సబ్ ఫీచర్

బలమైన తుంటికి యోగాసనాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకర్ణ ధనురాసనము
ధనస్సును ఆకర్ణాంతం లాగినట్లుగా కాలును, చేతితో చెవి వరకు లాగుతుంది కాబట్టి దీనికి ఆకర్ణ ధనురాసనము అనే పేరు వచ్చింది. మరి కొందరు దీనిని ధనుష్ఠాసనమని, మరికొందరు రామబాణాసనమని అంటారు.
చాపపై కాళ్లు రెండూ చాచి కూర్చోవాలి. తరువాత ఎడమకాలు మడిచి కుడిచేతితో ఎడమకాలు బొటన వేలు పట్టుకుని పైకెత్తి చెవివరకు పైకి లాగాలి. ఎడమచేయి చాచి కుడికాలు బొటనవేలును పట్టుకుని శక్తి కొద్దీ లాగాలి. ఇది చాలా సులభమైనది. దీన్ని అందరూ చేయవచ్చు. పొట్ట ఉన్నవారికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇదేవిధంగా ఎడమకాలును చాచి కుడికాలును ఎడమచేత్తో చెవివరకు లాగి చేయాలి. ఇలా రెండువైపులా చేయాలి. కుడివైపున చేసేదాన్ని సవ్యం అనీ, ఎడమవైపున చేసేదాన్ని వామం అనీ అంటారు. నడుము నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని డాక్టరు సలహాతో మాత్రమే వేయాలి.
* ఇందులో తుంటి కీళ్లను బాగా వంచడం వల్ల త్రికాస్తులలోనూ, తుంటి కీళ్లలోనూ ఏవైనా దోషాలుంటే తగ్గిపోతాయి.
* మోకాళ్లు, పిక్కల ఎముకల్లో ఏవైనా దోషాలుంటే తగ్గిపోతాయి.
* చేతి గూడలోని ఎముకల్లో ఉన్న దోషాలు కూడా పోతాయి.
* ఈ ఆసనంలో నాడీమండలాన్ని బాగా సాగదీయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
అర్థమత్స్యేంద్రాసనం
ఈ ఆసనం మత్స్యేంద్రులు అనే యోగీశ్వరుడు రూపొందించారు. అందుకే దీనికాపేరు వచ్చింది. అర్థమత్స్యేంద్రాసనంలో విడివిడిగా రెండు పక్కలకు వక్రాసనంలో మాదిరి చేయాలి.
కుడిపక్క..
కూర్చుని రెండు కాళ్ళను పూర్తిగా చాపి చేతులను వీపు వెనకాల భాగాన నేలకు ఆనించాలి. తరువాత ఎడమకాలిని మడిచి, సీటుకిందకి మడమ వచ్చేటట్లు పెట్టి ఎడమ కాలి పాదంపై కూర్చోవాలి. తరువాత కుడికాలిని మడిచి పైకి లేపి ఎడమకాలి తొడను దాటించి పాదమును నేలపై ఆనేలా పెట్టాలి. ఇప్పుడు ఎడమ చేతిని కుడి కాలి మోకాలి పైనుండి తీసుకుని వచ్చి ఎడమ మోకాలి చిప్ప భాగాన్ని పట్టుకోవాలి.
ఎడమ పక్క..
కూర్చుని రెండు కాళ్ళను పూర్తిగా చాపి, చేతులను వీపు వెనకాల భాగాన ఆనించాలి. తరువాత కుడికాలిని మడిచి సీటుకింద మడమ ఉండేటట్లు పెట్టి కుడికాలి పాదముపై కూర్చుంటారు. తరువాత ఎడమకాలిని మడిచి పైకి లేపి కుడికాలు తొడను దాటించి ఆ పక్క నుంచోబెడతారు. ఇప్పుడు కుడిచేతిని ఎడమకాలి మోకాలిపైనుండి తీసుకువచ్చి కుడిమోకాలి చిప్ప భాగాన్ని పట్టుకుంటారు. ఎడమకాలిని కుడిచేయి చంక భాగములోనికి వెళ్ళేటట్లు కుడిచేతితో బాగా నెట్టుకుంటూ నడుమును, మెడను పూర్తిగా ఎడమపక్కకు తిప్పుతూ ఎడమచేతిని నేలపై నుండి తీసి నడుము భాగముపై పెట్టి శరీరాన్ని కుడికాలిపై ఆపగలిగి అలా కదపకుండా నిలపగలగాలి.

మరో పద్ధతి
ఎడమకాలిని మడిచి నడుము కింద పెట్టకుండా అలా పక్క భాగానికి జరిపి, కుడికాలిని మడిచి ఎడమ కాలి మోకాలి భాగాన నుంచోబెట్టి, ఎడమ చేతిలో కుడికాలును నెడుతూ ఎడమ చేతితో ఎడమ మోకాలి భాగాన పట్టుకోవడం కష్టం కాబట్టి, అందినంత వరకు చేతిని పెట్టి, ఎడమ చేతితో కుడి కాలిని నెడుతూ, నడుమును, మెడను పూర్తిగా పక్కకు తిప్పుతూ కుడిచేతిని నేలకు ఆనించవచ్చు లేదా నడుము పై భాగాన పెట్టుకోవచ్చు. నడుము నొప్పి, కాలు జాలు ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. డాక్టరు సలహా తీసుకుని ప్రయత్నించవచ్చు.
ఈ ఆసనం వేయడం వల్ల..
* తుంటి భాగంలో ఉన్న కొవ్వు కరుగుతుంది.
* పొట్టలోని గ్యాస్ బయటకు పోతుంది.
* పాంక్రియాస్ గ్రంథి బాగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచి ఆసనం.
* భవిష్యత్తులో వయసు పెరిగినప్పటికీ నడుముకు సంబంధించిన ఇబ్బందులు రావు.
తొడలు బాగా లావుగా ఉన్నవారు, పొట్ట పెద్దదిగా ఉన్నవారు ఈ ఆసనం వేయాలంటే శరీరం సహకరించదు.