సబ్ ఫీచర్

స్వానుభవమే గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ, మీరు మాలాంటి సంస్థలలో ఉండవలసిన వారు కాదు. ఎందుకంటే, ప్రస్తుతమున్న విద్యావిధానం విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచేదిగా ఉంది కానీ, వారిని విజ్ఞానవంతులు చేసేదిగా లేదు. పైగా, అందరికీ అదే కావాలి. ఎందుకంటే, మనకు గుమస్తాలు, పెత్తందార్లే కావాలి. ఆ ఉద్యోగాలకు జ్ఞాపకశక్తి ఉంటేచాలు, విజ్ఞానంతో పనిలేదు’’ అన్నారు.
వెంటనే నేను ఆయనతో ‘మీకు కావలసింది కంప్యూటర్లే కానీ, మనుషులు కాదు. ప్రస్తుత విద్యావిధానం ఇలాగే కొనసాగితే త్వరలో మీరు మనుషుల స్థానంలో కంప్యూటర్లు పెట్టుకోవలసి వస్తుంది. పని విషయంలో అవి చాలా కచ్చితంగా ఉంటాయి కాబట్టి, అనేక సంస్థలలో అందరూ అదే చేస్తున్నారు.
ఎందుకంటే, వాటికి చాలా జ్ఞాపకశక్తి ఉంటుందే కానీ, తెలివితేటలుండవు. హీరోషిమా, నాగసాకి నగరాలపై కంప్యూటర్ల చేత బాంబులు వేయించి ఉంటే అవి కచ్చితంగా ఎక్కడ పడాలో అక్కడే పడేవి. కానీ, వాటిని వేసింది మనిషి. తాను చేస్తున్న పని ఏమిటో, దాని ఫలితం ఎలా ఉంటుందో అతనికి తెలియదు. అతను కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. కానీ, అతని తెలివితేటలను మీరే నాశనంచేశారు. దానివల్ల సైన్యంతో కానీ, యుద్ధంతో కానీ, ఎలాంటి సంబంధం లేని అమాయకులైన అనేక లక్షల మంది సాధారణ పౌరులు చనిపోయారు. అతను చేసిన పని సరియైనదా?
అన్నిచోట్లా ఇప్పుడున్న అణ్వాయుధాలన్నీ మనుషుల చేతుల్లో కాకుండా, కంప్యూటర్ల అధీనంలో ఉన్నాయి. అవే మూడవ ప్రపంచ యుద్ధం చేస్తాయి. మనుషులందరూ మరణిస్తారు. కంప్యూటర్లకు అదొక విషయమే కాదు. అది వేరే విషయం. కానీ, అవి మనిషి కన్నా చాలా సమర్థవంతంగా కచ్చితత్వంతో పనిచేస్తాయి. అదే కాస్త తెలివితేటలున్న మనిషి అయితే ‘నేను చేస్తున్న పని ఏమిటి? దీనివల్ల అనేక లక్షల మంది చనిపోతారు కదా!’ అనే ఆలోచనలో పడి, ఆ పని చేసేందుకు సంకోచిస్తాడు.
అన్ని మతాలు, సంస్థలు అధికార వాదంతో కూడుకున్నవే. అవి అలా ఎందుకుంటున్నాయో మీకు చెప్పవు. కానీ, ‘చెప్పిన పని చెయ్యండి. జీసస్ అలా చెప్పినట్లు పుస్తకాలలో రాసి ఉంది’ అంటాయి. నిజానికి, జీసస్ కానీ, మోజెస్ కానీ, కృష్ణుడు కానీ, తమ మాటలుగా ఎప్పుడూ ఏదీ చెప్పలేదు. ఏదీ సిద్ధాంతీకరించలేదు.
మీరు ఏమాత్రం ఎదురు ప్రశ్నించలేని విధంగా దేవుణ్ణి అన్ని సందర్భాలలో వాడుకోవడం జరిగింది.
అలాంటి అధికార వాదాలన్నింటినీ మనమే సర్వనాశనం చెయ్యాలి. ప్రామాణికత అనేది వ్యక్తి జ్ఞానానికి సంబంధించినది. అధికార వాదం సంఘాలకు, సమాజాలకు - చర్చి, మసీదు, దేవాలయం- సంబంధించినది.
నేను మీకు ఏదైనా చెప్తున్నానంటే, దానిని చాలా ప్రామాణికంగా చెప్తున్నట్లే. ఎందుకంటే, స్వానుభవంతో నేను దానిని తెలుసుకున్నాను కాబట్టి. అయినా మీరు దానిని నమ్మవలసిన పనిలేదు. నేను చెప్పినది మీరు శ్రద్ధగా విన్నారు. అదే నాకు చాలు. దానిపై మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
అది నేను చెప్పిన దానికి అనుకూలమైనా, ప్రతికూలమైనా ఫర్వాలేదు. కానీ, మీరే స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. అది కూడా మీ ఉనికి కేంద్రం నుంచి రావాలి. అదే నాకు ముఖ్యం. లేకపోతే, మీరు నన్ను అధికారవాదిగా మార్చినట్లే. దయచేసి అలా చెయ్యకండి. ఎందుకంటే, నేను తెలుసుకున్న సత్యాన్ని మీకు స్పష్టంగా తెలిసేలా చెప్పేందుకు చాలా ఆవేశంతో చాలా ప్రామాణికంగా మీతో మాట్లాడుతున్నాను. ఆపైన మీ ఇష్టం, నేను మీకోసం అలా చెప్పట్లేదు. అలాగే నన్ను, నా మాటలను నమ్మమని కూడా నేను మిమ్మల్ని అడగట్లేదు. నేను చెప్తున్న దానిపై మీరు కాస్త ఆలోచిస్తే చాలు. అలా చేస్తే నేనే మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే, మీ ఆలోచన మీ తెలివికి పదునుపెడుతుంది.
దానిపై నాకు నమ్మకముంది. అపుడు మీరు తీసుకున్న నిర్ణయం సక్రమంగానే ఉంటుంది. ఒకవేళ మీ నిర్ణయం సక్రమంగా లేకపోయినా ఫర్వాలేదు. ఎవరైనా పైకి లేవాలంటే ముందు కింద పడాల్సిందే. జీవితం అలాగే ఉంటుంది. తప్పులు చేస్తేనే ఏది ఒప్పో తెలుస్తుంది. అప్పుడే అడ్డుగా వున్న రాళ్ళను సోపానాలుగా ఎలా మలచుకోవాలో మీరే తెలుసుకుంటారు.
నాకు ఎలాంటి నమ్మకాలు, విశ్వాసాలతో పనిలేదు. వ్యక్తి స్వేచ్ఛతోనే అధికార వాదం నశించి నూతన శక్తి ఉదయిస్తుంది. అదే ప్రామాణికత. ప్రతి వ్యక్తికి స్వీయానుభవాలు కచ్చితంగా ఉంటాయి. అపుడే అతడు ‘నేను దానిని చూశాను, నేను దాని రుచిని ఆస్వాదించాను, నేను నాట్యం చేశాను, నేను ఆనందించాను’’ అని ప్రామాణికంగా చెప్పగలడు. ‘‘పవిత్ర గ్రంథాలలోని సూక్తులు చెప్తున్నాను’’ అని చెప్పి తప్పించుకోవడం నాకు ఒక విషయమే కాదు. కానీ, నా హృదయంలోని వాస్తవానే్న నేను మీకు చెప్తున్నాను.
ప్రామాణికత అనుభవానికి సంబంధించినది. అధికారవాదం అనేది మీకు సంబంధించినది కాదు. అది మరొకరికి సంబంధించినది. అందుకే అది బానిసత్వాన్ని సృష్టిస్తోందికానీ, స్వేచ్ఛను సృష్టించట్లేదు.
ప్రామాణికత అనుభవానికి సంబంధించినది. అధికారవాదం అనేది మీకు సంబంధించినది కాదు.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.