సబ్ ఫీచర్

అశోకవృక్షపు ఆశ (పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం--89)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ ఇలను లలనల కుసుమకోమలకరముల
కనన శోకమా! రసిక నికరము నీదు
ముగ్థపల్లవంబులతోడ పోల్చుచుండ
ఆకసంబును తాకగా, ఆశ ఏల?
సహజంగా అశోకవృక్షం బాగా ఎత్తుగా ఎదిగి ఆకాశాన్ని ముద్దాడుతూ ఉన్నట్టు ఉంటుంది. ఆ విషయానే్న గాథాకారుడు చమత్కరిస్తున్నాడిక్కడ. ‘‘ఓ అశోక వృక్షమా! భూమిపై లావణ్యవతుల చేతులను నీ చివురులతో పోలుస్తూ ఉంటే, ఆ అదృష్టానికి పొంగిపోక ఆకాశాన్ని తాకాలనే ఆశ నీకెందుకు?’’ అని ఒక సహజమైన విషయాన్ని చమత్కార ప్రపూరితం చేస్తున్నాడు కఠిలుడు అనే గాథాకారుడు.
వివరణ: ఈ గాథలోని చమత్కారాన్ని అలా ఉంచి ఆలోచిస్తే- లోకంలో కొంతమంది తమకున్న నైపుణ్యాన్ని వినియోగించుకోకుండా అనవసరమైన వాటిలో ప్రావీణ్యం కోసం పాకులాడుతూ ఉంటారు. దానివల్ల ఉభయ భ్రష్టత్వమే సంప్రాప్తవౌతూ ఉంటుంది. భగవంతుడు ప్రతి మనిషికీ ఏదో ఒక ప్రత్యేకతనిస్తాడు. దాన్ని గుర్తించి వినియోగించుకొని వృద్ధిలోకి రావడానికి ప్రయత్నించాలి. అంతేకానీ, లేనివాటికోసం ఆరాటపడుతూ ఉన్నవాటిని నిర్లక్ష్యం చేయడం అవివేకం.
ప్రాకృత మూలం
ఏఏణచ్ఛిఅ కంకేల్లి తుజ్ఘ తంణత్థి జంణ పజ్జంత్తం!
ఉవమిజ్జఇ జంతుహ పల్లవేణ పరకామిణీహత్థో (కఠిలుడు)
సంస్కృత చ్ఛాయ
ఏతేనైపకం కేల్గే తవ తన్నాస్తి యన్న పర్యాప్తమ్/ ఉపమీయతే యత్తవ పల్లవేన వరకామినీ హస్తః

-- డి.వి.ఎం. సత్యనారాయణ9885846949