సబ్ ఫీచర్

ఆకుకూరలతో హృదయం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీలైనంత వరకు ఆకుకూరలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
పాలకూర, బచ్చలి, పుదీనా వంటి వాటిని కూరలుగా కంటే స్మూథీ లేదా సలాడ్ల రూపంలో తీసుకుంటే శరీరానికి ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
ఆకుకూరల్లో ఎక్కువ పీచుపదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
ఆకుకూరల్లో ఫైటోనూట్రియంట్లు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
ఆకుకూరల్లో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా వుంటాయి. అందుకే వాటిని రక్షక ఆహారంగా పరిగణిస్తారు. వాటిలో ఇనుము, కాల్షియం, విటమిన్ ఎ, ముఖ్యంగా రైబోఫ్లొనివ్ యాసిడ్‌లు పుష్కలంగా వుంటాయి. బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లకోసం ఆకుకూరలు తినాలి.
ఆకుకూరల్లో విటమిన్ ఎ ఎక్కువగా వుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల కళ్ల ఆరోగ్యం కోసం విటమిన్ ఎ తప్పనిసరి. శరీరంలో తగిన మోతాదులో విటమిన్ ఎ లేనట్లయితే కనుగుడ్లు తేమను కోల్పోయి, తెల్లగా కనబడతాయి. పొడిగా ముడతలు పడి వుంటాయి. ఒక్కోసారి కంటిలోని కార్నియా దెబ్బతిని శాశ్వతంగా అంధత్వం లభిస్తుంది. విటమిన్ ఎ కేవలం జంతు సంబంధ ఉత్పత్తులైన వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, గుడ్డులోని పసుపు కాలేయం వంటి వాటిలోనే వున్నప్పటికీ, ప్రకృతి మనకు దానిని బీటా కెరోటిన్ రూపంలో ఆకు కూరల ద్వారా అందించి రక్షణ లభిస్తుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. అంతేకాదు పిల్లల్లో శారీరక పెరుగుదలను అధికం చేసి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
శరీరంలో ఇనుము లోపిస్తే రక్తహీనతకు గురవుతాం. అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. ముఖ్యంగా స్ర్తిలలో పిల్లలలో రక్తహీనత ఎక్కువగా వుంటుంది. రక్తహీనతవల్ల శక్తి సామర్థ్యం తగ్గిపోతుంది. నెలలు నిండకముందే ప్రసవం జరగడం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, ఇతర శారీరక రుగ్మతలు కలుగుతాయి. కళ్లు తిరగడం, చర్మం పాలిపోవడం, గోళ్లు, ముఖం, నాలుక, పెదవులు పాలిపోవడం సాధారణంగా రక్తహీనతలకు చిహ్నాలు. ఆకుకూరల్లో ఇనుము లభిస్తుంది. ఆహారంలో తీసుకునే పీచు పదార్థాలకు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలున్నాయి. ఆకుకూరలను అధికంగా తీసుకోవడం వల్ల రక్తకణాలు త్వరగా పునర్‌నిర్మితమవుతాయి. దానివల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ముదురు ఆకుపచ్చని ఆకుకూరలను ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చు.