సబ్ ఫీచర్

విమర్శకూ ఓ హద్దు ఉండాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రోజు పాఠం చెప్తున్న ఆచార్యుడు ‘‘హిందువుల పవిత్ర గ్రంథాలైన వేదాలను ‘‘దేవుడు రాశాడు’’ అన్నాడు. వెంటనే నేను ఆయనతో ‘‘మీరు చెప్పేది నేను ఒప్పుకోను. ఎందుకంటే, దేవుడున్నాడని నిరూపించలేని మీరు ఎందుకూ పనికిరాని చెత్తతో నిండిన వేదాలను దేవుడు రాశాడంటున్నారు. మీరెప్పుడైనా వాటిని పూర్తిగా చదివేరా? ఆ నాలుగు వేదాలు ఇపుడు నా దగ్గరే ఉన్నాయి.
వాటిలో నా చేతికి దొరికిన ఏదో ఒక పేజీని తీసి చదువుతా. దాని అర్థం మీరు చెప్పండి. అది విన్న తరువాత, ‘‘దేవుడు అలాంటివి రాస్తాడా?’’ అనేది ఈ తరగతిలోని విద్యార్థులే నిర్ణయిస్తారు అంటూనే, నా దగ్గర ఉన్న వేదాలలో నా చేతికి దొరికిన ఒక పేజీని తెరిచాను.
అందులో ఒక బ్రాహ్మణుడు ‘‘ఓ దేవుడా, నేను వేదాలలో చెప్పిన ఆచారాలన్నీ పాటిస్తూ, ఎన్ని క్రతువులు చేసినా నువ్వు నాకు సంతానాన్ని ప్రసాదించలేదు. అయినా వాటిని మానకుండా చేస్తున్నాను. కాబట్టి, నాకు వెంటనే సంతానాన్ని ప్రసాదించు. అపుడే నువ్వు నా ప్రార్థనలు విన్నట్లు రుజువవుతుంది’’ అంటున్నాడు దేవుడితో...
ఇది ఎవడో దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కదా! పైగా, వేదాలలో ఉన్నవన్నీ ఇలాంటి ప్రార్థనలే. అంటే వేదాలన్నీ దేవుడు కాకుండా వేరే ఎవరో రాసినట్లు కదా! ఒకవేళ మీరు చెప్తున్నట్లు వేదాలన్నీ దేవుడు రాసినవే అయితే దేవుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు అవుతుంది కదా! ఎక్కడైనా, ఎవరైనా తనని తాను ప్రార్థించుకుంటారా? అందుచేత అవి దేవుడు రాసినట్లు ఎలా అవుతుంది?
అదే నిజమైతే, ‘‘సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు’’ అయిన దేవుడు కేవలం పిల్లల కోసం ఎవరినో ప్రార్థించడమేమిటి? అంటే, దేవుడికన్నా గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ ఉంటే మనం వాణ్ణి ప్రార్థించాలి కానీ, దేవుణ్ణి ప్రార్థించడమెందుకు?.. ఇలా అడిగినందుకే ఆ కళాశాల ప్రధానాధ్యాపకుడు నాతో ‘‘ఏమీ అనుకోకు. నువ్వు అడిగేవన్నీ సక్రమంగానే ఉన్నాయి. కానీ, నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆచార్యులందరూ రాజీనామా చేస్తామంటున్నారు.
తరగతిలో పాఠాలు చెప్పనివ్వకుండా నువ్వు అనేక ప్రశ్నలతో అడ్డుకుంటున్నావని విద్యార్థులందరూ నీపై ఫిర్యాదు చేస్తున్నారు. నువ్వు అడిగే ఒక్క ప్రశ్నతో రోజంతా వృధా అవుతోంది. ఎనిమిది నెలలు ముగిసినా చెప్పవలసిన పాఠాలు ఇంకా చాలా ఉన్నాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగిలిన రెండు నెలల్లో వాటిని పూర్తిచెయ్యలేము. విద్యార్థులందరూ పరీక్షలలలో ఉత్తీర్ణులై పట్టాలు తీసుకునేందుకే ఇక్కడకు వస్తున్నారు కానీ, సత్యాన్ని తెలుసుకునేందుకు కాదు. నువ్వు మేమిచ్చే పట్టాల కోసం ఇక్కడకు వస్తున్నట్లు లేదు. నేను ఈ కళాశాలను నడపాలి కదా! నా పరిస్థితి అర్థం చేసుకో’’ అన్నాడు. వెంటనే నేను ఆయనతో ‘‘అవును. నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని ఏమీ తెలియని మీ ఆచార్యులు వేసిన మార్కులవల్ల లభించే పట్టాలతో నాకు పనిలేదు. అవి రాగానే, వాటిని మీ ముందే చింపేస్తా’’ అన్నాను. ఈ విషయం అందరికీ తెలియడంతో అన్ని కళాశాలలు నన్ను తిరస్కరించాయి. ఏం చేసేది? మొత్తం విధానమంతా అలాగే ఉంది.
అయినా అలాంటి సమస్యలన్నింటినీ అధిగమిస్తూ మొత్తానికి ఎలాగో ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా చేరి పాఠ్యాంశాల బోధన విధానంలో ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాను. అదేమిటంటే, పాఠాలు చెప్పే ప్రతి నలభై నిముషాల కాల వ్యవధిలో ఇరవై నిమిషాలు చెప్పవలసిన పాఠ్యాంశాలు చెప్పి మిగిలిన ఇరవై నిముషాలు వాటిపై విమర్శించేవాడిని.
వెంటనే విద్యార్థులందరూ ‘‘మీరు చెప్పే విషయాలలో ఏది తీసుకోవాలో తెలియక మాకు మతిపోతోంది’’ అనేవారు నాతో. వెంటనే నేను వారితో ‘‘అది మీ ఇష్టం. నేను మిమ్మల్ని మోసం చెయ్యలేను. ఎందుకంటే, నాకు తప్పు అనిపించినవి కూడా విధి లేక మీకు అలాగే చెప్పాల్సి వస్తోంది. కాబట్టి, నేను అలాగే రెండు రకాలుగా చెప్తాను. పరీక్షలలో నెగ్గాలనుకుంటే మొదటి ఇరవై నిముషాలు చెప్పిన పాఠ్యాంశాలు రాయండి, ఓడిపోలనుకుంటే తరువాతి ఇరవై నిముషాలు నేను చెప్పిన విమర్శలు రాయండి’’ అనేవాడిని.
చివరికి ఒక రోజు ఉపకులపతి నన్ను పిలిచి ‘మీరు బోధించే విధానంవల్ల ‘ఏం చెయ్యాలో తెలియట్లేదని’ విద్యార్థులందరూ నాకు రోజూ మీపై ఫిర్యాదు చేస్తున్నారు. మీ విధానం వింతగా ఉంది’ అన్నారు. వెంటనే నేను ఆయనతో ‘‘ఒక రోజు మీరు నా తరగతికి వచ్చి నేను పాఠాలు ఎలా చెప్తున్నానో పరిశీలించండి’’అన్నారు. మరునాడు ఆయన నా తరగతికి వచ్చి మొదటి ఇరవై నిముషాలు నేను చెప్పిన పాఠాన్ని విని ‘‘చాలా అద్భుతంగా చెప్పారు. ఇలా ఎవరూ చెప్పలేరు’’అన్నారు నాతో.
‘‘తొందరపడకండి. ఇది సగం పాఠం మాత్రమే. మరొక ఇరవై నిముషాలు మిగిలిన పాఠాన్ని కూడా విని ‘‘చాలా అద్భుతంగా చెప్పారు’’అని అప్పుడు చెప్పండి. ఎందుకంటే, మీ ‘అభిప్రాయాన్ని ఎలా నాశనం చేస్తానో ఇప్పుడు చూడండి’అంటూనే మిగిలిన ఇరవై నిముషాలు నా విమర్శలతో మిగిలిన పాఠాన్ని పూర్తిచేశాను. వెంటనే ఆయన ‘విద్యార్థులు మీపై ఎందుకు ఫిర్యాదుచేస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమయింది. మీరు చాలా నిజాయితీగా, చిత్తశుద్ధితోనే పాఠాలు చెప్తున్నారు.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.