సబ్ ఫీచర్

స్వేచ్ఛ అంటే అర్థం చేసుకొన్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీలో విత్తనముంది. కానీ, అది మొలకెత్తేందుకు కావలసిన నేల, సరియైన ఋతువు, అనుకూల వాతావరణం, అనువైన సమయాలకోసం మీరు అనే్వషించక తప్పదు. కాబట్టి, జంతువులా సమాంతరంగా సంచరించడంవల్ల మీరు ఆత్మరహితంగా మిగిలిపోతారు. అదే మీలోకి నిలువుగా ఏదైనా చొచ్చుకుపోయినప్పుడు, మీరు ఒక ఆత్మగా పరిణమిస్తారు. ఆత్మ అంటే సమాంతరంలోకి నిలువుగా చొచ్చుకుపోవడమన్నమాట. ఉదాహరణకు, మీరొక గొంగళిపురుగు, సీతాకోక చిలుకలా ఊహించుకోండి.
మనిషి ఒక పసిగుడ్డులా జన్మించాడు. దురదృష్టవశాత్తు అనేకమంది అదే స్థాయిలో మరణిస్తారు. కానీ, కొందరు గొంగళిపురుగులా అవుతారు. పసిగుడ్డుకు చలనముండదు. అది అలాగే ఉన్నచోటే ఉంటుంది. కొందరు మాత్రమే కదిలే గొంగళి పురుగు స్థాయికి ఎదుగుతారు.
అంటే వారిలో చైతన్యం ప్రవేశించినట్లే. అప్పుడే జీవితానికి చలనమొస్తుంది. అయినా చాలామంది గొంగళిపురుగుల్లాగే ఉండిపోతారు. అందుకేవారు ఒకే రీతిలో ఉన్నచోటే సమాంతరంగా సంచరిస్తూ ఉంటారు. చాలా అరుదుగా, బుద్ధుడు, జలాలుద్దీన్ రూమీ, జీసస్, కబీర్ లాంటి వ్యక్తులు చిట్టచివరివరకు దూకి సీతాకోక చిలుకలా అవుతారు. అంటే నిలువుగా ప్రవేశించినట్లన్నమాట.
గుడ్డు కదలదు. గొంగళి పురుగు కదులుతుంది. సీతాకోక చిలుక పైపైకి ఎగురుతుంది. ఎందుకంటే, దానికి రెక్కలొస్తాయి. అవే దాని లక్ష్యం. మీరు పైపైకి ఎగిరే స్థాయికి చేరకపోతే మీకు ఆత్మ లేనట్లే.
ఐక్యమవడం, స్వతంత్రత, సృజనాత్మకతలు గుర్తుంచుకోవలసిన అతి ప్రభావశీలమైన పదాలు. ఎందుకంటే, ఆ మూడుదశల ద్వారానే సత్యం తెలుసుకోబడుతుంది. జీర్ణించుకోవడం గుడ్డుదశలో జరిగే పని. ఆ దశలో ఆహారాన్ని జీర్ణించుకున్న గుడ్డు గొంగళిపురుగులా మారేందుకు సిద్ధమై, అందుకు కావలసిన శక్తిని సమీకరించుకుంటుంది. ఎందుకంటే, కదిలేందుకు చాలా శక్తి అవసరం. పూర్తిగా జీర్ణమవడమే గొంగళి పురుగులా మారడమంటే. అలా ఒక దశ ముగుస్తుంది.
పసిగుడ్డు దశ ముగిసిన తరువాత రెండవ దశ అయిన స్వతంత్రత మొదలవుతుంది. అప్పుడు ఒకేచోట ఉండవలసిన అవసరముండదు. సాహసంతో అనే్వషించే సమయం ఆసన్నమై స్వతంత్రంగా కదలడంతో అసలైన జీవితం ప్రారంభమవుతుంది. పసిగుడ్డు పరాధీనత సంకెళ్ళలో బందీగా ఉండిపోతుంది. గొంగళిపురుగు ఆ సంకెళ్ళను తెంచుకుని కదలడం ప్రారంభిస్తుంది. కరిగిన మంచుగడ్డ ప్రవహించడం ప్రారంభిస్తుంది. పసిగుడ్డుది ఘనీభవ స్థితి అయితే, గొంగళిపురుగుది నదిలా ప్రవహించే స్థితి.
ఇక మూడవ దశ అయిన సృజనాత్మక దశ వస్తుంది. స్వతంత్రత కూడా పెద్దగా అర్థవంతమైనదేమీకాదు. మీరు స్వతంత్రులుగా ఉన్నంతమాత్రాన అంతా సాధించినట్లేమీ కాదు. బందిఖానానుంచి బయటపడడం మంచిదే. కానీ, దేనికోసం స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉండాలి?
ముఖ్యంగా, స్వేచ్ఛకు రెండు కోణాలుంటాయని గుర్తుంచుకోండి. ‘‘దేనినుంచి స్వేచ్ఛ?’’అనేది మొదటిది. ‘‘ఎందుకోసం స్వేచ్ఛ?’’అనేది రెండవది. చాలామంది మొదటి స్వేచ్ఛను మాత్రమే సాధిస్తారు. అంటే తల్లిదండ్రుల నుంచి, చర్చినుంచి, మసీదునుంచి- ఇలా అనేక రకాలైన బందిఖానాల నుంచి స్వేచ్ఛను సాధిస్తారు. కానీ, ఎందుకోసం? అది అతి ప్రతికూలమైన స్వేచ్ఛ మాత్రమే.
స్వేచ్ఛ దేనినుంచో మీకు తెలిసినంత మాత్రాన అసలైన స్వేచ్ఛ గురించి మీకు తెలిసినట్లుకాదు. మీకు ప్రతికూల స్వేచ్ఛ గురించి మాత్రమే తెలిసింది. హాయిగా మీకు నచ్చినట్లు ఆడుతూపాడుతూ, మీరు చెప్పదలచుకున్నది చెప్తూ, మీకు నచ్చినది సృష్టించగల సానుకూల స్వేచ్ఛ గురించి మీరు ఇంకా తెలుసుకోవలసి ఉంది. అదే మూడవ దశ అయిన సృజనాత్మకత.
ఈ దశలో గొంగళిపురుగు రెక్కలను సంతరించుకుని మకరందాల అనే్వషణలో పరపరాగాల సృష్టిని కొనసాగించే అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. సృష్టించే కళ ఉన్నవారు మాత్రమే అలా అందంగా, చాలా చక్కగా ఉంటారు. ఎందుకంటే, అలాంటివారికే జీవన వసంత వైభవాన్ని చూడగల కళ్ళు, జీవన వసంత గీతాలను వినగల చెవులు, పరవశించి స్పందించే హృదయం ఉంటాయి. అందుకే వారు పూర్తి సజీవంగా, సంపూర్ణంగా, అత్యంత గరిష్ఠంగా జీవిస్తారు.
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.