సబ్ ఫీచర్

చైతన్యానికి మూలం ధ్యానమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవేళ అవసరమైతే దానికోసం నువ్వు త్యాగం చెయ్యాలి’’ అంటూ ప్రతి శిశువుచుట్టూ హద్దులతో గిరిగీస్తుంది కుటుంబ వ్యవస్థ. ఇదే భావాన్ని దేశం పేరుచెప్పి ‘‘ఇది మీ దేశం. ఒకవేళ చెప్తుంది సమాజం. కాబట్టి, కుటుంబం, సమాజం, దేశం పేర్లమీద ఒకే భావన అలా విస్తృతమవుతూ ఉంటుంది.
శిశువు పుట్టిన వెంటనే నువ్వు యూదుడివి, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు హిందువువి, నువ్వు మహమ్మదీయుడవు, నువ్వు ఇది, నవ్వు అది అంటూ ప్రతి శిశువు మనసును నిలబద్ధీకరించడం ప్రారంభిస్తుంది కుటుంబ వ్యవస్థ. మన దరిద్రానికి, దానివల్ల తలెత్తిన ప్రేమరాహిత్యానికి, దానివల్ల తలెత్తిన రోగిష్టి భావాలతో కూడుకున్న మనలోని పిచ్చికి, ఇలాంటి అనేకరకాల ఇతర సమస్యలకు, అన్నిరకాల నిబద్ధీకరణలకు కుటుంబ వ్యవస్థే మూలకారణం. కాబట్టి, కుటుంబ వ్యవస్థనే నేను ముఖ్యంగా విమర్శిస్తాను.
ఎదురెదురు ఇళ్ళల్లో జీవించే రబ్బీ, బిషప్‌లు ఎప్పుడూ తమ మతాల గొప్పల గురించి వాదించుకునేవారు. ఒకరోజు కొత్తగా కొన్న ‘కాడిలాక్’ కారును కడిగేందుకు దానిపై నీరుపోస్తున్న బిషప్‌ను ‘ఏం చేస్తున్నారు’ అని అడిగాడు రబ్బీ.
‘అభిషేకిస్తున్నా. కొత్త కారుకదా!’’అన్నాడు బిషప్.
చివరికి కారుకూడా క్రైస్తవమైనందుకు రబ్బీకి ఒళ్ళుమండిపోయింది.
మరునాడు కొత్తగా కొన్న తన ‘రోల్స్‌రాయిస్’ కారు పొగ గొట్టాన్ని రంపంతో కోస్తున్న రబ్బీతో ‘ఏంచేస్తున్నారు’అని అడిగాడు బిషప్.
‘‘ఇది యూదుడయేందుకు దీనికి ‘సున్తీ’చేస్తున్నా’’అన్నాడు రబ్బీ.
ఇలాగే వారు తమ పిల్లల విషయంలో కూడా ప్రవర్తిస్తున్నారు. వారెందుకు అలా చేస్తున్నారో ఆ కార్లలాగే అమాయకులైన ఆ పసి పిల్లలకు తెలియదు.
అన్నిరకాల నిబద్ధీకరణలకు కుటుంబమే మూలాధారం. గతంలో అనేక శతాబ్దాల తరబడి తప్పులుగా నిరూపించబడిన వాటన్నింటి బరువు, బాధ్యతలను అది మీకు వారసత్వంగా ఇస్తుంది. ఆ తప్పులతో కూరుకుపోయిన మూసుకుపోయిన మీ మనసు వాటికి వ్యతిరేకమైన కొత్త వాటిని స్వీకరించలేదు. అందువల్ల మీ మనసునిండా అన్నీ తప్పులే ఉంటాయి.
మా కమ్యూన్‌లోని పిల్లలపై ఎలాంటి నిబద్ధీకరణల ముద్రలు ఉండవు. అందుకేవారు పూర్తి స్వేచ్ఛతో హాయిగా, ఆనందంగా జీవిస్తూ త్వరగా పరిణతి సాధిస్తారు. పిల్లలు తమపై ఆధారపడేలా మా కమ్యూన్‌లో ఎవరూ ప్రవర్తించరు. అందువల్ల పిల్లలందరూ స్వతంత్రులుగా తయారవుతారు. మా కమ్యూన్‌లో ఎవరూ తమ పరిధిని దాటి పిల్లలకు ఏమాత్రం సహకరించరు. ఎందుకంటే, తమకుతాము సహకరించుకునేదెలాగో పిల్లలకు తెలియాలి. అది వారికి ఒక రకమైన శక్తిని, స్పష్టతను ఇచ్చి, వారు త్వరగా పరిణతిచెందేలా చేస్తుంది. నేను చేసిన ఈ ప్రయోగం విజయం సాధించింది. పిల్లలందరూ అందరితో కలిసి ధ్యానం చేస్తారు. ధ్యానం నిబద్ధీకరణ కాదు. ఏమీచెయ్యకుండా హాయిగా కూర్చుని నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ ఆనందించడమే ధ్యానం. అలాచెయ్యడంవల్ల మీరు మెల్లమెల్లగా ఆ నిశ్శబ్దానికి అలవాటుపడతారు. అది మీ అంతర్గత ఉనికి వ్యాప్తిచెందేలా చేస్తుంది.
అప్పుడు మీరు కళ్ళు మూసుకోగానే ఏ మాత్రం లోతు లేని నిశ్శబ్ద సరోవరం మడుగులో పడిపోయి అందులోంచి అనుక్షణం మీరు నూతన శక్తిని పొందుతూ ఉంటారు. అలాగే, ఆ నిశ్శబ్దం నుంచే మీలో ప్రేమ, సౌందర్యం, మీ కళ్ళకు దివ్యమైన ఆకర్షణ, ఆత్మగౌరవంతో నిండిన మీ స్వతంత్ర భావాలకు నూతనోత్తేజం, మీ చుట్టూ ప్రత్యేకమైన దివ్యకాంతుల వలయాలు ఉద్భవిస్తాయి.
ఒక పక్క వ్యక్తిగత స్వేచ్ఛ, అధికారం, మరొకప్రక్క అధికారవాదం, నిరంకుశత్వాలు, మనిషి జీవితాన్ని, అతని ఆశయాలను నడిపిస్తుంటాయి. దయచేసి దీనిపై వ్యాఖ్యానించగలరా?
అదే ప్రశ్న, అదే సమస్య. పదాల పొందిక మారింది, అంతే. సమాజానిది అధికార వాదం. చర్చిది అధికారవాదం. విద్యావిధానానిది అధికారవాదం. అవన్నీ ‘‘మేము చెప్పేవన్నీ సక్రమంగానే ఉంటాయి. కాబట్టి, వాటిని మీరు ఏ మాత్రం ప్రశ్నించకుండా, కేవలం అనుసరించాలి, అంతే’’ అంటాయి. అయినా వాటికీ సమస్యలుంటాయి.
ఉదాహరణకు, ప్రస్తుతమున్న విద్యా విధానానే్న తీసుకుందాం. పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో అధికారుల నిరంకుశత్వానికి విద్యార్థుల జీవితాలు ఎలా నాశనమవుతాయో విద్యార్థి స్థాయి నుంచి ఆచార్యుని స్థాయి వరకు వెళ్లిన నాకు తెలుసు.
‘‘మీరు చెప్తున్నవాటిని సక్రమమైన వాదనలతో నిరూపిస్తే వాటిని అంగీకరించేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. లేకపోతే, మీ నిరంకుశత్వాన్ని అంగీకరించలేను’’ అంటూ అధికారులను ఎదిరించినందుకు అనేక కళాశాలలు నన్నుబహిష్కరించాయి. ప్రతి తరగతిలో ఉపాధ్యాయులు ఇచ్చే ఉపన్యాసాలను విద్యార్థులందరూ పరీక్షల కోసం వివరంగా రాసుకునేవారు. నేను మాత్రం అనేక ప్రశ్నలతో ఆ ఉపన్యాసాలను అడ్డుకుంటూ వారితో ఎప్పుడూ వాదించేవాడిని. నేను అడుగుతున్న చిన్న చిన్న ప్రశ్నలకు కూడా వారు సరియైన సమాధానాలు చెప్పలేక సతమతమయ్యేవారు. నావల్ల వారికి ఎప్పుడూ దినదినగండంగా ఉండేది.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.