సబ్ ఫీచర్

సంస్కార రాహిత్యం మన పరువు తీస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నామట్టుకు నాకు- ‘మన దేశం సంస్కార రహితంగా తయారవుతోందా?’ అన్పిస్తోంది. మన యువ నాయకత్వంలో ఇదే కనిపిస్తుంది. అదే బాధాకరం. ‘భావి ప్రధాని’గా చిత్రించబడే రాహుల్‌జీలో ఇది బాగా కనపడుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మానస సరోవర యాత్రకు- తన మొక్కుబడి తీర్చుకోవటానికి వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఆపదలో దేవుడిపై భారం వేయటం సబబే, కృతజ్ఞతలు తెలుపుకోవటం సమంజసమే. విమాన ప్రమాదం తప్పినందుకు రాహుల్ ఈ యాత్ర చేయాలనుకున్నారు, చేశారు. ఆ యాత్రలోని విశేషాలు ఫొటోలు సహా సామాజిక మాధ్యమాలలో వచ్చాయి. రాహుల్‌జీ మానస సరోవర్ యాత్ర గురించి ‘ట్విట్టర్’లో గొప్పగా వర్ణించారు.
రాహుల్ పట్ల దేశంలో ఎవరికీ వ్యతిరేక భావం లేదు. పైగా అంతో ఇంతో ప్రేమాభిమానాలున్నాయి. కాని అప్పుడప్పుడూ రాహుల్ చేసే వ్యాఖ్యలు, దేశకాలాలు పట్టించుకోకుండా, ఉచితానుచితాలు చూడకుండా చేసే ప్రకటనలు వింతగా ఉంటాయి, వివాదాలకు దారితీస్తాయి. విదేశాలలో ఉన్నప్పుడు సామాన్య పౌరులు కూడా తమ దేశ ప్రతిష్ఠకు భంగం కలగకుండా వ్యవహరిస్తారు. అవతల వ్యతిరేకభావమున్నా సరిదిద్దటానికి ప్రయత్నిస్తారు. ఆ క్షణంలో దేశానికి నైతిక రాయబారులవుతారు. కొందరు మేధావులుగా మన్ననలు పొందేవారు, విదేశాలలో మన దేశం గురించి తక్కువచేసి మాట్లాడినా, వ్యతిరేక భావాలు వ్యక్తం చేసినా, ఇక్కడెవ్వరూ ఆమోదించరు. రాహుల్ సామాన్య వ్యక్తికాదు. దేశంలోనే పురాతనమైన ఒక పెద్ద జాతీయ పార్టీకి అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత. ఈయన చెప్పే మాటలన్నిటికీ ప్రాముఖ్యత ఉంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ క్షుణ్ణంగా విశే్లషిస్తారు. ఆ విశే్లషణలు దేశ ప్రతిష్ఠతో ముడివడి ఉంటాయి.
ఆగస్టులో లండన్ పర్యటనలో- ‘ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్’ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. అక్కడ ఆయన ఆర్‌ఎస్‌ఎస్ గురించి విపరీత వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అరబ్ దేశాలలోని ‘రాడికల్ ఇస్లామిస్ట్ ముస్లిం బ్రదర్‌హుడ్’తో పోల్చారు. ముస్లిం బ్రదర్‌హుడ్ ఉగ్రవాద సంస్థగా పేరుపొందింది. బహ్రెయిన్, ఈజిప్టు, రష్యా, సిరియా, సౌదీ, యూఏఈలు ఉగ్రవాద సంస్థగా దీనిని ప్రకటించాయి.
ఆదినుంచీ సమాజసేవకు అంకితమైన ఆర్‌ఎస్‌ఎస్‌లో టెర్రరిజం ఎక్కడుంది? ఈ సంస్థ కార్యకలాపాలపై రాహుల్ వ్యాఖ్యానిస్తూ, భారతదేశ స్వభావాన్ని మార్చివేయటానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తుందోన్నారు. ‘అన్ని భా రతీయ సంస్థలనూ వశపరుచుకోవటానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోంది.. ప్రతి జీవనరంగం, కార్యకలాపం, ఒకే భావజాలంతో నిర్వహింపబడాలని విశ్వసిస్తోంది.. న రేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావితమని చెబుతూ, మూకదాడుల మరణాలకు ఆయన విచి త్రమైన వివరణ ఇచ్చారు. జర్మనీలో ఇచ్చిన ఉపన్యాసంలో వాటికి ఆర్థిక కారణాలు పేర్కొన్నారు.
నమ్మశక్యం కాని మరోమాట- రాహుల్ నోటి నుండి లండన్ ఉపన్యాసంలో వెలువడింది. 1984లో జరిగిన మూకదాడులలో 3,000 మంది సిక్కులు చనిపోవటంలో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదన్నారు. ఆ హింసలో పాల్గొన్నవారికి శిక్షపడాల్సిందే అని ఆయన చెప్పినా, హింస బాధితుడైన తాను, హింస ఎంత క్షోభ కలిగిస్తుందో అర్థం చేసుకోగలనని చెప్పినా, 2005లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తమ అందరి తరఫునా క్షమాపణ కోరారని అన్నా, కాంగ్రెస్ పా ర్టీకి అల్లర్లతో సంబంధం లేదని చెప్పడాన్ని ఎవ్వ రూ అంగీకరించలేకపోయారు. ‘ఇందిరా గాంధీ మరణవార్త తెలియగానే- కాంగ్రెస్ నాయకులు స్థానిక మూకలను కదిలించి- సిక్కుల మీద, వారి ఆస్తుల మీద దాడి చేసేలా ఉసికొల్పారన్నది సర్వవిదితం. ఈ హింసాకాండ ఢిల్లీలో ఎక్కువగా జరిగింది. ఈ అల్లర్లను పరిశీలించి నివేదికను సమర్పించిన జస్టిస్ నానావతి కమిషన్ చాలా విషయాలను స్పష్టం చేసింది. పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రముఖంగా పేర్కొంది. ఎన్నో కేసులు నమోదు కాలేదు. నమోదైన కేసుల్లో కొన్నింటి జాడలేదు. మరి కొన్ని కేసుల్లో నేరస్థులు విడుదలయ్యారు. ‘పెద్దసంఖ్యలో అఫిడవిట్లు- స్థానికంగా కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టారు లేదా సిక్కులపై దాడి చెయ్యటానికి సాయపడ్డారు అని తెలియచేస్తాయి’ అని కమిషన్ రిపోర్టు చెబుతోంది.
ఎన్నో సందర్భాల్లో తాను ప్రధానమంత్రిని అవుతాననే నమ్మకాన్ని వెలిబుచ్చిన రాహుల్ లండన్‌లోనే- ప్రధాని కావాలన్న కలలు తనకు లేవని చెప్పారు. ‘నేను భావజాల పోరాటం చేస్తున్నాననిపిస్తుంది. ఈ మార్పు 2014 తర్వాత వచ్చింది. నేను ఉదయం లేచి భారతదేశంలో సంస్థల నిర్మాణాలను ఎలా రక్షించాలా? అని ఆలోచిస్తాను..’ అని ఆయన చెప్పుకొచ్చారు. మంచి ఆలోచనే కదా! రాజకీయాల జోలికి వెళ్లని రచయితలలో కూడా- రాహుల్‌జీ ఉపన్యాసాలు ప్రతిస్పందన కలిగిస్తున్నాయి.
ఝూఠా పార్టీ వెర్సస్ రజాకార్ల సమితి!
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర మంత్రి తారక రామారావు- సాంకేతిక రంగంలో ప్రవీణుడుగా పేరు గడిస్తూ అనేక సంస్థలను హైదరాబాద్‌కు రప్పించాడు. ఆంధ్రాలో చంద్రబాబు కుమారుడు లోకేష్- కేటీఆర్‌కు దీటుగా ఐటీ రంగంలో విశేష కృషిచేస్తూ, అనేకానేక సంస్థలను ఏపీకి రప్పించేందుకు కృషి చేస్తున్నాడు. కాని.. సంస్కారం విషయంలో కేటీఆర్ భాజపాకు షాక్ ఇచ్చిన నాయకుడయ్యాడు. ఇటీవల సనత్‌నగర్ నియోజకవర్గం తెరాస కార్యకర్తల విస్తృత సమావేశం జలవిహార్‌లో మంత్రి తలసాని అధ్యక్షతన సమావేశం జరిగింది. అందులో కేటీఆర్ మాట్లాడుతూ, మోదీకి భయపడేది లేదనీ, బిజెపి అంటే- భారతీయ ఝూటా పార్టీ అని అభివర్ణించాడు. దానికి దీటైన సమాధానాన్ని బిజెపి ఎంఎల్‌ఏ కిషన్‌రెడ్డి ఇచ్చాడు. టీఆర్‌ఎస్‌ను ‘తెలంగాణ రజాకార్ల సమితి’ అని విమర్శించాడు. సరిపోయింది గదా! అదే బాధ.. యువ నాయకుల్లో సంస్కారమనేది లోపిస్తున్నదా? అనిపిస్తుంది. ఏ కుటుంబ పెద్ద అయినా- తన వారసులకు చదువుసంధ్యలు, ఆస్తిపాస్తులు, ఉద్యోగ సౌకర్యాలు కలిపించవచ్చు. కాని నేటి కాలంలో- అన్నిటికీ మించి సంస్కారాన్ని ఇవ్వగలగాలి.

-చాణక్య