సబ్ ఫీచర్

నిశ్శబ్దం నుంచి విప్లవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరికి అంటురోగాలు ప్రబలినా వైద్యులకు ఆదాయముండదు. ఇది మనకు వింతగా అనిపిస్తుంది. కానీ, ఈ విధానంలో అందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని వైద్యులందరూ కోరుకోవడం జరుగుతుంది.
‘‘మీ కొడుకుకు వచ్చిన మశూచి రోగాన్ని నయంచేసినా మీరు నాకు ఏమీ చెల్లించలేదు. ఈ విషయాన్ని మీకు ఎన్నిసార్లు గుర్తుచేసినా మీరు ఏమాత్రం పట్టించుకోలేదు’’అన్నాడు వైద్యుడు ముల్లానసృద్దీన్‌తో.
‘‘నాకు తెలుసయ్యా. కానీ, ఆ వ్యాధి అందరికీ వ్యాపించడానికి నా కొడుకే కారకుడు. వాడివల్ల నువ్వు చాలా డబ్బు సంపాదించావు. గట్టిగా మాట్లాడావంటే నేను న్యాయస్థానంలో నీపై దావావేస్తా. అప్పుడు నువ్వే నీ సంపాదనలో నాకు వాటా ఇవ్వాల్సి వస్తుంది’’ అన్నాడు ముల్లానసృద్దీన్.
ముల్లానసృద్దీన్ అంచనా నిజమైంది. అప్పటినుంచి ఆ వైద్యుడు ముల్లానసృద్దీన్‌ను కలవడం మానేశాడు. ఎందుకంటే, ముల్లానసృద్దీన్ అన్నట్లుగా ఆ వైద్యుడు చాలా డబ్బు గడించాడు. ఒక రకంగా ముల్లానసృద్దీన్ వాదన సరిగానే ఉన్నప్పటికీ అతను అలా ఆ వైద్యుని బెదిరించేందుకు అవకాశమున్న విధానం చాలా తప్పు.
పాశ్చాత్య దేశాలలో వైద్యుని వ్యాపారాన్ని ‘మెడిసిన్’అంటే రోగానికి ఔషధ చికిత్సచేసే వైద్య శాస్తమ్రని, దానినే తూర్పు దేశాలలో ‘ఆయుర్వేదం’ అంటే చక్కని ఆరోగ్యంతో హాయిగా, ఆనందంగా జీవించే జీవశాస్తమ్రని అంటారు. తేడా తెలిసిందా!
కమ్యూన్‌లోని వారందరూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకునేందుకు కమ్యూన్ వైద్యునికి జీతం చెల్లించాలి. వారిలో ఎవరికి రోగమొచ్చినా ఆమేరకు వైద్యుని జీతంలో కోత విధించడం జరుగుతుంది. అందువల్ల అందరి ఆరోగ్యమే ఆ వైద్యుని వ్యాపారమవుతుంది.
అలాగే ఫ్లంబర్, ఇంజనీర్, ఎలక్ట్రీషియన్- ఇలా కమ్యూన్ అవసరాలను తీర్చేవారికి జీతాలిచ్చి పోషిస్తూ, వారి కాలపరిమితి ముగియగానే వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటుంది కమ్యూన్. ప్రతి సంవత్సరం కమ్యూన్ నిర్వహణ సభ్యులు మారుతూ ఉంటారు. అందువల్ల అధికారం కేంద్రీకృతమయే సమస్య తలెత్తదు. ఎవరికీ అధికారం శాశ్వతంకాదు కాబట్టి, ఎవరూ దానికి బానిస కాలేరు.
పైగా, అధికారం ఎలాంటి వారినైనా తనకు బానిసగా చేసుకోగల అతి నీచమైన మత్తు పదార్థం. అయినా పనులు సవ్యంగా జరగాలంటే దానిని ఎవరో ఒకరికి ఇవ్వక తప్పదు. అందువల్ల దానిని కొద్ది మోతాదులో కొంత కాలం మాత్రమే ఇవ్వాలి తప్ప, ఎక్కువ కాలం ఎవరినీ అధికారంలో ఉంచకూడదు. అలా అందరూ చక్కగా ఎదిగేందుకు అందరికీ అవకాశమిస్తూ, అందరినీ ఎదగనివ్వాలి. అప్పుడు కమ్యూన్ చక్కగా అభివృద్ధి చెందుతుంది.
ప్రస్తుతానికి, సమాజం గురించి పూర్తిగా మర్చిపోదాం. అది ఎలా ఉంటే మనకేంటి? దానితో మనకు పనిలేదు. అది ఉంటే ఉంటుంది, లేకపోతే నాశనమవుతుంది. ఉండాలనుకుంటే అది తన విధానాలను మార్చుకోక తప్పదు.
అది లేకపోయినా మనకు ఎలాంటి నష్టం లేదు. కాబట్టి, దానితో ఎవరూ పోరాడకండి. దాని జోలికి ఎవరూ వెళ్ళకండి. దానిష్టమొచ్చినట్లు అది ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచ జనాభా చాలా పెరిగిపోయింది. ప్రస్తుతమున్న జనాభాలో నాలుగోవంతు జనాభా ఉంటే చాలు ఈ ప్రపంచానికి. కాబట్టి, కుళ్ళిన పాత భావాలతో కొత్తగా ఏమీ చెయ్యలేని, కనీసం తాముచేస్తున్న తప్పులు ఎంత హాని చేస్తున్నాయో కూడా తెలుసుకోలేని అంధులు మరణించాలనుకుంటే వారిని నిశ్శబ్దంగా మరణించనివ్వండి. అంతేకాని, వారిని ఎవరూ అడ్డుకోకండి.
నేను మీకు విప్లవాత్మక భావాలను బోధించను. ఎందుకంటే, గతంలోని విప్లవాలన్నీ ఓడిపోయినవే. కాబట్టి, మీరు చాలా నిశ్శబ్దంగా, దాదాపు అతి రహస్యంగా రూపాంతరం చెందడమే ఇప్పుడు నాకు కావాలి. అలా మనం చాలా ప్రశాంతంగా, అత్యంత నిశ్శబ్దంగా గొప్ప విప్లవానికి నాంది పలకాలి. అదే మన ముందున్న ఏకైక మార్గం. పైగా, కేవలం నిశ్శబ్దంలోనే అనేక విషయాలు సంభవిస్తాయి.
ఉదాహరణకు, పైకి ఎంతో అందంగా కనిపించే చెట్ల వెళ్లు మనకు కనిపించవు. కానీ, అవి భూమిలో చాలా నిశ్శబ్దంగా వాటి పని చేస్తూనే ఉంటాయి. అలాగే నా మనుషులు కూడా చాలా నిశ్శబ్దంగా వారి పని వారు చేస్తూనే ఉంటారు. తాము రూపాంతరం చెందుతూ, అందుకు వారు అనుసరిస్తున్న విధానాలను వ్యాప్తిచెందిస్తూ, అలా మారాలనుకునే వారిని మారుస్తూ, అందరూ కలిసి చిన్నచిన్న బృందాలుగా ఏర్పడి, అవకాశమున్నచోట చాలా నిశ్శబ్దంగా, ఎలాంటి తిరుగుబాటు ధోరణి లేకుండా, పెద్దపెద్ద కమ్యూన్‌లను ఏర్పాటుచేస్తారు. సమాజం అంతరించినపుడే వ్యక్తుల ఉనికి సాధ్యమవుతుంది. అంతేకానీ, సమాజం, వ్యక్తులు కలిసి ఉండడం సాధ్యపడదు.
సమాజం అంతరించే సమయం ఆసన్నమైంది. ఏదో లాంఛనంగా నడుస్తున్న కుటుంబ వ్యవస్థ హృదయ పూర్వకంగా కలిసి జీవించాలనుకునే వారిని అర్థంలేని హద్దులతో అడ్డుకుంటోంది కాబట్టి, అందుకు నూతన మార్గాలను మనమే కనుక్కుందాం. ‘‘నేను నీ తండ్రిని. కాబట్టి, నన్ను ప్రేమించాలి. నేను నీ తల్లిని. కాబట్టి, నన్ను ప్రేమించాలి. ఇది నీ కుటుంబం.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.