సబ్ ఫీచర్

మితిమీరిన ఉత్సాహం ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పేరిట పలు రాష్ట్రాలలో జరిగే శక్తి పూజల్ని, అమ్మవారి మహోత్సవాల్ని భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో జాతర రీతిలో ఉత్సవాల్ని నిర్వహించడం ఆనవాయితీ. భక్తుల మొక్కులను ఆశీస్సులతో ఆదిపరాశక్తి వరాల కల్పవల్లి కోరికల్ని తీర్చడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే భక్తుల అత్యధిక ఉత్సాహం, నిర్వాహకుల నిర్లిప్తత కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలోని పరపూర్ గ్రామంలోని పుట్టంగల్‌దేవి ఆలయ పరిసరాల్లో ఇటీవల అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న బాణాసంచా పోటీ ఘటనలో 106 మంది నిహతులు కావడం, 383 మంది భక్తులు క్షతగాత్రులు కావడం కేవలం మానవ లోపం, అత్యుత్సాహమే కారణం. కేరళ రాష్ట్రంలో ఏటా పుట్టంగల్ దేవి ఉత్సవాలు మహాఘనంగా జరపడం ఆనవాయితీ. పుట్టు అంటే మలయాళంలో చీమలకొండ అని అర్థం. పుట్ట నుండి ఆవిర్భవించిన గ్రామదేవత కనుక పుట్టంగల్‌దేవిగా ప్రసిద్ధి పొందింది. మలయాళ పంచాంగం ప్రకారం మనం నెలలో భరణి నక్షత్రంనాడు అమ్మవారు ఉద్భవించింది కనుక ఈ వేడుకల సందర్భంగా అశవతి విలక్కు, కథాకళి, కంపాదికళి, మరమేడుపు వంటి వేడుకలతోపాటు ఇతర అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళా వేషధారణలో అమ్మవారికి దీపారాధన చేస్తారు.
బాణసంచా పోటీలే మారణహోమానికి కారకమయ్యాయి. భక్తుల ఉత్సాహం ఏటా నిర్వహించే వాటికంటే మరింత గొప్పగా బాణసంచా ప్రదర్శించాలనే నిర్వాహకుల, భక్తుల మనోభావాలే ఇంతటి నరమేధానికి ఆటపట్టుగా మారింది. ఉత్సాహం, అత్యుత్సాహంగా మారడం, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టలేకపోవడం ఈ అధునాతన యుగంలోకూడా సహించరాని దుస్థితి. భక్తిప్రపత్తులు ఉండాలే కానీ, మితిమించిన ఆత్మవిశ్వాసం, ఆపై జరిగే దుర్ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారనే కొంతైనా లౌకిక జ్ఞానం బుర్రలలోవుంటే ఇలాంటి దారుణ మారణహోమాలకు తావుండేదే కాదు. భక్తులు ఎక్కడెక్కడినుండో అమ్మవారి ఉత్సవాలను, అక్కడ జరిగే సంబరాలను తిలకిద్దామనే ఉద్దేశంతో వస్తూ వుంటారు. మానసికంగా దైవభక్తి ప్రేరేపితులయిన భక్తులకు మరణశయ్యలు పొందుపరచి ఉంటారని ఊహామాత్రంగా తెలిసినా ఏ భక్తులు తండోపతండాలుగా అక్కడికి చేరుకొని బాణసంచా వేడుకల్ని వీక్షించేవారు కాదు. ఉన్నపళంగా జరిగిన ఘోర ఉదంతంలో సమిదలయ్యేవారు కాదు. మృత్యువుతో పోరాటం అనేది ఇలాగే ఉంటుంది. బాణసంచా పోటీలను విజ్ఞులైనవారు నిర్వాహకులు నిషేధించాల్సిన అంశం. బాణసంచా నిపుణులు ఎంతటి ప్రజ్ఞాదురంధరులైనా, ప్రకృతి వైపరీత్యాలను నివారించే సత్తా ఎవరికుంది? జలప్రళయం, తుఫాను, పెనుగాలులు, అగ్నిపర్వతం ప్రేలిన యమప్రవాహాల్ని ఉప్పొంగుతున్న కడలిని ఇతర ప్రకృతి వైపరీత్యాలను అత్యాధునిక శాస్ర్తియ విజ్ఞానంకానీ, మానవమేధస్సు కానీ నిరోధించలేని లోకదుస్సాధ్యాలు.
అలాంటిది మానవ పరిధిలో రాబోయే ప్రమాదాలను మున్ముందుగా గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ మారణహోమం జరిగి ఉండేదికాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరణించిన వారికి కంటి తుడుపుగా 12 లక్షల పరిహారమిచ్చినా ప్రాణాలు కోల్పోయిన వారికి వారి కుటుంబాలకు సంపూర్ణ ఊరట లభించదు. వారి ఆయుస్సు అంతే వారికి మానవపరంగా మనం చేయగలిగింది ఇంతే అంటూ వ్యాఖ్యానించేవారికి జవాబు కరువైపోతుంది. ముందుముందు ఇలాంటి మారణహోమాలకు భక్తులు ప్రజలు బలికాకుండా ముందుజాగ్రత్తలకు కేరళ సంఘటన ఒక చారిత్రాత్మక హెచ్చరికగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- దాసరి కృష్ణారెడ్డి