సబ్ ఫీచర్

మురికివాడలో వెలుగు రేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో మురికివాడల ప్రస్తావనకు వస్తే తప్పనిసరిగా ఉదహరించేది ధారవి మురికివాడ. ఆసియాఖండంలోనే అతి పెద్దది అయిన ఈ మురికివాడ మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబయిలో ఉంది. ఇప్పటి వరకు ధారవి అవగానే అందరు అది నిరుపేద ప్రజలు నివసించే మురికివాడ అని మాత్రమే భావిస్తారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా వేలాదిమంది ఈ మురికి వాడలలో వుంటున్నారే తప్ప ఇక్కడ కూడా ఆణిముత్యాల వంటి వారు ఎందరో వున్నారని తొలుత గుర్తించిన ఘనత మేఘాగుప్తాకే దక్కుతుంది. తొలుత జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన మేఘా గుప్తా ధారవి పట్ల సంపూర్ణ అవగాహన పొందారు. పట్టణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను అర్బనాలజిస్టుగా కొంతకాలం ఉన్నారు. 2012 ఏప్రిల్‌లో ధారవి ప్రాంత ప్రజల జీవన శైలి, వృత్తి నైపుణ్యం తదితర అంశాలపై పరిశోధన జరిపేందుకు యుఆర్‌బిజెడ్ అనే సంస్థ తరఫున ఆమె ఎంపికయ్యారు. మేఘా గుప్తా ఆరు నెలలపాటు ఈ ప్రాజెక్టులో పనిచేసి ఆప్రాంత ప్రజల పట్ల సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకున్నారు. ధారవి ప్రాంతంలో చేతివృత్తిపనులు చేయడంలో ఎందరో నిష్ణాతులు ఉన్నట్టు ఆమె గుర్తించారు. తాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన పలు వస్తువులకన్నా ధారవి ప్రాంతంలో తయారవుతున్న వస్తువులు ఆకర్షణీయంగా, నాణ్యంగా వుండడం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ధారవి ప్రాంతంలో తయారవుతున్న వస్తువులకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించారు. వెబ్‌సైట్ నిర్వహణ కోసం అవసరమైన నిధులు సేకరించి, 2014లో ఆమె ధారవి మార్కెటింగ్ డాట్‌కామ్‌ను ప్రారంభించారు.
ధారవిలో చాలామంది వద్ద స్మార్ట్ఫోన్‌లు వున్నాయి. అయితే వారికి కంప్యూటర్ వినియోగం గురించి తెలియదు. మేఘాగుప్త చేతివృత్తిదారులు తయారుచేసే లెదర్ బ్యాగ్‌లు, హ్యాండ్‌బాగ్‌లు, పర్సులు, చెప్పులు, బెల్టులు, వాలెట్ తదితర 30రకాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో వుంచారు. ఈ వస్తువులను ధను అనే బ్రాండ్‌పేరిట మార్కెటింగ్ చేస్తున్నారు. ధారవి మార్కెట్ డాట్‌కామ్‌లో ప్రస్తుతం 280 మంది చేతివృత్తిదారులు వున్నారు. వీరు తయారుచేస్తున్న వస్తువులను పోలెండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివలన స్థానికుల ఆదాయం 20 నుంచి 30 శాతం పెరిగింది.
మేఘాగుప్తా చొరవతో ప్రస్తుతం ధారవిలోని పలువురు చేతివృత్తిపనివారు ఆనంద దాయకమైన జీవనం గడుపుతున్నారు.

- పి.హైమావతి