సబ్ ఫీచర్

ఆధార్ ఆధారమా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్ఖండ్ రాష్ట్రం.. సిండేగా జిల్లా.. కారామాటి గ్రామం.. అందులో వంద కుటుంబాలుంటాయి. 2017, సెప్టెంబర్ 28వ తేదీ.. ఆకలితో అలమటిస్తూ చనిపోయిందో చిన్నారి. ఆమే సంతోషి కుమారి. పదకొండేళ్ల సంతోషి నాలుగురోజుల పాటు ఆకలి.. ఆకలి.. అంటున్నా ఇంట్లో తిండి లేదు.. రేషన్ దొరకలేదు.. అలా ఆకలి అంటూనే ఆ చిన్నారి చనిపోయింది. తిండికోసం ఏడుస్తూ ప్రాణాలు కోల్పోయిన చిన్నారిని చూసి ఆ తల్లి గుండె తరుక్కుపోయింది. ఆధార్ కార్డుతో రేషన్ కార్డును లింక్ చేయని కారణంగా వెనుకబడిన వర్గానికి చెందిన సంతోషి కుటుంబానికి 8 నెలలుగా సరుకులు ఇవ్వలేదు రేషన్ డీలర్. అనారోగ్యం కారణంగా సంతోషి తండ్రి ఏ పనీ చేయలేడు. అందువల్ల కుటుంబ భారమంతా సంతోషి తల్లి కోయలిదేవి, సంతోషి అక్కపైనే.. వీరిద్దరూ కలిసి వేపపుల్లలు అమ్ముకునో, ఎవరింట్లో అయినా పాచిపని చేసుకుంటూనే కుటుంబాన్ని పోషించేవారు. వెనుకబడిన వర్గానికి చెందినవారు కావడంతో ఎవరూ వారికి పని ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. ఇలా ఎన్నో రాత్రులు.. ఆకలితో గడిచిపోయాయి వారింట్లో..
గత సంవత్సరం సెప్టెంబర్ 28న మధ్యాహ్నం కడుపులో నొప్పి వస్తోందని సంతోషి చెప్పింది. ఆకలివల్లే ఆమెకు కడుపునొప్పి వచ్చిందని, అన్నం తినిపిస్తే నొప్పి తగ్గిపోతుందని ఊర్లోని డాక్టర్ చెప్పాడు. కానీ సంతోషికి తినిపించడానికి ఇంట్లో ఒక్క మెతుకు కూడా అన్నం లేదు. అప్పటికే సంతోషి అన్నం కావాలి అని ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కాళ్ళూ, చేతులు బిగుసుకుపోయాయి. ఆ బాధ చూడలేక కోయలి ఇంట్లో ఉన్న టీ పొడి, ఉప్పు కలిపి టీ కాచి, సంతోషికి ఇవ్వాలని అనుకుంది. కానీ ఇంతలోపే సంతోషి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేసింది. ఆ సమయంలో స్కూలు ఉన్నట్లయితే.. మధ్యాహ్న భోజనం కారణంగా ఆ చిన్నారి ప్రాణాలు నిలబడేవి. కానీ అవి దసరా రోజులు కావడం, స్కూలు సెలవుల కారణంగా ఆ భోజనం కూడా దొరకలేదు. ఆ కుటుంబం ఆధార్ కార్డును రేషన్ దుకాణంలో పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) యంత్రానికి అనుసంధానించలేదన్న కారణంగా ఆ కుటుంబానికి అప్పటికి ఎనిమిది నెలలుగా రేషన్ అందలేదు. ఆధార్‌కు అనుసంధానించని అన్ని రేషన్ కార్డులను జార్ఖండ్ ప్రభుత్వం ఆ సమయంలో రద్దు చేసింది. సంతోషి మరణం దేశవ్యాప్తంగా అప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధార్‌తో పాటు దేశంలో ఆకలి పైన కూడా అనేక చర్చలు జరిగాయి. సామాజిక కార్యకర్తలు రూపొందించిన గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో దేశంలో యాభై ఆరు మంది ఆకలితో చనిపోయారు. ఇందులో నలభై రెండు మరణాలు 2017 - 2018 మధ్యే సంభవించాయి. వీటిలో ఇరవై ఐదు మరణాలకు ఆధార్ కార్డు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమైంది. ప్రముఖ సామాజిక కార్యకర్తలైన రితిక ఖేడా, సిరాజ్ దత్తాలు రూపొందించారు. వీటి ప్రకారం జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎక్కువ ఆకలి చావులు సంభవించాయి.
సంతోషి తల్లి మాట్లాడుతూ 34ఆధార్ కార్డు కారణంగానే నాకు రేషన్ అందలేదు. ఒకవేళ అది తప్పనిసరి కాకపోయుంటే నా బిడ్డ ఈ రోజు బతికుండేది. ఆ కార్డు వల్లే తను చనిపోయింది. ఆ తరువాత ప్రభుత్వం మాకు రూ. యాభై వేలు ఇచ్చింది. వాటిలో ఇప్పుడు కేవలం రూ. 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. తర్వాత మమల్ని ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ రేషను ఆగిపోతే మాకు ఆకలిచావే దిక్కవుతుంది. మాకొచ్చే అరకొర సంపాదనతో పిల్లలకు పోషకాహారం అందించడం కష్టం. ఈ ఆధార్ కార్డుల లాంటివి మాలాంటి వాళ్లకు అర్థం కావు. వాటి ఉపయోగాలేంటో తెలియవు. ఇప్పుడు తెలుసుకున్నా మా కూతురు తిరిగి రాదు కదా..2 అని చెబుతుంది ఆమె.
ఆ ఊర్లో ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డులను పంపిణీ చేశారు. అక్కడ ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా ఏర్పాటుచేశారు. సంతోషి మరణం తర్వాత అక్కడ వచ్చిన మార్పు ఇదొక్కటే.. ఎవరైనా అన్నం దొరక్క ఆకలితో చనిపోతే దానే్నమనాలి? దానికి ప్రభుత్వమే ఓ కొత్త పదం కనుక్కోవాలి. ఎవరైనా ఇలా చనిపోతే దానికి కారణం ఆకలి కాదని అనడం ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించడమే కాకపోతే మరేమిటి?