సబ్ ఫీచర్

రాఫెల్ నిజాలు మనకు తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఇపుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ ఒప్పందంపై పూర్తి సమాచారం, అవగాహన లేకుండా మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టించే ఈ కుటిల ప్రయత్నానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు. రెండు దేశాల మధ్య జరిగిన రక్షణ ఒప్పందాల గురించి మాట్లాడమంటే పార్లమెంటులో తన స్నేహితులకు కన్నుకొట్టడమంత సులభం అని కాంగ్రెస్ యువనేత భావిస్తున్నాడు.
అసలు వివాదమే కానిదాన్ని వివాదంగా మార్చి, ‘కుంభకోణం జరిగింది, మోదీ అవినీతికి పాల్పడ్డాడు’- అని ఓ వర్గం మీడియాలో రోజూ చెపుతుంటే ప్రజలు నమ్మేస్తారని కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ‘ఒక అపద్ధాన్ని వెయ్యిసార్లు చెపితే- అది నిజవౌతుంది’- అన్నాడట నాజీ నియంత హిట్లర్. సోనియా గాంధీ తండ్రికి ఆ నాజీలతో ‘దగ్గరి సంబంధాలుం’డేవి. ఆ వారత్వమే రాహుల్‌జీకి కూడా వచ్చింది.
రాఫెల్‌పై నిజాలు ప్రజలకు తెలియడం లేదు. ఇది కాంగ్రెస్‌కు కలిసొస్తున్న అంశం. ‘రఫాల్’ అనే ఫ్రాన్స్ దేశపు యుద్ధ విమానాన్ని భారత్‌లో చాలామంది ‘రాఫెల్’ అని పిలుస్తున్నారు. ఫ్రెంచి భాషలో ‘రఫాల్’ అంటే ‘ఉధృతంగా వీచే గాలి’ అని అర్థం. 2001లో మన దగ్గరున్న యుద్ధవిమానాలు రక్షణ అవసరాలకు సరిపడవని భావించి, మన వాయుసేన అధునాతనమైన 126 యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలని భావించి, Medium Multiride combat Aircraft (MMRCA) అనే పేరుతో టెండర్లను ఆహ్వానించింది. ఆ సమయంలో ఫ్రాన్సుకు చెందిన ‘ద సాల్ట్’ కంపెనీ, తాను తయారు చేస్తుండిన మిరేజ్-2000 యుద్ధవిమానాలకు స్పందన లేకపోవడంతో, వాటి ఉత్పత్తిని ఆపేయాలనుకొంది. భారత్ కోరుతున్న యుద్ధవిమానాలను తాము తయారుచేస్తామని ‘ద సాల్ట్’ ముందుకొచ్చినా, అప్పుడు అధికారంలో వున్న వాజ్‌పేయి నాయకత్వంలోని ప్రభుత్వం పారదర్శకతను పాటించి, విమానాల తయారీలో మంచి అనుభవమున్న ఆరు సంస్థలకు ఆహ్వానాలు పంపింది. నాణ్యతలో రాజీపడకుండా, తక్కువ ధరకే విమానాలు తయారుచేసే వారికి కాంట్రాక్టు ఇస్తామని చెప్పింది. 1) సాబ్ 2) ఈడ్స్ 3) ద సాల్ట్ 4) బోయింగ్ 5) మికోయాన్ 6) లాక్‌హీడ్ మార్టిన్ అనేవి ఆ ఆరు సంస్థలు. వాటిని ఎన్డీఏ ప్రభుత్వం గుడ్డిగా ఎంపిక చేయలేదు. సాంకేతికంగా 660 పరీక్షలు పెట్టి అందులో నెగ్గిన ఆ ఆరింటిని ఆహ్వానించింది.
లేహ్ లాంటి అతి శీతల ప్రదేశాలు, జై సల్మేర్ లాంటి అత్యంత వేడి ప్రదేశాలు, గాలిలో తేమ ఉండే బెంగళూరు లాంటి ప్రదేశాల్లో కూడా విమానాలు చక్కగా పనిచేయాలని, అలాంటి యుద్ధ విమానాల్ని కొంటామని ఆ సంస్థలకు ప్రభుత్వం తెగేసి చెప్పింది. అన్ని పరీక్షల్లోనూ చివరికి ‘ఈడ్స్’, ‘ద సాల్ట్’మాత్రమే మిగిలాయి. 2004లో ఎన్డీఏ కూటమి ఓటమి చెందడంతో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2011లో మళ్ళీ రాఫెల్ ఒప్పందం తెరపైకి వచ్చింది. బరిలో మిగిలిన ఈడ్స్ మరియు ద సాల్ట్ సంస్థలతో జరిపిన సంప్రదింపుల్లో ఈడ్స్‌కంటే 40 లక్షల డాలర్ల తక్కువ మొత్తానికే యుద్ధవిమానాలు తయారు చేస్తానని చెప్పిన ‘ద సాల్ట్’ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకొంది. అంటే- ద సాల్ట్ సంస్థతో రాఫెల్ ఒప్పందం కుదుర్చుకొన్నది యుపిఏ ప్రభుత్వమే కానీ ఎన్డీఏ సర్కారు కాదన్న మాట.
ఒప్పందం మేరకు తొలిదశలో ఫ్రాన్స్‌లోనే 18 విమానాలను తయారుచేసి భారత్‌కు పంపాలి. మిగిలిన 108 రాఫెల్ విమానాలను ద సాల్ట్ సంస్థ భారత్‌లో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో కలిసి తయారుచేయాలి. 108 విమానాలు తయారు చేయడానికి మూడు కోట్ల పని గంటలు అవసరమని ద సాల్ట్ అంటే, అందకు 2.7 రెట్లు ఎక్కువ పనిగంటలు కావాలని హెచ్‌ఎఎల్ చెప్పింది. ఈ దశలోనే హెచ్‌ఎఎల్‌కు అంత సామర్ధ్యం లేదంటూ అమెరికా ఒక బాంబు పేల్చింది. దాంతో ద సాల్ట్ పునరాలోచనలో పడింది. హెచ్‌ఎఎల్ భాగస్వామ్యంతో తాను తయారుచేసే రాఫెల్ విమానాలు నాణ్యత లేనివని తనకు చెడ్డపేరొస్తే తన వ్యాపారం దెబ్బతింటుందని ద సాల్ట్ హెచ్‌ఎఎల్‌ను తిరస్కరించింది. ఇలా అనడం రాఫెల్ ఒప్పందాన్ని అతిక్రమించడమే అవుతుందని వాయుసేన అధికారులు ఫిర్యాదు చేశారు.
మరికొన్ని రోజులకు, హెచ్‌ఎఎల్‌తో కలిసి భారత్‌లో రాఫెల్ విమానాలు తయారుచేయడానికి ఇంత ఖర్చు అవుతుందని, ద సాల్ట్ కొత్త లెక్కలు ముందుపెట్టింది. ఇపుడు ఆ ఖర్చు, ఈడ్స్ సంస్థ చెప్పిన దానికంటే ఎక్కువగా వుంది. ముందువెనుక ఆలోచించక రాఫెల్‌ను ఎంపిక చేశారని మన వాయుసేన అసహనం ప్రకటించింది. ‘ద సాల్ట్’తో ఒప్పందం చేసుకొన్నది సోనియా, రాహుల్ కనుసన్నల్లో- మన్మోహన్ సింగ్ ప్రధానిగా వుండిన యుపిఏ ప్రభుత్వమే. ఇందులో మోదీ ఎక్కడున్నాడు? ఆ సమయంలో ఆయన గుజరాత్ సీఎంగా వున్నాడు. ప్రజలకు నిజం చెప్పకుండా దాచిపెట్టి, దేశాన్ని మోసం చేసింది యుపీఎ ప్రభుత్వమే!
రాహుల్ తప్పుడు లెక్కలు...
రాఫెల్ విమానాలకయ్యే ఖర్చు విషయమై రాహుల్ పూటకొక్క మాట చెపుతుంటారు. నిజమైన మేధావులు, విశే్లషకులు ఆయన మాటల్ని గంభీరంగా తీసుకోరు. కానీ వాస్తవాలు తెలియని సామాన్య ప్రజలు మోసపోయే ప్రమాదముంది. ‘మేము 126 రాఫెల్ విమానాలను 12 మిలియన్ డాలర్లకే కొంటామని చెపితే, మోదీ కేవలం 36 విమానాలకే 8 బిలియన్ డాలర్లు చెల్లిస్తానని ఒప్పుకొన్నాడు’అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళితే అసలు వాస్తవాలు బయటపడతాయి. 2007లో 12 బిలియన్ డాలర్లు చాలని చెప్పిన ద సాల్ట్, 2012లో దాన్ని 15 బిలియన్ డాలర్లకు, ఆ తరువాత 18 బిలియన్‌కు, 2014 జనవరిలో 20 బిలియన్ డాలర్లకు పెంచుకుంటూ వచ్చింది. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్, ఆ పార్టీకి అండగా నిలిచిన మీడియా సంస్థలు మనకు చెప్పవు. ఇలా ధరలు పెంచుకుంటూ వస్తున్నా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ద సాల్ట్ కంపెనీనే ఎందుకు అంటిపెట్టుకొని వుంది? ఎందుకంటే ఆరోజు ద సాల్ట్‌తో భాగస్వామ్యం పంచుకునేందుకు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు సన్నిహితుడైన సందీప్ భండారి ప్రయత్నిస్తున్నాడు. కానీ భండారి గత చరిత్రను తెలుసుకున్న ద సాల్ట్, ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. రాబర్ట్ వాద్రాకు మేలు కలిగేలాగా ద సాల్ట్ స్పందించలేదు కాబట్టి, రాఫెల్ ఒప్పందాన్ని కాంగ్రెస్ అటకెక్కించింది. అప్పటి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ- ‘రాఫెల్ విమానాలను కొనేందుకు మా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు’ అనేసారు. అంటే ఆ రకమైన ఆదేశాలు సోనియా, రాహుల్ నుండి వచ్చి వుంటాయి. ద సాల్ట్ కంపెనీ రాబర్ట్ వాద్రాకు అనుకూలం చేసి వుంటే- డబ్బులు వుండేవా?
2014 మేలో మోదీ ప్రధాని అయ్యారు. 2015 ఏప్రిల్ వరకూ రాఫెల్ ఒప్పందం అటకమీదే వుంది. దీంతో మోదీ జోక్యం చేసుకొని, ఫ్రాన్సు ప్రభుత్వంతో చర్చలు జరిపి, వంద శాతం ఫ్రాన్సులోనే తయారైన 36 రాఫెల్ యుద్ధవిమానాలను భారత్‌కు పంపేలాగా ఒప్పించారు. భాగస్వామిగా ఎవరినైనా తీసుకునే వెసులుబాటును ద సాల్ట్ సంస్థకు కల్పించారు. అపుడు ద సాల్ట్ మన దేశంలో రిలయన్స్‌ను మాత్రమేకాదు, టాటా, మహీంద్ర, ఎల్ అండ్ టి లాంటి 70 సంస్థలను భాగస్వాములుగా చేసుకోవడానికి ఎంపిక చేసుకుంది. రిలయన్స్‌ను అయినా, మరే సంస్థనైనా ద సాల్ట్ తీసుకునేది రాఫెల్ బిజినెస్ జెట్‌లను తయారుచేయడానికే కానీ యుద్ధ విమానాలను నిర్మించేందుకు కాదు. రాఫెల్ యుద్ధ విమానాలు పూర్తిగా ఫ్రాన్స్‌లోనే తయారవుతాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ కావాలని చెప్పడం లేదు. ఇది పచ్చి మోసం. ఇటీవల ఓ టీవీ చానల్‌లో ఒక పెద్దాయన రాఫెల్ విమానాల తయారీ ఖర్చు అంతగా ఎందుకు పెరిగిందని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అవినీతి జరిగిందని అన్నాడు. కాంగ్రెస్-యుపిఏలు అంగీకరించిన రాఫెల్ విమానాల కంటే, మోదీ ప్రభుత్వం అంగీకరించి తయారుచేయిస్తున్న విమానాలు ఎంతో ఎక్కువ అధునాతనమైనవి, శక్తివంతమైనవి. ఎక్కువ ఫీచర్లు ఉన్నవి. ఖరీదైన మొబైల్ ఫోన్ ఎక్కువ ఫీచర్లు కలిగి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇదీ రాఫెల్‌కూ వర్తిస్తుంది.
మోదీ ప్రభుత్వం ఫ్రాన్సుతో ఒప్పందం కుదుర్చుకొన్న సమయంలోనే ఈజిప్టు 5.2 బిలియన్ డాలర్లు చెల్లించి 24 రాఫెళ్ళను, ఖతార్ 6.3 బిలియన్ డాలర్లు చెల్లించి 24 రాఫెళ్ళనూ కొన్నాయి. రెండు దేశాలూ కొన్నది 24 విమానాలే అయినా ఖతార్ ఎందుకు 1.1 బిలియన్ డాలర్లు ఎక్కువగా చెల్లించింది? అవి ఈజిప్టు కొన్న వాటికంటే శక్తివంతమైనవి భారత్ ఇప్పటిదాకా 7.8 బిలియన్ డాలర్లు చెల్లించి 36 రాఫెళ్ళను కొన్నది. ఈజిప్టు, ఖతార్ చెల్లించిన డబ్బు ఆధారంగా విశే్లషిస్తే మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాకచక్యంగానే హ్యాండిల్ చేసిందని చెప్పాలి. తక్కువ ధరకే అత్యంత అధునాతన, శక్తివంతమైన రాఫెల్ యుద్ధవిమానాలు కొన్నందుకు మోదీని మనం అభినందించాలి. అసత్యాలు చెపుతున్న వాళ్ళ నోళ్ళు మూయించాలంటే, ఈ రాఫెల్ నిజాలను జాతీయవాదులు, దేశభక్తులు ప్రజలకు చెప్పాలి. ఈ పనిని భాజపా ఎందుకు చేయడం లేదు?

-పి.సతీష్ 08554-242691