సబ్ ఫీచర్

సేద్యమూ బ్రాహ్మణ వేదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మే నెలలో విజయవాడ, హైదరాబాద్‌లలో 3వేదం వర్సెస్ స్వేదం2 అని రెం డు సభలు జరిగాయి. తరువాత నాటకీయంగా బ్రాహ్మణకులం ఉత్పత్తికి సంబంధించనిదని, వారికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు కేటాయించరాదని ఇచ్చినది ఉపసంహరించాలని కొన్ని సంఘాలు కోరాయి.
నాలుగువేదాలు చదివి, బ్రాహ్మణుల వృత్తి ని పరిశోధించిన ఎవరీ నిర్ణయం చేశారో?
వేదం శారీరక శ్రమకు వ్యతిరేకమని వారి ఉద్దేశం కావచ్చు. ఇది వాస్తవానికి అసత్యం. వేదంతో సేద్యం విషయాలు చాలా ఉన్నాయి.
దునే్న సమయంలో ఎడ్లకు దప్పి తీర్చడానికి నీళ్ల తొట్టెలను ఏర్పరచాలి. నూతుల్లో వేసవిలో కూడా నీరు ఎండిపోకుండా జల బాగా వచ్చేలా లోపలి బురద తొలగిచాలి, నూతిగట్టులు పడిపోకుండా ఏర్పాటు చేయాలి. నూతి దగ్గర చర్మంతో తాడు, తోడుకోవడానికి సాధనం ఏర్పరచుకోవాలి. నాగలికి కాడిని అమర్చాలి. నాగళ్ల కొన భాగాలు భూమిని బాగా దున్నాలి.2అని వేదం చెప్పింది.
నాగలికి మూడు భాగాలుంటాయి. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క కాడి అమర్చాలి. ప్రతి కాడికి రెండు ఎద్దులను కట్టాలి. పనె్నండు ఎడ్లను కట్టే నాగలితో దున్నవచ్చు. ఈ నాగలికి ఆరు భాగాలు ఉంటాయి. ప్రతి భాగంలో ఒక కాడి ఏర్పాటు చేయాలి. ప్రతి కాడికి రెండేసి ఎడ్లను కట్టాలి. ఇలా వేదం ఈనాడు మనకు తెలియని పెద్ద నాగళ్లను ఉపయోగించి దున్నడం తెలిపింది.
34వజ్రం వలె తీక్షణమైన ఈ నాగలి పెద్ద మట్టి పెడ్డలు పైకి వచ్చేలా దున్నాలి. పదునైన ఈ నాగలివల్ల మన్ను దునే్నవారికి శ్రమ ఉండదు. ఎత్తుపల్లాలుంటే చాలుకు మధ్యలో విచ్ఛేదం కలుగుతుంది. (కావున నేలను సమంగా చేసుకోవాలి)- (తైత్తరీయోపనిషత్ 4కాం.2ప్ర. 5అను.)
3పధ్నాలుగు రకాల విత్తనాలు నాటాలి. గ్రామాల్లో దొరికే ధాన్యాలు ఏడు రకాలు. అడవిలో దొరికే ధాన్యాలు ఏడు రకాలు, నువ్వులు, మినుములు, వరి, అవలు, కొఱ్ఱలు, చిరువడ్లు, గోధుమలు గ్రామాల వద్ద పండించే ధాన్యాలు.
వెదురుబియ్యం, చావలు, నెవ్వరి ధాన్యం, కారు నువ్వులు, అడవి గోధుమలు, మర్కటకాలు, గారుత్మతాలు అడవి ధాన్యాలు.- (తైత్తరేయ సంహిత 5కాం. 2ప్ర 5అను.) వీటిలో మర్కకకాలు, గారుత్మతాలు, అనే ధాన్యం స్వరూపం గురించి పరిశోధించాలి.
దునే్న పద్ధతిని కల్పసూత్రాలు చెప్పాయి. దున్నవలసిన భూమిని పక్షి ఆకారంగా భావిం చి దునే్నరీతి చెప్పారు. దాని తోకభాగం నుంచి శిరోభాగం వైపునకు దున్నాలి. దక్షిణం రెక్కనుండి ఉత్తరం రెక్క వరకు దున్నాలి. దక్షిణం పిరుదు నుండి ఉత్తరం భుజ శిరస్సు వరకు దున్నాలి. ఉత్తరం పిరుదు నుండి దక్షిణం భుజ శిరస్సు వరకు దున్నాలి. ఇలా మొత్తం పనె్నండు నాగలి చాళ్లు అయ్యేలా దున్నాలి. ఇలా దున్నిన తరువాత విత్తనాలు నాటాలి.
ఈ వేదభాగాల వల్ల సేద్యం, పధ్నాలుగు రకాల ధాన్యాలను పండించడం, పనె్నండు ఎద్దులు, ఆరు కాడులు అమర్చిన నాగళ్లతో సేద్యం చేయడం వేదం చెప్పిందని తెలుస్తోంది. కాబట్టి వేదానికి ఉత్పత్తి వృత్తులకు వైరుధ్యం ఉందనుకోవడం వాస్తవం కాదని స్పష్టమవుతున్నది.
మరొక విషయం. ఏ శుభ కార్యం చేసినా ముందు అంకురారోపణం చేయడం ఇప్పటికీ వాడుకలో ఉంది. దానితో మూకుళ్లలో పుట్టమన్ను వేసి పాలల్లో తడిసిన విత్తనాలు నాటుతారు. ఇది శుభకార్యం జరిగిన పదహారవ రోజు వరకు నీళ్లు చల్లుతూ పెంచుతారు. తరువాత దొడ్డిలో నాటేవారు కాబోలు. ఇప్పుడు కూడా మొదట విత్తనాలు నాటి మొక్కలు వచ్చాక వేరోచోట నాటుతున్నారు కదా! పొలాలు లేనివారు కూడా వ్యవసాయ పద్ధతిని మరచిపోకుండా ఉండడం కోసమో, ఇంట్లో వారికి వ్యవసాయ పద్ధతి తెలియడం కోసమో, శుభకార్యాలలో ఎక్కువ ఆహారం వినియోగింపబడుతుంది కాబట్టి ఆ తర్వాత లోటు పూడ్చడానికో ఈ పద్ధతి ఏర్పడి ఉండవచ్చు. ఈ అంకురారోపణం బోధాయన ముని చెప్పాడు. అంటే ప్రాచీన కాలంనుండి ఇది ఆచరణలో ఉందని స్పష్టం.
పైన పేర్కొన్న విజయవాడ, హైదరాబాదు సభల్లో బ్రాహ్మణకులం ఉత్పత్తికి సంబంధించినది కాదని చెప్పారు.
బ్రాహ్మణునికి సేద్యం వృత్తి అని మనుస్మృతిలో ఉన్నది (4అ.2,4శ్లో). ఇప్పటికి అర్థ శతాబ్దం వెనుక పలువురు బ్రాహ్మణులు, వేద పండితులూ సేద్యంతో జీవించడం నేను చూచాను. రాష్టప్రతి సమ్మానం పొందిన ప్రముఖ వేదార్థపండితులు, ఘనాపాఠి శ్రీలంక వెంకటరామశాస్ర్తీ సోమయాజులు దాదాపు షష్టిపూర్తి వరకు సేద్యం చేస్తూ వేదశాస్త్రాలను విద్యార్థులకు చెబుతూ, అగ్నిహోత్ర సేవ చేస్తూ ఉండేవారు. మూడు వేదాలు, జ్యోతిష్యం చదివిన వేదార్థ పండితులు శ్రీ తంగిరాల బాలగంగాధర శాస్ర్తీ ట్రాక్టరుతో వ్యవసాయం చేసేవారు. వేదాధ్యయన తపస్వి శ్రీ గుళ్లపల్లి సీతారామావధానలు తమ పిల్లలకు, మనుమలకు, ఇతరులకు కూడా వేదం చెప్పారు. ఆయనకు పొలం లేదు. బంధువుల పొలం మగతాకు తీసుకొని వ్యవసాయం చేసి జీవించారు. ఆయన వేద సభలకు కూడా వెళ్లేవారు కాదు.
ఆ కాలంలో ఎకరానికి పద్ధెనిమిది బస్తాలు పండేవి. పనె్నండు బస్తాలు, భూమి యజమానునికి ఇచ్చేవారు. ఈ వేద పండితుల కుమారులు బాల్యంలో కలుపు తీయడం, దున్నిన పొలం చదును చేయడం, పశువులను మేప డం, నాప చేను కోసి పశువులకు వేయడం, దిగువ బోది నుండి ఎగువ పొలానికి నీళ్లు తోడడం మొదలైన పనులు చేస్తూ వేదం ఆవృత్తి చేసేవారు. పెద్దవారు, పెద్ద పనులు చేసేవారు కారు. ఆ కాలంలో చేనుకు బలం కలగడం కోసం పంటకోశాక, జనప విత్తనాలు వేసి, ఆ మొక్కలతో సహా దునే్నవారు. చేలో పశువుల మందలను కట్టేవారు.
ఇప్పటికి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, కోనసీమలో సేద్యం చేసే వేదపండితుల కుటుంబాలున్నాయి. ఇక లౌకికులైన బ్రాహ్మణులు సేద్యం చేసేవారనేకులున్నారు. పొలాలు లేనివారు వేరు వృత్తులను అవలంబించడం సహజం.కాబట్టి బ్రాహ్మణకులం ఉత్పత్తికి సంబంధించనిదని చెప్పడం వేదానికి లోక స్థితికి విరుద్ధం.
ఇక ఈకాలంలో అన్ని కులాలవారు తమ కందుబాటులో ఉన్న జీవన వృత్తిని అనుసరిస్తున్నారు. అది బ్రాహ్మణులకూ వర్తిస్తుంది. ఈ విషయం గ్రహించి ఇక ఇటువంటి అసత్య విమర్శలు చేయరని ఆశిద్దాం.
ఈ సందర్భంలో రెండు ప్రాచీన కథలను గుర్తుకు తెచ్చుకోవాలి. గొప్ప కరవు కాటకాలు ఏర్పడితే అత్రిముని భార్య అనుసూయ తన తపోబలంతో గంగానదిని ప్రవహింపజేసి కందమూల ఫలాలను పండించి కరవునుండి జనాన్ని రక్షించిందని శ్రీమద్రామాయణలో ఉంది (అయోధ్య-117స.)
గౌతముని కరవు కాలంలో తపోబలం వల్ల తొందరగా పండే వరిధాన్యంతో సంతర్పణలు చేసి జనాన్ని రక్షించాడు. ఆ సందర్భంగానే గౌతముడు గోదావరిని ప్రవహింపజేశాడని గౌతమీ మహత్మ్యంలో ఉంది. ఇంతకు బ్రాహ్మణులు సేద్యానికి సంబంధం ఈనాటిది కాదు.
ఇక ఈ ప్రజాస్వామ్య కాలంలో అన్ని కులాలవారు తమ కందుబాటులో ఉన్న వృత్తిని అవలంబిస్తున్నారు. ఇది బ్రాహ్మణులకూ వర్తిస్తుంది. ఈ విషయాలను గ్రహించి ఇటువంటి అసత్య విమర్శలు చేయరని ఆశిద్దాం.

డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణశర్మ సెల్: 09963455584