష్టిస్తారన్న గ్యారెంటీలూ ఉండవు. వారసులైనా, వారసేతరులైనా -నిలదొక్కుకునే దమ్ముండాలి. ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శించాలి. స్క్రీన్‌మీద వెలగాలంటే కలలు కాదు, కసి కావాలి. అదే క్వాలిఫికేషన్. ఇదీ ‘ఫైవ్ జీ’ ట్రెండ్.

స్క్రీన్ -ఓ కార్పొరేట్ ప్రొఫెషన్. ఒక్క సినిమాతో పైకి లేవొచ్చు. కాకపోతే అక్కడే ఉంటామన్న గ్యారెంటీ మాత్రం ఉండదు. కోట్ల రూపాయల గేమ్‌లో ప్రతి ప్రాజెక్టూ ఓ చాంలెజ్. వర్కవుటైతే ఓకే. లేదంటే -చాన్స్ కోసం ‘క్యూ’లో నిలబడాల్సిందే. మోడ్రన్ సినిమాతో డిజిటల్ బిజినెస్ అనుసంధానమైన తరువాత అన్నీ -ఇన్‌స్టంట్ సక్సెస్‌లు, ఇన్‌స్టంట్ ఫెయిల్యూర్లే.

భారతీయ సినిమాలో బాలీవుడ్‌ది సుదీర్ఘ ప్రయాణం. ఎక్కడో బయలుదేరిన బాలీవుడ్ సినిమా.. ప్రపంచ సినిమా హోదా అందుకునే స్థాయికి ఎప్పుడో ఎదిగింది. బ్లాక్ అండ్ వైట్ రీళ్లు నుంచి డిజిటల్ చిప్‌ల వరకూ.. ఒక్కో సీజన్‌లో ఒక్కొక్కరు రాజ్యమేలారు. ఆధిపత్యాన్నీ ప్రదర్శించారు. ఒకప్పుడు రాజ్‌కఫూర్, దిలీప్‌కుమార్.. తరువాత అమితాబ్, ధర్మేంద్ర.. తరువాత ఖాన్‌త్రయం అమీర్, షారూక్, సల్మాన్.. వీళ్లంతా బాలీవుడ్ స్క్రీన్‌కు ఒక రేంజ్ ఇచ్చినోళ్లే. ఇప్పుడు బాలీవుడ్ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త నీరొస్తుంది. వచ్చే వాళ్లంతా వారసులే కావొచ్చు. కానీ -ఏంట్రీ కోసమే తప్ప వారసత్వ ఐడెంటిటీ మాకొద్దని స్క్రీన్ గుద్ది మరీ చెబుతున్నారు. ప్రొఫెషనల్స్‌గా తమ కెరీర్‌ను తామే డిజైన్ చేసుకుంటామని అంటున్న ‘స్టార్ కిడ్స్’ -అంతర్జాలంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నారు.
అరంగేట్ర సినిమా ఆడియన్స్ జడ్జిమెంట్‌కు రాకుండానే బాలీవుడ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది -సారా అలీఖాన్. సైఫ్ అలీ, అమృతాసింగ్‌ల ‘స్టార్ కిడ్’గా సారా ఇప్పటికే సెలబ్రిటీ హోదా ఎంజాయ్ చేస్తోంది. సారా కదిలితే వార్త, కనిపిస్తే ఫొటో అన్నట్టుంది ఈ కుర్రదాని స్టేటస్. దర్శకుడు అభిషేక్ కఫూర్ చేతులమీదుగా అరంగేట్రం చేసిన సారా, సుశాంత్ సింగ్ రాజ్‌పుట్‌కు జోడీగా ‘కేదార్‌నాథ్’లో కనిపించనుంది. సినిమా ఎప్పుడొస్తుందా? అని కళ్లు కాయలుకాచేలా బాలీవుడ్ ఎదురు చూస్తోందంటే, సారా ఇమేజ్‌ను అంచనా వేయొచ్చు. తాజాగా రెండో చిత్రానికి సైన్ చేసిన సారా, రోహిత్ శెట్టి తీస్తున్న ‘సింబా’లో రణవీర్ సింగ్‌కు జోడీగా కనిపించనుంది. ఇవికాక మరో రెండు ప్రాజెక్టులు డిస్కషన్స్‌లో ఉన్నాయన్నది బాలీవుడ్‌లో వినికిడి. సారా ఇమేజెస్‌కే ఫిదా అయిపోతున్న యంగ్ జనరేషన్, ఆమె సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
మరో స్టార్‌కిడ్, చుంకీ-్భవనా పాండేల ముద్దుల కూతురు అనన్య.. కుర్రకారుకు లేటెస్ట్ డ్రీమ్‌గాళ్. బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయకముందే -సోషల్ మీడియాలో ఆమె స్టేటస్ ఆకాశానికి చేరింది. ఈ కుర్రపిల్ల ఎప్పుడు కనిపిస్తోందోనని సినీమీడియా పడిగాపులు కాస్తోందంటే -అభిమానులకు ఎంతగా ఆరాధ్యంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కరణ్ జోహార్ తీస్తున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’తో స్క్రీన్‌కు రాబోతున్న అనన్య, టైగర్ ష్రాప్, తారా సుతారియాతో కలిసి కీలక పాత్ర పోషిస్తోంది. ఫస్ట్‌లుక్‌తోనే ప్రాజెక్టుపై విపరీతమైన అంచనాలు పెంచేయడంతో, ఒకటి రెండు సినిమాలతోనే అనన్య ఓ రేంజ్‌కు చేరడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.
తొలి సినిమాతోనే ‘వావ్’ అనిపించిన ఒకప్పటి బాలీవుడ్ సెనే్సషన్ భాగ్యశ్రీ. ‘మైనే ప్యార్ కియా’లో సల్మాన్‌కు జోడీగా కనిపించిన భాగ్యశ్రీ, తన అందంతో మాయ చేసేసింది. ఆ అందాలతార కొడుకు అభిమన్యు, ఇప్పుడు బాలీవుడ్‌కు ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే సెనే్సషన్ క్రియేట్ చేస్తున్నాడు. వసన్ బాలా దర్శకత్వంలో రోన్నీ స్క్రూవాలా నిర్మిస్తోన్న ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ ప్రాజెక్టుతో అరంగేట్రం చేయబోతున్న అభిమన్యు, బుల్లితెర సంచలనం రాధిగా మదన్‌తో జోడీ కట్టాడు. అక్షయ్‌కుమార్, జాకీ చాన్, బ్రూస్‌లీ అంటే పడిచస్తానని చెబుతున్న అభిమన్యు, తొలి ప్రాజెక్టు కోసం మార్షల్ ఆర్ట్స్‌లోనూ ఆరితేరాడు. స్టార్ కిడ్ ఇమేజ్‌కు దూరంగా తనను తను ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతున్న అభిమన్యు, సినిమా కోసం ప్రొఫెషనల్‌గా ఎలాంటి రిస్క్‌కైనా రెడీ అంటున్నాడు.
షోలే స్టార్ ధర్మేంద్ర మనవడు కరణ్ డియోల్ ఇప్పుడు బాలీవుడ్ సెనే్సషన్. 1983లో తొలి సినిమా ‘బేతాబ్’తో బాలీవుడ్‌కు సెగపుట్టించాడు సన్నీ డియోల్. సన్నీ కొడుకుగా స్టార్‌కిడ్ స్టేటస్ అందుకున్న కరణ్, తండ్రి డైరెక్షన్‌లోనే ‘్ఫల్ ఫల్ దిల్ కె పాస్’తో అరంగేట్రం చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. దీని తరువాత మరో ప్రాజెక్టుకూ కరణ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ‘తండ్రిగా కరణ్‌తోనే ఉంటూ నా బాధ్యత నేను నెరవేరుస్తా. తరువాత నిలబడాల్సి వాడే. కరణ్ వర్క్‌లో నేను జోక్యం చేసుకోను’ అని ముందే చెప్పేస్తున్నాడు సన్నీ. ‘కరణ్ కాన్ఫిడెంట్‌గానే ఉన్నాడు, వాడి రెక్కలతో కెరీర్‌లో ఆకాశానికి ఎగరడానికి’ అన్నది సన్నీ చెప్తోన్న మాట.
బాలీవుడ్ రాబిన్‌హుడ్ సల్మాన్ చేతులమీదుగా స్క్రీన్‌కు పరిచయం అవుతున్న మరో స్టార్ కిడ్ -ప్రణుతన్. మొన్నటితరం అందాల తార నూతన్ మనవరాలిగా ఇండస్ట్రీకి వస్తున్న ప్రణుతన్, జహీర్ ఇక్బాల్‌తో జోడీ కట్టబోతోంది. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సల్మాన్ పరిచయం చేయడం, ఆమెను ఆశీర్వదించమంటూ ట్వీట్లు చేయడంతో నెట్టింట ప్రణుతన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. సల్మాన్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థలో నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తొన్న చిత్రంతో ప్రణుతన్ అరంగేట్రం చేస్తుండటంతో, తదుపరి ప్రాజెక్టుల కోసం ఆమె ఇంటిముందు నిర్మాతలు క్యూకట్టిన పరిస్థితి లేకపోలేదు. స్క్రీన్స్‌కు వస్తూనే సంచలనం సృష్టిస్తోన్న మరో నటుడి కొడుకు వర్థన్ పురి. లెజండరీ ఆర్టిస్టు అమ్రీష్ పురి మనవడిగా వస్తున్న వర్దన్, ఓ రొమాంటిక్ థ్రిల్లర్‌తో పరిచయం అవుతున్నాడట. డేవిడ్ ఫిన్చర్ నిర్మించిన ‘గాన్ గాళ్’ ఫ్లేవర్‌తో జయంతిలాల్ గడ నిర్మిస్తోన్న రొమాంటిక్ థ్రిల్లర్‌తో వర్దన్ ఓ సెనే్సషన్ క్రియేట్ చేస్తాడన్న నమ్మకాలు లేకపోలేదు. ఓ పీరియడ్ డ్రామాతో వర్థన్‌ను పరిచయం చేయాలనుకున్నా, సొంత నిర్ణయంతో రొమాంటిక్ థ్రిల్లర్‌ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. వర్థన్‌కు జోడీని ఎంపిక చేసే పనిలో యూనిట్ బిజీగా ఉంది. సిమ్లా లేదా ఢిల్లీ గాళ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మహాదేవ