సబ్ ఫీచర్

దైవత్వం.. మానవత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధార్మికత మానవాళి స్వేచ్ఛతో మిళితమై మానవ వికాసాన్ని పెంపొందిస్తుంది.
ధార్మికత పేరుతో మనిషి కేవలం మనిషిగా ఉంటే సరిపోదు. అతడు అంతకన్నా ఎక్కువగా, చాలా ఎక్కువగా ఎదగాలి. అలా ఎదిగేందుకు చేసే సవాలే ధార్మికత. తన శక్తి ఏమిటో తనకు తెలియని విత్తనం లాంటివాడు మనిషి. తాను విచ్ఛిన్నమై, మహావృక్షమై ఎదిగి, తనలో దాగిఉన్న వేల పుష్పాల పరిమళాలు వెదజల్లుతూ తానేమిటో నిరూపించడమే విత్తనం తెలిపే అంతిమ భావన. అలాంటి పరిమళానే్న నేను ధార్మికత అంటాను. మీరు అభివృద్ధిచెందడమే దానికి కావాలి. అంతేకానీ, మీ దేవుడు, మతాలు, పురోహితులతో దానికి పని లేదు.
విధి - అదృష్టం
విధి లేదు, అదృష్టము లేదు. ఎందుకంటే, వాటికి ఉనికి లేదు. అందుకే మీరు మీ బాధ్యతను లేని వాటిపై నెట్టేసేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే, ‘‘దయచేసి మీ బాధ్యతను మాపై వెయ్యకండి’’ అని ఉనికిలో లేనివి మిమ్మల్ని అడ్డుకోలేవు కదా!
మీరు దేవుడిపైకి ఏది నెట్టినా, ఎన్నినెట్టినా కాదనడు. ఎందుకంటే, వాడు లేడు. లేనివాడు ఎలా కాదనగలడు? అందుకే దేవుడు ఎప్పుడూ ఏదీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటాడు. విధి కూడా అంతే. మీరు ప్రేమలో ఓడిపోతారు. అలాగే అనేక ఇతర విషయాలలో కూడా మీరు ఓడిపోతారు. అది మిమ్మల్ని బాధిస్తుంది. గాయపడ్డ మీ హృదయం బాధ తగ్గేందుకు చక్కని లేపనం లాంటిది ఏదో మీకు కావాలి.
ఆ లేపనమే ‘విధి’. అది మీకు ఉచితంగా లభిస్తుంది. ‘‘నేనేం చెయ్యను? అంతా విధి లీల’’ అని మీరు అనగలరు. జయాపజయాలు, చావు పుట్టుకలు, భోగభాగ్యాలు, ఐశ్వర్య దరిద్రాలు అదృష్ట దురదృష్టాలు, ఆరోగ్య అనారోగ్యాలు- ఇలా అన్నీ విధి చేతిలో ఉండేవే. ‘‘నాకు బోధించిన నైతిక సూత్రాలన్నీ పాటిస్తూ నేను చెయ్యగలిగినంతా చేస్తున్నాను. అయినా ఫలితం దక్కట్లేదు. పైగా ‘‘నైతిక సూత్రాలను ఏ మాత్రం పాటించని అవినీతిపరులందరూ ధనవంతులై, విజయాలు సాధిస్తూ, ఖ్యాతి గడించి ముందుకు దూసుకుపోవడం నేను చూస్తున్నాను. ఏదో అదృష్టంవల్ల వారు విజయాన్ని సాధిస్తున్నారు తప్ప, వారి దగ్గర ఏమీ లేదు’’ అని మీరు అంటారు. అది మీ ఓటమికి ఒక రకమైన ఓదార్పునిస్తుంది.
అలా ఒకపక్క మీరు మీ అసమర్థతను సమర్థించుకుంటూనే, మరొకప్రక్క ‘‘అదృష్టం వరించడంవల్లే అలాంటి వారందరూ విజయాలు సాధించారు తప్ప, వారు నాకంటే గొప్పవారేమీ కాదు’’ అంటూ మీరు మీ అసూయను సంతృప్తిపరుస్తూ ఉంటారు.
దేవుడు, విధి, అదృష్టం- ఇవన్నీ ఒకే వర్గానికి చెందినవి. మీ బాధ్యతను లేని వాటిపై నెట్టేందుకు అవన్నీ ఉపయోగపడతాయి. ‘దేవుడు లేడు’ అని నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. నిజంగా దేవుడు ఉన్నట్లైతే, వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చి ‘‘నేను ఉండగా లేనని చెప్తావెందుకు?’’ అని నన్ను అడిగి ఉండేవాడు. ఆయన లేడు కాబట్టే, ఇంతవరకూ అలా అడిగేందుకు ఆయన నా దగ్గరకు రాలేదు. దేవుడు లేడని చెప్పేవారు ఎప్పుడూ ఉంటారు. అయినా తన ఉనికిని నిరూపించుకునే ప్రయత్నం ఆ దేవుడు ఎప్పుడూ చెయ్యలేదు.
ఒక గొప్ప పాశ్చత్య తత్వవేత్త చర్చికి వెళ్లి అక్కడి పూజారితో ‘‘నిజంగా మీ దేవుడు ఉన్నట్లైతే నా చేతి గడియారం పని చెయ్యకుండా ఆపాలి. అందుకు మీరందరూ ఏం చేసినా, ఎలాంటి ప్రార్థనలు చేసినా నాకు అభ్యంతరం లేదు. అదే నిజమైతే మీ దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను. ఇది కేవలం మీ దేవుడు లేడని నిరూపించేందుకు నేను చేస్తున్న చిన్న సవాలు మాత్రమే’’ అన్నాడు. అది క్రైస్తవ మత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కావడం, ఆ తత్వవేత్త తమ దేవుడితో చేస్తున్న సవాలు అతి చిన్న విషయం కావడంతో పూజారితోపాటు, ఆ చర్చిలో వున్న క్రైస్తవులందరూ ప్రార్థనలు చేశారు. అయినా ఆ గడియారం పనిచేస్తూనే ఉంది. అలా ఆ తత్వవేత్త అతి చిన్న సవాలుతో దేవుడు లేడని నిరూపించాడు.
ప్రపంచ వ్యాప్తంగా అందరూ తాము తప్పించుకోవాలనుకున్న వాటన్నింటినీ దేవుడు, విధి, అదృష్టాలపైకి నెట్టేస్తున్నారు. అవన్నీ కేవలం ఉనికిలో లేని వాటి పేర్లు మాత్రమే. మీరు ఖచ్చితంగా మీ చెత్తను పొరుగింటి పెరట్లో వెయ్యలేరు. ఒకవేళ వేసినా, ఆ ఇంటి యజమాని ఒకటి, రెండు రోజులు సహించినా, ఏదో ఒక రోజు ‘‘‘మీ చెత్తను మా పెరట్లో ఎందుకు వేస్తున్నారు?’’ అని ఆయన మిమ్మల్ని కచ్చితంగా అడుగుతాడు. ఒకవేళ పొరుగింట్లో ఎవరూ లేకపోతే మీరు ఎంతకాలం పక్కింటి పెరట్లో చెత్త వేసినా అడిగేవాడే ఉండడు.
దేవుడు, విధి, అదృష్టాలు ఏ మాత్రం అర్థం లేని నకిలీ పదాలు మాత్రమే. వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. అపుడే మీరు చేస్తున్న పనుల పట్ల మీరు పూర్తి బాధ్యత వహించే వ్యక్తి అవుతారు. అలా మీరు మీ బాధ్యతను స్వీకరించకపోతే, మీరు ఎప్పటికీ స్వేచ్ఛను ఆస్వాదించగల సమర్థులైన వ్యక్తి కాలేరు.
మీకు స్వేచ్ఛ ఉండాలి. కానీ, మీరు బాధ్యతను పూర్తిగా స్వీకరించినపుడే అది మీకు లభిస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే, మీ పట్ల నేను పూర్తి బాధ్యతను స్వీకరించాను. అందుకే మీకు ఏమైనా చెప్పగల స్వేచ్ఛ నాకు ఉంది. మీరందరూ స్వేచ్ఛను ఆస్వాదించగల సమర్థులైన వ్యక్తులే. అందుకు మీకు అనేక అవకాశాలు ఉన్నాయి.
------------------------------------------------------------

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.