సబ్ ఫీచర్

పింగాణి తళతళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పింగాణి పాత్రల అందం చెప్పితే సరిపోదు. వాటిని చూసి తీరాల్సిందే. నిగనిగలాడుతూ కాంతివంతంగా ఎన్నో రకరకాల సైజుల్లో అందంగా ఉంటాయి. చూడగానే కనువిందు చేస్తుంటాయి.
ఇంతకుముందు కాలంలో పింగాణి పాత్రలు అంటే కేవలం జాడీలే. వీటిల్లో ఊరగాయలు, పచ్చళ్లు నిల్వచేసుకొనేవారు.ఇపుడు టీ, కాఫీలు తాగడానికి ఎక్కువగా కప్స్ ఉపయోగించేవారు. ఇప్పుడీ మధ్య భోంచేయడానికి కూడా ఈ పింగాణి ప్లేట్స్ ను వాడుతున్నారు. వీటిని శుభ్రపరచడం తేలిక. ఇంట్లో అలమరల్లో పేర్చుకోవడం కూడా తేలికే.
అంతేకాదు వీటిల్లో మొక్కలు పెంచవచ్చు కూడా. మొక్కలకోసం ప్రత్యేకమైన డిజైన్స్‌తో పింగాణి కుండీలను తయారు చేస్తున్నారు. వీటిలో పెంచే మొక్కలు ఇంట్లో కూడా అమర్చుకోవచ్చు.
ఇంతేకాక డెకరేటివ్ పీస్స్‌స్‌గా కూడా పింగాణితో తయారు చేస్తున్నారు.
ఏ పింగాణి వస్తువులనైనా జాగ్రత్తగా వాడుకోవల్సిందే. చేయి జారితే ఎంత అందంగా ఉంటాయో అంతగా పుట్టుక్కుమని విరిగిపోతుంటాయి. ఇప్పుడిప్పుడు విరగని పింగాణి వస్తువులు వస్తున్నాయి. వాటిని అందంగా అమర్చుకోవడానికి తీసుకొంటే ఎంతో బాగుంటాయి. జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం ఎన్ని యేండ్లు అయనా కలర్ పోకుండా వనె్న తగ్గకుండా వనె్నలూరుతూ అందరినీ ఆకర్షిస్తుంటాయ.
ఏది ఏమైనా తేలికగా శుభ్రపర్చుకోవడానికి, ఇంటి అందాన్ని పెంచుకోవడానికి ఈ పింగాణి పాత్రలు పనికి వస్తాయి.

-మాగంటి రాధిక