సబ్ ఫీచర్

యశస్సునిచ్చే యల్లారమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్టాదశ శక్తిపీఠంలో ఏకవీరాదేవి ఒకరు. శ్రీనాథ మహాకవి కృతక్రీడాభిరామంలో ఏకవీరాదేవిని గురించి వర్ణిస్తూ, కాకతమ్మకు సైదోడుగా మండపాక మున్నగు గ్రామాల్లో నివసించేదని వర్ణించారు. పూర్వం పరిమి వెంకప్ప పసుపుతోటలో ఒక నౌకరు నాగలి దున్నుతుండగా నాగలి సాలు భూమిలో దిగబడి కదలలేదు. అతడు బలవంతంగా తోలగా, ఎడ్ల గిట్టలనుండి రక్తం కారసాగింది. అది చూసి నౌకరు రక్తం కక్కి మరణించాడట. వెంటనే వెంకప్ప జాగ్రత్తగా మన్ను తొలగించి చూడగా, శ్రీ అమ్మవారి పాదాలు, విగ్రహం శిరస్సు బయటపడ్డాయి. అంతట నూజివీటి జమీందారులు ఆలయాన్ని కట్టించారు. అప్పటినుండి పరిమివారి ఆడపడుచుగా ఇక్కడి అమ్మవారు వెలుగొందుతున్నారు.
‘కాకతమ్మ సైదోడు ఏకవీర’ అను క్రీడాభిరామ వచనానికి ఈ దేవీ ఆలయంలో శ్రీ యల్లారమ్మ వారి సంపూర్ణ విగ్రహమే కాక వేరుగా ఒక శిరస్సు పాదాలు కూడా వున్నాయి. శిరస్సు ఏకవీరాదేవి అని, సంపూర్ణ విగ్రహం కాకతమ్మ అని పరిశోధకుల అభిప్రాయం. ఎంతో సుందరంగా సాలగ్రామ శిలతో చేయబడ్డ శ్రీ యల్లారమ్మ అమ్మవారికి ముందరి కుడిచేతిలో ఖడ్గం, వెనుక కుడి చేతిలో ఢమరుకం, ముందరి ఎడమ చేతిలో పాయస పాత్ర, వెనుక ఎడమ చేతిలో త్రిశూలం ఉన్నాయి.
బహు ప్రాచీనమైన శ్రీ యల్లారమ్మవారి దేవాలయం నూజివీటి ప్రభువులు ధర్మా అప్పారాయులుగారి కాలంలో పునరుద్ధరింపబడిన నాటినుండి వారి వంశీకుల గోత్రనామాలతో వెలనాటి బ్రాహ్మణులచే, వేదోక్తంగా త్రికాలాలో అర్చనాదులు జరుపబడుతున్నాయి. ఈ ఆలయ ప్రాకారం వెలుపల ఒక శిథిలమైన నంది, పోతురాజు అనబడే కాలభైరవుని విగ్రహం, కోమటి అనబడే ప్రాచీన శాసనం గల విగ్రహం కలవు.శరన్నవరాత్రులలో అమ్మవారికి సహస్రనామ కుంకుమపూజలు జరుపుతారు.

-డి.ఎస్.మూర్తి