సబ్ ఫీచర్

సమాజ హితైషిణి .. రాహత్ రషీద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమతి రాహత్ రషీద్ ప్రఖ్యాత మెరిడియన్ స్కూలు, బంజారాహిల్స్ వైస్ ప్రిన్సిపాలు. వీరు గురువు, మనస్తత్త్వ పరిజ్ఞాని, పరిశోధకురాలు, సంఘసేవిక. ఒక వైపు వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, మరొకవైపు గురువుగా, నిర్వాహకురాలిగా, సంఘసేవికగా, ఎన్నో బాధ్యతలు సునాయాసంగా నిర్వహిస్తున్నారు. శ్రీమతి రాహత్ దేశవిదేశాలు తిరిగి, మన భారతదేశపు సంస్కృతిసంప్రదాయాల కీర్తి పతాక ను నెగురవేశారు. సమాజసేవలో అలుపెరుగని చైతన్యమూర్తిగా కాంతిపుంజంగా నీరాజనాలందుకుంటున్నారు.
విద్యార్థులకు శ్రీమతి రాహత్ ఒక శక్తి. తోటి అధ్యాపకులకు కొండంత అండ. రాహత్ చదువుల తల్లి. తను ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్‌ఎసి, సైకాలజీలో ఎమ్.ఏ చేశారు. ఇంకా ఎడ్యుకేషన్‌లో కూడా డిగ్రీ పొందారు వీరు. తాను చదువుకోవడమే కాదు తనకు తెలిసిన వారిలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేక పోతున్నారు అంటే తన డబ్బును కొంత ఇచ్చి మరీ చదివిస్తారు. చదువుకోవాలన్న అభిలాష ఉంది అంటే చాలు ఎవరినైనావారు ఎంత చదువుకోవాలనుకొంటే తానే ఆర్థిక భారాన్ని మోస్తూ చదివిస్తారు. ఇలాంటి వీరు మన హైదరాబాదులో ఉండటం, ఒక గర్వకారణం,
రోటరీ ఇంటరాక్టు క్లబ్, లిటిల్ సిర్టర్సు ఆఫ్ ది పూరు బోవెన్‌పల్లి, ఓల్డు ఏజి హోం, బాపుఘాట్ వీటిని దత్తత తీసుకొని, సమాజసేవకు అంకితమైనారు శ్రీమతి రాహత్ రషీద్. వరదలు, కరువులు వచ్చినప్పుడు సేవలో ముందుంటారు వీరు. మనకున్నంతలో ఇతరులకు సాయం చేయడం, ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడం లాంటివి చేసేవాళ్లనే మనుషులుగా అనుకోవాలి. ప్రతిమనిషిలో మనిషితనం, మానవత్వం ఉంటేనే మనిషిగా గుర్తింపబడుతారు అంటారు రాహత్.
తనకు ఏ కొద్ది సమయం దొరికినా సరే సమాజ సేవకు పూనుకొంటారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైనవారికి, విధి వక్రించిన వారికి తన చేయూత సదా ఉంటుంది అంటారు. గుడ్డివారికి, అంగవికరలురకు తన సొంత సంపాదన ఖర్చు పెట్టడమే కాక వారికి ప్రభుత్వం చేసే సాయాన్ని అందుకునే విధానాన్ని కూడా వారికి తెలియ చెప్పుతూ వారిలో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుతారు.
ఇలా వీరు మన దేశంలోనే కాదు యుఎస్‌ఎలో లాస్ ఏంజిలిస్, షికాగో, న్యూయార్కు, ఒర్లాండో, న్యూజర్సీ, బోస్టను, నైస్, మోనాకో, మెంటీకార్లో, ఫ్రాన్సు, రోము- ఫ్లారెన్సు, కాప్రి, నేపుల్సు, ఇటలీ, జెనీవా, జ్యూరిక్, స్విట్జర్లాండు, లండను, కార్డ్ఫి, బ్లాకుబర్న్, యుకె, మాడ్రిడు, బార్సిలోనా, టొలీడో, స్పెయిన్, జర్మనీ- ఫ్రాంకుఫర్టు, ఆమ్స్ట్‌ర్‌డాము- నెథర్‌లాండ్సు, చైనా-బీజింగు, జెడ్డారియాదు, డెహరను, సౌదీ అరేబియ, దుబాయి, షార్జా, అబుదాబి, ఈజిప్టు-కైరో, సింగపూరు, బాంకాకు, హాంకాంగు, టోక్యో, ఒసాకా-జపాను ఇలా ఎన్నో విదేశాలు పర్యటించారు. అక్కడ కూడా ఎన్నో సేవాకార్యాక్రమాలు చేపట్టారు. మా భారత దేశం త్యాగం చేయడంతోనే అమృత్వత్వాన్ని సాధించవచ్చు అని మహా భారతం చెప్పిన త్యాగేనైక అమృతత్వ మానశుః అన్న సూక్తిని స్మరిస్తూ తనకు చేతనైనంతలో అంటూనే రాహత్ పదిచేతులతో ఆర్తులను ఆదుకుంటారు. అందుకే ఆమె ఎక్కడుంటే అక్కడ జనులు సంతోషంగా ఉంటారు. రాహత్ రషీధ్. దేశ విదేశాలు తిరిగినా, ఎన్నో గొప్ప పనులు చేసినా, నిరంతరమూ సమాజ హితైషిణిగా పని చేస్తున్నా వీరిలో అణువంత కూడా గర్వం కనిపించదు. పైగా ఎంతో సున్నితంగా విన్రమంగా మాట్లాడుతారు. వీరి మనస్సు నవనీతం కన్నా మృదువైనంది.
గురువు అంటే శిష్యులను చీకటినుండి వెలుతురుకు తీసుకువెళ్ళే దారి దీపం. శ్రీమతి రాహత్ తన విద్యార్థులను యుఎస్‌ఎలో నాసాకు, బీజింగు చైనాలో ఉశ్రీ కాన్ఫరెన్సుకు విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్ళారు. వారిని ఆట, పాట, మాటలో ఎంతో ప్రోత్సహిస్తారు. అంటే చదువుతో పాటు, సంగీతం, నృత్యం, డిబేటు, ఎంయుఎ, మాక్ పార్లమెంటు, ఎలక్యూషను, ఎస్సేరైటింగు, సంఘసేవ, ఇలా ఎన్నో కోణాలలో, అనేకానేక రంగాలలో వారిలో ఆసక్తిని పెంపొందించి,వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతూ పరిపూర్ణ మానవులుగా రూపుదిద్దుతున్నారు. విద్యార్థులందరూ రాహత్ మాకు దారి చూపిన దీపం అని అంటారు.
చైతన్యమూర్తి: కొన్ని దశాబ్దాలుగా గురువుగా, సంఘసేవికగా సమాజ సేవకు అంకితమైనారు వీరు మహిళలకు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి వీలుగా ఉన్నా సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. మహిళల్లో ఆత్మసైథర్యాన్ని నెలకొల్పడానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎథుగడానికి వీలైన వాటిని గురించి వారికి అవేర్‌నెస్ రావడానికి కృషి చేస్తుంటారు.
సైకాలజీ చదువుకున్న రాహత్ పిల్లల్లోనేకాదు మహిళల్లో కూడా మానసిక ఎదుగుదలకు కృషి చేస్తుంటారు.
కేవలం విద్యార్థులకు చదువే కాకుండా వారిని మంచి పౌరులుగా తీర్చిదద్దాలంటే వారిని ఉన్నతమైన మనుష్యులుగా ఎదుగనివ్వాలంటే వారికి విద్యతోపాటు సంగీతం, నృత్యం, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ మొదలైన ఆటల్లో వారిని ప్రోత్సాహించాలని అంటారు. అందుకోసం పిల్లలకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులంతా శ్రీమతి రాహత్ ను తమ మార్గదర్శిగా భావిస్తారు.

- డా.శ్రీలేఖ కోచ్చెర్లకోట