సబ్ ఫీచర్

జాకెట్టు... కనికట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరకు, ఆ చీర కట్టు కున్న అతివ అందాన్ని దిగ్వీణీకృతం చేసే జాకెట్లు మార్కెట్‌లో రమ్యంగా అలంకరిస్తున్నారు. మగ్గంవర్క్, చేతికుట్టు, కంప్యూటర్ వర్క్, అద్దాలు, ముత్యాలు, పూసలు, బిళ్ళలతో అలంకరించిన జాకెట్లు మగువల మనసులు దోస్తున్నాయ. వర్క్ లేని జాకెట్టు ఈ రోజుల్లో ఎవరూ ఇష్టపడటంలేదు. చీరకి ధీటుగా అందమైన జాకెట్టులు కుట్టించుకుంటున్నారు. వీటికి నప్పే అందమైన లంగా ఓణీ చీరలు సైతం వచ్చాయి. అందమైన డిజైన్‌లతో బట్టలకొట్లల్లో జాకెట్లు దర్శనమిస్తున్నాయి. కుట్టిన జాకెట్లు 250 నుంచి 15 వేల వరకూ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఖరీదైన రాళ్ళ జరీలతో కుడుతున్నారు. జాకెట్‌ను బట్టే మహిళ అందం ద్విగుణీకృతమవుతుంది. ప్రతి టైలర్ దగ్గర రకరకాల అంచులు వేసి కుట్టేవారు విడిగా వుంటారు. ఇప్పుడు ప్రత్యేకమైన గమ్ వచ్చింది. దానితో రాళ్ళు అందంగా అతికించవచ్చును. ఇది చాలా తేలిక పద్ధతిలో డిజైన్‌లు రూపొందించవచ్చును.
పేచ్‌వర్క్
రకరకాల పువ్వులు, బొమ్మలతో కుట్టిన జాకెట్లు మార్కెట్‌లో అమ్మకానికి ఉన్నాయి. ఎంబ్రాయిడరీ రాని వాళ్ళు కూడా ఈ తరహా వర్క్ పేచ్‌లు కొని చీరను అందంగా అమర్చి, కుట్టి అలంకరించవచ్చును. ముఖ్యంగా ఈ వర్క్ రాజస్థానీ ప్రింట్ చీరలకు, బుటా చీరకు కూడా చెయ్యవచ్చును.
ఈ తరంలో ప్లెయిన్ చీరలకంటే కూడా చక్కని జరీ బార్డర్ చీరలకి, పట్టుచీరలకి సన్నని, చిన్న ప్రింట్ చీరల పట్ల మక్కువ చూపుతున్నారు. వీటిపై రకరకాల కుట్టు పువ్వులు కుట్టుకోవచ్చును. వర్క్ చీరలంటూ ప్రత్యేకంగా కొంటే ధర ఎక్కువ. అలా కాకుండా చక్కగా ఈ పేచ్‌లు తెచ్చి గతంలో కట్టిన చీరలపై వర్క్ చేసి క్రొత్త చీరలుగా మార్చుకోవచ్చు. కుట్టు వస్తే చాలు ఎన్నో రకాల వర్క్‌లతో చీరలని అందంగా అలంకరించవచ్చు. వేసవిలో ఇలాంటి వర్క్ నేర్పించేందుకు ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా అమ్మాయిలకి నిర్వహించే కుట్టు సెంటర్స్ వున్నాయి. అలాగే కాటన్ చీరలకి , చుడీదార్‌లకు అందంగా ఫ్యాబ్రిక్ పెయింట్ చేసుకోవడమో, ఈ తరహా ప్యాచ్‌వర్క్ చేసుకోవడమో అలవాటుచేసుకొన్నారు. నేడు వర్క్‌లేని డ్రెస్సులు లేవు. ఇంట్లో వాడే బట్టలకి కూడా అందమైన ప్యాచ్‌వర్క్‌లతో డిజైన్‌లు రూపొందిస్తున్నారు.
మార్కెట్టులో కలంకారీ, హంసలు, నెమళ్ళు, పల్లకి డిజైనులు, ఏనుగు అంబారీ వర్క్, మహారాణి బొమ్మలు, రాధాకృష్ణులు, దాండియా బొమ్మలు, ఏనుగులు, గుఱ్ఱాలు వంటివి అమ్ముతారు. దీనిలో రాళ్ళు, జరీ కుట్టినవి, గ్లిట్టర్ పెయింటింగ్ చేసినవి రకరకాలు మార్కెట్‌లో ఉన్నాయి. అవి తెచ్చి గమ్‌తో అతికించవచ్చు. రకరకాల అందమైన కళాత్మకమైన దుస్తుల్ని ఈ వేసవిలో తయారుచేసుకుని మరింత అందాన్ని ద్విగుణీకృతమయ్యేలా ప్రయత్నించండి.

- ఎన్.వాణిప్రభాకరి