సబ్ ఫీచర్

విదే శాల్లో తెలుగు తోటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న కవిగారిని నేను నిత్యం స్మరిస్తూ ఉంటాను. నిజమే! మనం సముద్రాలు దాటి వచ్చి దూర తీరాల్లో నివసించినా మాతృభూమిని, మాతృదేశాన్ని వదలలేకపోతాం. ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడెక్కడో నివసించినా మన సనాతన సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, మన ధర్మాలను మనం ఆచరిస్తూనే ఉంటాం.నేను ఆచరించడమే కాక మా ఇంట్లో సభ్యులందరి చేత ఆచరింపచేస్తాను. అంతేకాక నేను నివసించే న్యూజెర్సి లో తెలుగువారి అందరిచేత ఆచరింపచేస్తాను. ఇక్కడ తెలుగువారు మన భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో నివసించినా ఇక్కడ మాత్రం భారతీయులంతా ఒక్కకుటుంబం లాగా మేము ఉంటాం. అందుకే మా అందరిని చూసి ఇక్కడి అమెరికన్స్ మన ఆచార వ్యవహారాలను మెచ్చుకుంటూ ఆశ్చర్యబోతూ వారు కూడా అనుకరించడానికి ముందుకు వస్తారు.
నేను మన కూరగాయలు, పండ్లు ఆకుకూరలు విలువ వీరికి తెలియచెప్పాల్లో వాటిల్లో ఉండే పోషకాలు, వాటిని వండే విధానం వీరికి నేర్పించాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడ పెరటితోటను పెంచుకుంటున్నాను.
నాతోపాటు మావారు, మా అమ్మాయిలిద్దరూ కూడా నా తోటను పెంచడానికి అనేక విధాలుగా సహాయం చేస్తుంటారు.
పెరటి తోట అనే కానీ ఇందులో నేను భారతదేశంలోని అన్ని రకాల పూల మొక్కలను, పండ్ల, కాయగూరల చెట్లను పెంచుతుంటాను. ఇక ఆకుకూరలైతే మేము ఇక్కడ ఉండే తెలుగువారందరూ మా తోట నుంచి తీసుకొని వెళ్లి ఆకుకూరలు వండుకుంటూ ఉంటారు.
నేను పెంచే చెట్లల్లో కాకర, వంగ, బీర, సొర, గుమ్మడి, బెండ,దొండ, పొట్ల, చిక్కుడు, బఠాని, వేరుశనగ, ఉల్లి, అల్లం, చేమ, ఆలు, ఇలా అన్ని రకాల చెట్లను నాటాను. అవి మంచి కాపునిస్తున్నాయి.
ఇక ఆకుకూరలైతే పాలక్, చుక్క, తోట, గంగాబాయిలాకు ఇలా అన్నింటినీ పెంచుతాను. కొత్తిమీర, గోంగూర, పుదీనా ఇలాంటి వాటి రుచిని ఈ అమెరికన్స్ కూడా చూసారు. దానితో వారు కూడా వచ్చి గోంగూర పచ్చడి కోసం, కూర, పప్పు వండుకోవడానికి తీసుకొని వెళ్తుంటారు. వారికిచ్చి ఆహా ఏమి రుచి అని వారు పొగడుతూ చెప్పినప్పుడు నాకు కలిగే ఆనందం ఇంత అని చెప్పడానికి వీలులేదు.
అంతేకాదండోయ్ నేను అన్ని రకాల పూల మొక్కలను అందంగా పెంచుకుంటూ ఉంటాను. ఆ పూల వివరాలను నాతోటివారికి చెబుతాను. అటు పూజకు ఇటు ఇంట్లో అలంకరణకు కూడా పూలను వాడుతుంటాను. ఎవరైనా మా ఇంటికి వచ్చినపుడో లేక మేము వారింటికి వెళ్లినప్పుడో ఈ పూలను వారికి బహూకరిస్తుంటాను. వారు కోరుకున్న మొక్కలను కూడా నేను వారికి అందచేసి వాటిని ఎలా పెంచుకోవాలో వారికి వివరిస్తాను. వారు కూడా ఆయా మొక్కలను ఇష్టపడి మరీ పెంచుకుంటారు.
అంతేకాక మనం వంటింట్లో ఉపయోగించే ఎన్నో పదార్థాలు ఔషధగుణాలను కలిగి ఉంటాయ. వాటిని మన పెద్దలు వంటల్లో వాడమని చె ప్పారు. మనం ఇపుడు అన్నీ ఫాస్ట్ పుడ్ జింక్ ఫుడ్ తిని అనారోగ్యాలను కొని తెచ్చుకుం టున్నాం. కానీ మన సంప్రదాయ వంటకాలు మనకు రుచికి రుచిని ఆరోగ్యాన్నిచ్చేవిగా ఉన్నాయ. అందుకే నేను కొన్ని ఔషధమొక్కలను పెంచుతుంటాను.
ఇక పూల సంగతి చెప్పనక్కర్లేదు కదా. మనం పెంచుకున్న మొక్కలు పూలు పూస్తే వాటిని చూసినపుడు వచ్చే ఆనందం, మనం పెంచుకున్న పండ్లమొక్కలు కాయలు కాచి పండుగా మారుతుంటే చూసినప్పటి ఆనందం మాటల్లో వర్ణించలేము. దాన్ని అనుభవిస్తే కానీ తెలియదు.
అంతేకాదండీ. నేను ఈ మధ్య రావి, మఱ్ఱి చెట్లకు ఆరా ఉంటుందనే వ్యాసాలు చదివాను. అట్లాంటి చెట్లు ఎక్కువ ప్రాణశక్తిని మనకు ఇస్తాయని చదివాను. అందుకనే మనవారు రాగి చెట్టుకు ప్రదక్షిణాలు చేయమని చెప్పేవారు. రాగి, వేప, మర్రి ఇలాంటి చెట్లు మనలోని ప్రాణశక్తికి శక్తినివ్వడంలోను, మనలోని ఆరోగ్యలోపాలను సరిచేయడానికి ఉపయోగపడతాయని సైన్సు జనరల్స్ చెబుతున్నాయి. నేను వీటిని చదివి ఆ చెట్లను కూడా కుండీల్లోను, నేలలోను పెంచుతున్నాను.
నాకెందుకు ఇంత కోరిక కలిగిందంటే జంగం శ్రీనివాసులు గారు హైద్రాబాదులో మా ఇంటి దగ్గరే ఉంటారు. వారే నన్ను ఇక్కడ చెట్లు పెంచడానికి ప్రోత్సాహమిచ్చారు. వారి సలహాలను పాటిస్తూ ఇక్కడి వారికి భారతీయతను వారి వంటకాలను నేను రుచి చూపిస్తూ ఉంటాను.
అంతేకాదు మన దేవీదేవతల గురించి, పురాణాలు, వేదాలు, రామాయణ మహాభారతాదుల గురించి మన భగవద్గీత గురించి కూడా నాకు తెలిసింది నలుగురం కలసిన చోట వారికి వినిపిస్తుంటాను. నాలాగే మరికొందరు వారికి తెలిసింది చెబుతుంటారు. అలాంటపుడే ఈ మొక్కల పెంపకం గురించి ఏయే ఎరువులు వేయాలో కంపోస్టు ఎరువు ఎలా తయారు చేసుకోవాలో దాన్ని మొక్కలకు ఎలా వేస్తే మంచి పంట వస్తుందో చెబుతుంటాను. ఇంతకీ నా ఫేరు మీకు చెప్పలేదు కదా. నా పేరు శ్రీమతి రజని, భర్తపేరు వి. పద్మనాభం నాకిద్దరు అమ్మాయలు.. లహరి, లాస్య. మేము న్యూజెర్సీలో చక్కని తోటను పెంచి మన తెలుగు వంటకాలను అక్కడికి వారికి రుచి చూపిస్తున్నాము.