సబ్ ఫీచర్

కలనైనా కనపడు! -- 87

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ.వె ప్రియుని కలలనైన ప్రియమారగాంచెడు
ఇంతి భాగ్య గరిమ నెంచదరమె
చెంత వాడు లేక చేరదే నను నిద్ర
కలలవెట్లు, వాని గాంచు టెట్లు!
విరహవేదన పడుతున్న ఒక కాంత తన సఖితో ఇలా అంటోంది. ‘నిద్రలోనైనా కలల్లో ప్రియుని చూడగలిగిన తరుణలదే భాగ్యం. కానీ వాడు నాకు చెంతలేనిదే కన్నులు మూతపడవు. నిద్రా రాదు. ఇంక వాణ్ణి కలలోనైనా చూచేదెట్లాగే సఖీ!’ అని బాధపడిందా నాయిక.
వివరణ:విరహానికి పరాకాష్ఠ ఈ గాథ. కలలోనైనా నిన్ను చూద్దామనుకొంటే కనులు మూతపడడంలేదని కలత చెందే నెలతగాథ ఇది. ‘కలనైనా నీ తలపే’ అనీ పాడుకోలేని అభాగ్య సౌభాగ్యవతి ఆమె. ఆలుమగల మధ్య గాఢమైన అనురాగాన్ని ఈ గాథ ప్రతిపాదిస్తుంది. ఆలుమగలు ఇద్దరూ కలసి ఉంటేనే అందం చందం. గొడవలుపడ్డా, రద్దాంతాలు సిద్ధాంతాలు చేసుకొన్నా సాయం సమయానికి ఇద్దరిదీ ఒకే సిద్ధాంతానికి స్థిరపడుతుంది. కనుక అపుడు ఒకరికి ఒకరు దూరమైతే పాపం వారి బాధ వర్ణననాతీతం.
ప్రాకృతమూలం
ధణ్ణా తా మహిలాఓ జాద ఇఅం సవిణఏ విపేచ్ఛంతి ణిహవ్వి అతేణ విణా ణఏఇ కాపే చ్ఛఏ సివిణం (మలయశేఖరుడు)
సంస్కృత చ్ఛాయ
ధన్యాస్తా మహిలా యాదయితం స్వప్నే పి ప్రేక్షంతే
నిద్రైవతేన వినానైతి కాప్రేక్షతే స్వప్నామ్
*

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949