సబ్ ఫీచర్

ఫస్ట్ బాలే... సిక్స్ కొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్- త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో లేటెస్టుగా విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్ల దిశగా యునానిమస్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో కథ, మాటలు ఎంత కీలకమో, తమన్ అందించిన సంగీతం కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సినిమాకు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించావని అంటున్నారని చెప్పాడు తమన్. సంగీత దర్శకుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ ఎంజాయ్‌లో వున్న తమన్‌తో ఇంటర్వ్యూ...
రెస్పాన్స్ ఎలా ఉంది..?
-చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చావని అంటున్నారు.. ముఖ్యంగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ అయితే ట్రాక్ తప్పకుండా అద్భుతమైన ఆర్‌ఆర్ ఇచ్చావని అన్నారు.
త్రివిక్రమ్‌తో సినిమా చేయడం?
- నిజంగా అది గొప్ప అవకాశంగా భావిస్తాను. ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తాడు. ఆయన పేపర్‌పై పెన్ను పెట్టాడంటే అది గన్నులా పేలాల్సిందే. త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి చాలా రోజులనుండి ఎదురుచూస్తున్నాను. కాస్త లేట్‌గా అయినా మంచి సినిమా వచ్చింది. ఆయన సినిమాల్లో కథ కొత్తగా ఉంటుంది.
నేపథ్య సంగీతం విషయంలో
ఎలాంటి కేర్ తీసుకున్నారు?
-ఈ సినిమాలో కథతోనే వెళ్లాలని ప్రయత్నించాం. నేను కూడా ఆ కథను రీ రికార్డింగ్‌లో చెప్పాలని ప్రయత్నం చేసా. అది కుదిరింది.
సూపర్‌హిట్ సాంగ్ చేసినపుడు
ఎలా ఫీల్ అవుతారు?
-సినిమా విషయంలో సిట్యుయేషన్‌ని బట్టి సాంగ్స్ వస్తాయి. ఒక బ్లాక్‌బస్టర్ సాంగ్ చేసినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే ఆ సాంగ్‌ని జనాలు మరచిపోతారు. కాబట్టి ఆ సినిమా సక్సెస్ కూడా కీలకమే.
సినిమా విషయంలో మ్యూజిక్ ఇలా చేయాలి అంటూ కండిషన్స్ ఉంటాయా?
-ఎందుకు ఉండవు.. హీరోల కోసం అన్ని రకాల సాంగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది హీరో డామినేషన్ పరిశ్రమ కాబట్టి. వాళ్ల ఇమేజ్‌కి తగినట్టే మ్యూజిక్ ఇవ్వాలి కానీ ఈ సినిమాలో మాత్రం ఎన్టీఆర్ లాంటి స్టార్‌తో త్రివిక్రమ్ ఓ చక్కటి కథను చెప్పాలని ప్రయత్నం చేయడం గొప్ప విషయం.
భాగమతి తరువాత మీలో పరిణతి ఎక్కువగా ఉందని అంటున్నారు?
-నిజమే.. భాగమతి సినిమా నుండి నా స్టైల్ మార్చాను. ఊరికే మాస్ సినిమాలు కాకుండా స్టోరీ టెల్లింగ్ సినిమాలు చేయాలనీ ఉంది. అలాంటి ప్రయత్నమే చేస్తున్నాను.
పెనివిటీ సాంగ్ కోసం ఎక్కువగా కష్టపడ్డారా?
- నిజానికి ఈ సాంగ్ కోసం చాలా కష్టపడాలి అనుకున్నాను.. కానీ 15 నిమిషాల్లో ఓకె అయ్యింది. అయితే రుధిరం అనే సాంగ్ కోసమే నెల రోజులు పట్టింది. ఆ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఏ సాంగ్ విషయంలో అయినా మొదటి ట్యూన్ ఓకె కావాలని నా ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ మొదటి బాలే సిక్స్ కొట్టాలి.
మీపై కాపీ విమర్శలు
ఎక్కువగా వినిపించడానికి కారణం?
-అదే నాకు అర్థం కావడంలేదు. నేను కంపోజ్ చేసిన సాంగ్ నా స్టైల్‌లో ఉంటాయి. అలాంటివాటిని పట్టుకుని కాపీ ట్యూన్స్ అంటూ సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. అప్పట్లో బిజినెస్‌మెన్ సినిమాలో ఆరు పాటలను కంపోజ్ చేశాను. అందులో చావుపిల్ల పిల్ల అనే సాంగ్ కాపీ కొట్టానని నానా రచ్చచేశారు. ఐదు పాటలను కంపోజ్ చేసిన నేను ఒక సాంగ్‌ని ఎందుకు కాపీ కొడతాను. అయినా దర్శక నిర్మాతలకు నాపై నమ్మకం ఉంది కాబట్టే నాకు సినిమాలు ఇస్తున్నారు. ఇలాంటివి అన్నీ కావాలని చేస్తున్నవే.
తదుపరి చిత్రాలు?
-అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను చేస్తున్నాను. దాంతోపాటు రవితేజ- శ్రీను వైట్ల కాంబినేషన్‌లో అమర్ అక్బర్ ఆంటోని సినిమా ఉంది.

-శ్రీనివాస్ ఆర్.రావ్