సబ్ ఫీచర్

ఎం.ఆర్.ఎం. కృషి అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్నికి బద్ధశత్రువు హిమం (మంచు). అయితే ప్రకృతి అందాలకు కొలువైన కాశ్మీర్‌లో మాత్రం అటు హిమం, ఇటు అగ్ని చెట్టపట్టాల్ వేసుకొని ‘హిమగ్ని’గా మారాయి. అటువంటి ‘హిమగ్ని’ని తిరిగి హిమం, అగ్నిగా వేరుచేయడానికి గత నాలుగున్నర దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిమగ్నిలో సమిధలుగా మారుతున్నది యువత. ఎంతో నైపుణ్యం, ప్రజ్ఞాపాటవాలు కలిగి ఉన్నప్పటికీ, తగిన అవకాశాలు లభించక కాశ్మీరీ యువత తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నది. ఒకవైపు మత ఛాందసవాదులు, మరోవైపు తీవ్రవాదులు, సైన్యం ఇంకొక వైపు నిరుద్యోగం ఇక్కడ యువతపై ముప్పేట దాడి చేస్తున్నాయి. తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పలువురు మత ఛాందసవాదులు, తీవ్రవాదులు పెట్టే ప్రలోభాలకు లొంగిపోతున్నారు. దశాబ్దాల తరబడి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు సాగిస్తున్న దమనకాండ వలన అక్కడ యువతకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడ మృగ్యమైపోతున్నాయి.
‘‘హిందూ-ముస్లిం భాయ్, భాయ్’’అనే నినాదంను కార్యరూపంలో చూపించడానికి ప్రయత్నిస్తున్నది ముస్లిం రాష్ట్రీయ మంచ్. రాష్ట్రీయ స్వయంసేవక్ (ఆర్.ఎస్.ఎస్.) అంటే హిందూత్వం ప్రబోధించి, ఇతర మతాలను తుదముట్టడించడానికి ప్రయత్నిస్తుందనే దుష్ప్రచారం జరుగుతున్నది. అయితే, ఆర్.ఎస్.ఎస్. మాత్రం ఉగ్రవాదుల చర్యలతో అట్టుడికిపోతున్న కాశ్మీరీ యువతను సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నది. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ముస్లిం రాష్ట్రీయ మంచ్. ఆర్.ఎస్.ఎస్.కు చెందిన ఇంద్రేశ్‌కుమార్ ఆలోచనల నుంచి ఉద్భవించిందే ఎం.ఆర్.ఎం. కాశ్మీర్‌లో 2002వ సంవత్సరంలో ప్రారంభమైన ఎం.ఆర్.ఎం. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అన్ని జిల్లాలు, తాలూకా స్థాయిలలో ఎం.ఆర్.ఎం. శాఖలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సంస్థలో ఎనిమిది వేల మంది సభ్యులు ఉన్నారు. తీవ్రవాద సంస్థలు ప్రేరేపితం చేయడంలో కాశ్మీరీ యువత రాళ్ళు రువ్వడంలో నిష్ణాతులు అయ్యారు. అటువంటి వారిని తిరిగి చదువు, ఉపాధివైపు దృష్టిమరలించే విధంగా ఎం.ఆర్.ఎం.చేస్తున్న కృషి ఇప్పుడిప్పుడే తగిన ఫలితాలను ఇస్తున్నది.
2005వ సంవత్సరంలో ఉత్తర కాశ్మీర్‌లో సంభవించిన భూకంపం వలన నిర్వాసితులైన వారికి పునరావాస కార్యక్రమాలు చేపట్టడంలో ఎం.ఆర్.ఎం. సభ్యులు భారతీయ సైన్యంకు చెందిన ఇండియన్ రైఫిల్స్‌కు ఇతోధికంగా సహాయం అందించారు. వీరు భూకంప బాధితులకు నిత్యావసరాలు అందించడంలో విశేషంగా కృషిచేశారు. ఎం.ఆర్.ఎం. సభ్యులు తరచు స్థానిక పెద్దలతో సంప్రదింపులు జరిపి, వారి అంగీకారంతోనే తమ శాఖలను ఏర్పాటుచేస్తున్నారు. దీనివలన, ఎం.ఆర్.ఎం. నిర్వహిస్తున్న కార్యక్రమాలకు స్థానికుల నుంచి కూడ చక్కని సహకారం అందుతున్నది. దసరా పండుగ సందర్భంగా ఇటీవల జమ్మూలో ఎం.ఆర్.ఎం. సభ్యులు నిర్వహించిన కవాతు పలువురిని విశేషంగా ఆకర్షించింది.
వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకోసం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించేవారికి కేంద్ర మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా ఉపకార వేతనాలు అందించడానికి కృషిచేస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఉర్దూ లాంగ్వేజ్ సహకారంతో రాష్ట్రంలోని 70 ప్రాంతాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్‌లో ఆర్థికంగా వెనకబడిన ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రవేశం లభించేలా కృషిచేస్తున్నారు. కాశ్మీరు యువతను ఉద్యమం, తిరుగుబాటు బాటనుంచి విద్య, ఉపాధి రంగాలవైపు మరలించడానికి ముస్లిం రాష్ట్రీయ మంచ్ చేస్తున్న కృషి అభినందనీయం.

- పి.భార్గవరామ్