సబ్ ఫీచర్

ఆవేదన కలిగిస్తున్న పరిణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనాడు విశ్వవిద్యాలయాలల్లో జరుగుతున్న దారుణ పరిస్థితులను చూస్తే చాలా ఆవేదన కలుగుతున్నది. విద్యార్థులను రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, సంఘ విద్రోహకర శక్తులు పావులుగా ఉపయోగించుకుంటూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. విశ్వవిద్యాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నది. ఆ ఖర్చుపెడుతున్న డబ్బు అంతా కూడా ప్రజల సొమ్ము అని తెలుసుకోవాలి. దేశాభివృద్ధికి, సమాజాభివృద్ధికి పాటుపడాలి. దేశాన్ని పురోగతివైపు తీసికొని వెళ్లడానికి ప్రయత్నించాలి.
ఇపుడు జరిగిన ఈ అన్ని సంఘటనలలో కూడా జాతి వ్యతిరేక శక్తులు విశ్వవిద్యాలయాలలో ప్రవేశించి జాతి వ్యతిరేకతను నూరిపోస్తున్నారు. ఈ జాతి వ్యతిరేక శక్తులకు విదేశీ భావజాలంతో వున్న రాజకీయ పార్టీలు, మద్దతు పలకటం చాలా బాధాకరం. దేశంలో ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు చక్కటి సామరస్య పూరిత వాతావరణం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలి. కాని అలా కాకుండా ఇంకా దేశంలో సమస్యలు సృష్టించడానికి కొన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. దేశంలో అలజడులు సృష్టించి విషబీజాలు నాటడమే వారి పని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో, వాటి వెనుకగల కారణాలను విశే్లషించకుండా వామపక్ష భావజాల పార్టీలు వారి ఆత్మహత్యను కూడ పావుగా ఉపయోగించుకోవటం చాలా బాధాకరం. రోహిత్ వేముల దళితుడు అని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి. కాని చివరికి రోహిత్ వేముల దళితుడు కాదు అని పూర్తిగా నిక్కచ్చిగా తేలిపోయింది. ‘దళితుడు’అన్న పేరుచెప్పి దళితులలో విభేదాలు, వైషమ్యాలు సృష్టించే విధంగా వామపక్ష వాదులు, కాంగ్రెస్ పార్టీవారు ఎంత హీనాతిహీనంగా వ్యవహరిస్తున్నారో దీనినిబట్టి అందరంకూడా విశే్లషించుకోవచ్చు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఘటన అనంతరం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో వామపక్ష వాదులు, కాంగ్రెస్ పార్టీవారు అక్కడ కన్నయ్యకుమార్‌ను పావుగా ఉపయోగించుకుంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో జాతివిద్రోహకర శక్తులకు మద్దతు ఇస్తున్నటువంటి కన్నయ్యకుమార్ లాంటి వారితో వామపక్షవాదులు, రాహుల్‌గాంధీలు చేతులు కలపడం చాలా బాధాకరం. హైదరాబాద్‌లోని ఇంకొక రాజకీయాధినేత ప్రస్తుతం అందరి ఓట్లతో గెలిచి పార్లమెంటు సభ్యుడిగా వుంటూ ప్రజల సొమ్మును వేతనంగా తీసికొని అన్ని భోగాలు అనుభవిస్తూ ఈ దేశంలో పండిన పంటను తింటూ, ఈ దేశపు గాలిని పీల్చుతూ కేవలం ఒక వర్గానికి మాత్రమే వత్తాసు పలుకుతూ మెడమీద కత్తిపెట్టినా ‘్భరత్ మాతాకీ జై’అని అనను అని ఒక బహిరంగ సభలో చెప్పడం బాధాకరం. తనకు ఇష్టంలేనప్పుడు వౌనంగా వుండాలి. కాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. ఎక్కడో సౌదీ అరేబియాలో మన భారత ప్రధానమంత్రి పర్యటించినప్పుడు నరేంద్రమోదీ విమానం దిగగానే ‘్భరత్ మాతాకి జై’ అంటూ విమానాశ్రయం ప్రతిధ్వనించింది. ఒక ముస్లిం దేశంలో ‘్భరత్ మాతాకి జై’అన్న మాటలు ప్రతిధ్వనించినప్పుడు ఈ దేశంలో భారతమాత వడిలో వుంటూ ‘మెడపై కత్తిపెట్టినా భారతమాతాకి జై’అనను అన్న నాయకుడు ఈ దేశ ప్రజలముందు తలవంచాలి. జాతికి క్షమాపణ చెప్పాలి. ప్రపంచంలో ఇప్పుడిపుడే మన భారతదేశానికి ఒక గుర్తింపు వస్తున్నది. ప్రపంచంలో ఎక్కడ చూసినా అందరి నోటా భారత్ మాటే. అందుకు మనం గర్వించాలి. ఈనాడు దేశంలో పాలన మారింది. ఇంకనూ ప్రక్షాళన కావలసిన అవసరం వుంది. ఇలాంటి మన ప్రతిష్ఠ పెరుగుతున్న ఈ తరుణంలో విదేశీ భావజాలంతో వున్న వామపక్షవాదులు, తమ ఉనికిని చాటుకోడానికి కాంగ్రెస్‌వారు చేస్తున్న ప్రయత్నాలు దురదృష్టకరం. ఇలాంటి చర్యలను మన భారతజాతి ఎన్నటికీ క్షమించదు..

- గౌరుగారి గంగాధరరెడ్డి