సబ్ ఫీచర్

అమ్మ ఒడి పిల్లలకది తొలి బడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ అనే వేదోక్తి మాతృమూర్తికే అగ్రతాంబూలం యిచ్చింది. అమృతం లాంటి ప్రేమను చూపించేది, ఆప్యాయత, అనురాగం, నిష్కల్మషమైన ప్రేమ, అపరిమితమైన వాత్సల్యం కురిపించేది ఈ సృష్టిలో అమ్మ మాత్రమే. ఒక కొవ్వొత్తి వలె, తన శక్తిని తైలంగామార్చి, తన శరీరాన్ని వత్తిగా మలిచి, తాను కుంగిపోతున్న పిల్లల జీవితాలలో వెలుగులు నింపాలనుకునే ఆవాజ్య కరుణామూర్తి, అమృతమూర్తి అమ్మను వేదశాస్త్రాలు ఆ భగవంతునికి ప్రతి రూపంగా నిర్ణయించాయి. నవజాత శిశువుకు తొలి దైవం అయిన అమ్మ, మనిషి పుట్టుకనుండి జీవిత పర్యంతం తానువేసే అడుగువెనుక కీలకపాత్ర పోషిస్తుంది.
పుట్టిన వెంటనే అమృతధారల వంటి స్తన్యాన్ని అందించే అమ్మ తన ఒడినే బడిగా చేసుకొని శిశువుకు సమస్తం నేర్పిస్తూ తొలి గురువుగా కూడా పాత్ర పోషిస్తుంది. మనస్తత్వ శాస్తవ్రేత్తల అధ్యయనం ప్రకారం శిశువులు మొదటి అయిదు సంవత్సరాలు తల్లి సంరక్షణలో గడుస్తాయి. కాబట్టి అవి ఎంతో కీలకమైనవి. తల్లి ఆలోచనలు, ప్రవర్తన, సంస్కారాల ప్రభావం గర్భస్థ దశనుండే ప్రారంభవౌతుంది. హిరణ్యకశిపుని భార్య అయిన లీలాదేవి నారదుని ద్వారా నారాయణ మంత్రం, బ్రహ్మజ్ఞానం వింటున్నప్పుడు ఆ జ్ఞాన ప్రభావం గర్భంలోవున్న ప్రహ్లాదుడిపై పడింది.
అతడు గొప్ప విష్ణ్భుక్తుడు, భాగవతోత్తముడు అయ్యాడు. గర్భస్థశిశువుగా సుభద్ర గర్భంలోవున్న అభిమన్యుడు తన తండ్రి అర్జునుడు తల్లితో చక్రవ్యూహం గురించి చెప్పిన జ్ఞానమంతా స్వీకరించాడు. అందుకే ప్రతి తల్లి తన పిల్లల శారీరక వికాసానికి మాత్రమేకాకుండా వారి అభ్యున్నతి, వ్యక్తిత్వ వికాసం, ఉన్నతమైన విలువలు పెంపొందించేందుకు తన ఒడినే బడిగామార్చి కృషిచేయాలి. ఆధ్యాత్మిక, మానవీయ, విలువలను, జాతీయ భావాలను, నాయకత్వం, వాక్‌శక్తి, నీతినిజాయితీలు, ధైర్యసాహసాలు వంటి లక్షణాలను ఉగ్గుపాలతోనే రంగరించిపోయాలి. విశ్వంలో అన్నింటికంటె గొప్ప బడి-అమ్మ ఒడి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ధ్రువుడు, శ్రీరాముడు, శంకరాచార్యుడు, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజి, మహాత్మాగాంధి వంటి మహోన్నతులు అమ్మఒడి నుండే విలువైన పాఠాలు నేర్చుకొని జీవన సాఫల్యం పొందారు. పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంలో మాతృమూర్తి పాత్ర అమోఘం. లాలి పాటలతోపాటు శ్రీరామాయణం, భారతం, భాగవతం వంటి గ్రంథాలు, మహనీయుల జీవిత గాథలను వారికి ఆసక్తికరంగా చెబుతూ వుంటే ఆ విలువలు పసి హృదయాలలో శాశ్వతంగా ముద్రించుకుపోతాయి. నేటి సమాజంలో అవినీతి, అసభ్యత, అనైతికత, హింస, అత్యాచారాలు, కుటుంబ విలువలకు త్రిలోదకాలివ్వడం, ప్రేమానురాగాలు, నిస్వార్థత కంటె ధనార్జనకే ప్రాధాన్యత యివ్వడం వంటి అనుచిత, అధర్మ వర్తన తగ్గాలంటే తల్లి పుట్టిన నాటినుండే పిల్లలకు తన ఒడిలో అత్యున్నత విలువలను అందించడం చాలా అవసరం.
మార్కులు, ర్యాంకుల సాధనే పరమావధిగా సాగుతున్న నేటి విద్యావిధానంలో ఇలాంటి విలువలు విద్యార్థులకు అందుతాయనుకోవడం అత్యాశే అవుతుంది. కాబట్టి మన భారతీయత, సనాతన సంస్కృతి, సంప్రదాయాలు, ధార్మిక జీవన విధానం ఔన్నత్యాన్ని ఉగ్గుపాలనుండీ అమ్మ అందించాల్సి వుంటుంది.
కన్నబిడ్డల్ని క్రమశిక్షణతో పెంచి, శాస్ర్తియ పరిజ్ఞానంతోపాటు ఆధ్యాత్మికతకు జీవితంలో స్థానం కల్పించి, సమాజానికి, దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది ‘‘మాతే ప్రథమగురు’’అనీ వేదానికి కార్యరూపం దాల్చే గురుతర బాధ్యత ప్రతి కన్నతల్లిపై వుంది.

-సి.ప్రతాప్