సబ్ ఫీచర్

సద్భావనలతోనే ప్రశాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషిగా పుట్టింది మానవత్వంతో జీవించడానికి, మీరో మనిషిని పీక్కు తినడానికి కాదు. ఎదుటివారికి ఇబ్బంది కలిగించడానికి అంతకంటే కాదు. తాను జీవిస్తూ మరో ప్రాణి సుఖంగాజీవించేందుకు దోహదపడాలి. మీతో మంచి భావాలుంటే వాటి వాసనలను ఈలోకం గ్రహించి మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని వద్దన్నా సంక్రమింపచేస్తుంది. హంగులూ ఆర్భాటాలను మోసపూరితంగా సంచరించేవారిని ఈ లోకం ఏదో ఒక సమయంలో గుర్తించి తీరుతుంది. ఆ విధంగా గుర్తింపు పొందాలనుకోవడం అవివేకం.
ఒక వేట ఈవిధంగా గుర్తింపు లభించినా అది శాశ్వతమైనది కానేకాదు. ఎదుటివారికి మంచి చేయకపోగా, వారిలోని చెడుగుణాలను వేలెత్తి చూపుతూ సదా విమర్శలు చేస్తూ కాలం గడిపేవారు, వారంతట వారే చేజేతులా పాడై పోతున్నారు. అలా గాక పరులల్లో మంచితనాన్ని చూస్తూ వారిలో మంచిని గ్రహిస్తూ మంచి నడవడికను అలవాటు చేసుకొంటే తమ జన్మకు అతకన్నా ప్రయోజనం వేరే ఏముంటుంది? అందరిలోనూ ఉన్న పరమాత్మ ఒక్కడే అని మనం అనుకుంటున్నప్పుడు పరులను దూషించినా పరమాత్మను దూషించినట్లే అవుతుంది కదా. దానివల్లనే ఇతరులను గౌరవించాలి, సర్వత్రా గౌరవ ప్రదమైన జీవన విధానం అలవర్చుకోవాలి.
భగవంతుడు ప్రసాదించిన పంచేద్రియాలను మానవుడు సద్వినియోగం చేసుకోవాలి. అతను ఆచరించే పనుల్లోనో మంచైనా చెడైనా లభించగలిగేది. ఎందుకంటే తన ఆలోచనలను బట్టే అతడు మంచి కర్మలను గానీ చెడు కర్మలను గానీ ఆచరిస్తున్నాడు. అతను చేసే ప్రతిపనిలోను పవిత్రత వుంటే తద్వారా సహనం, శాంతి, సౌఖ్యం లభిస్తాయి. మనస్సులో సద్భావాలను నింపుకుంటే చరించే పనుల్లో కూడా మంచితనమే నిండుకుంటుంది.
మన హృదయాల్లో చెడు భావాలు కలిగి ఉంటే మనకర్మలపైన కూడా ఈ విధమైన భావాలే నెలకొని చెడుపనులకూ చెరుపు మాటలకు దారిదీస్తాయి. తద్వారా పాపం అంటుకుంటుంది. దాని ఫలితం ఈ జన్మలో తీర్చుకుంటే సరే సరి. లేదంటే వేరే జన్మలో నైనా తప్పక అని అనుభవించి తీరాల్సిందే. మరో మార్గం లేదు. కానీ ప్రాయశ్చిత్తం ద్వారా కొంతవరకు ఊరట కలిగే అవకాశం లేకపోలేదు. మనస్సును నిర్మలంగాను, పవిత్రం గను ఉంచుకోవాలనుకుంటే ముందుగా మనం సత్సంకల్పాలు అభివృద్ధి గావించుకోవాలి. దీనికి మార్గం ఒకటే అదే దైవనామాన్ని స్మరించం, ఆ విషయం సదా మనస్సులో నిల్చి ఉంటే దైవప్రీతి దైవభీతి వాటంతటఅవే చోటు చేసుకొంటాయి. తద్వారా మానవ ధర్మం గుర్తుకొస్తుంది. మనస్సు పెట్టి మాత్రమే దైవనామస్మరణం గావించిన తరువాత వారికి ఆనందం కొకొల్లలుగా లభిస్తుంది. కొన్ని క్షణాలైనా ఈ యాంత్రిక ప్రపంచపు అసహజమైన తలపుల నుంచి వాతావరణం నుంచి దూరంగా శాంతికి చేరువై మనశ్శాంతిని పొందగలరు.

-డా. పులివర్తి కృష్ణమూర్తి