సబ్ ఫీచర్

పరిమితులు లేనిది -- ఓషో బోధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు:
====================
అనువాదం: భరత్

మీరు ఎప్పుడూ ప్రేమతో ఉండగలరు, అందరినీ ప్రేమించగలరు. అలా మీరు పూర్తి ప్రేమగా మారి, ఏ కారణం లేకుండా అందరినీ ప్రేమిస్తున్నట్లైతే, ఎట్టి పరిస్థితిలోనూ మీ ప్రేమ ద్వేషంగా మారే అవకాశం లేదు. ఎందుకంటే, మీరు ఎవరినుంచీ ఏదీ ఆశించట్లేదు. కాబట్టి, మీరు నిరాశపడే అవకాశమే లేదు. అందుకే నేను ప్రేమను ఒక ఆధ్యాత్మిక విషయంగా పరిగణిస్తూ, అది కేవలం జీవశాస్త్ర పరమైనది మాత్రమేకాదని చెప్తున్నాను. జీవశాస్త్ర పరమైనది కేవలం జాతిని కొనసాగించడంలో ఆసక్తిచూపే లాలసతో కూడిన కోరికే కానీ, ప్రేమ ఏమాత్రం కాదు. అలాంటి ప్రేమ భావన కేవలం జీవశాస్త్ర పరమైన లంచం మాత్రమే. ప్రేమ కలాపం ముగిసిన వెంటనే దానిపై ఆసక్తి కొద్దికొద్దిగా తగ్గిపోవడం మీకు స్పష్టంగా తెలుస్తుంది. అది మీ వయసుపై ఆధారపడి ఉంటుంది.
ప్రతిస్పందన నుంచి స్పందనకు:
‘‘మీరు చేసే పని ప్రతిస్పందన కాకూడదు’’ అనేది ముందుగా మీరు తెలుసుకోవలసిన అత్యంత వౌలిక విషయం. ఎందుకంటే, మీరు చేసే పని కేవలం ‘స్పందన’ మాత్రమే అయితే ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి, స్పందన ఎప్పుడూ మంచిదే. కానీ, ప్రతిస్పందన వల్ల అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల అది ఎప్పుడూ చెడ్డదే. కాబట్టి, ముందుగా ప్రతిస్పందన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించండి.
ప్రతిస్పందన అంటే మీరు అచేతనంగా స్పందించడమే. ఎవరో ఏదో చెప్పి, ఏదో చేస్తారు. వెంటనే దానికి మీరు స్పందిస్తారు. అలాఎవరో మిమ్మల్ని తెలివిగా మోసం చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితికి ఇతరులే ముఖ్య కారణం.
ఉదాహరణకు, ఎవరో వచ్చి మిమ్మల్ని అవమానిస్తారు. వెంటనే మీకు కోపం వస్తుంది. అలాగే, ఎవరో వచ్చి మిమ్మల్ని ప్రశంసిస్తారు. వెంటనే మీకు సంతోషం కలుగుతుంది. అలా, రెండు పరిస్థితులలోనూ మీరు మనిషిలా కాకుండా చాలా యాంత్రికంగా ఒక బానిసలా ప్రవర్తిస్తారు. అందుకు ఏ మీటలు నొక్కాలో ఇతరులకు బాగా తెలుసు. కాబట్టి, స్పందించండి. అంతేకానీ, ఇతరుల చేతిలో కీలుబొమ్మలా ప్రతిస్పందించకండి.
మనోరహిత స్థితిలో ఎవరు ఎలా స్పందిస్తారో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే, కేవలం మనం మనసును మాత్రమే ఊహించగలం. ఒకవేళ మీరు సచేతనమైన ఎరుకతో అప్రమత్తంగా ఉన్నప్పటికీ, ఏ పరిస్థితి ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
మీ చైతన్యం ముందు అనేక ప్రత్యామ్నాయాలు ప్రత్యక్షమవుతాయి. అయినా మీ చైతన్యం ఎప్పుడూ పూర్తి స్వేచ్ఛతోనే ఉంటుంది. అందుకే అది ఎప్పుడూ ఎవరి నియంత్రణకు లోనుకాకుండా, పూర్తి వర్తమానంలో అప్రయత్నంగా మీ ఉనికి నుంచి ఒక స్పందనగా బయటపడుతుంది.
మనమందరం ఒక పద్ధతి ప్రకారం నిబద్ధీకరించబడ్డాం. కాబట్టి, వాటికి అనుగుణంగానే మనమందరం ప్రతిస్పందిస్తాం. శాకాహారులు మాంసాహారాన్ని అసహ్యించుకుంటారు. కానీ, మాంసాహారులు దానిని చాలా ఇష్టపడతారు. మన నిబద్ధీకరణలే అందుకు ముఖ్య కారణం. మీరు అందరిలా గందరగోళానికి గురికాకుండా ఎప్పుడూ చాలా మర్యాదగా మాట్లాడేలా, ఆలా నిశ్శబ్దంగా ఉండేలా వాటితో మిమ్మల్ని నియంత్రించవచ్చు. అవన్నీ మీ మనస్తత్వంపై ప్రభావం చూపేవే. అలాంటప్పుడు మీకు ధార్మికతతో పనేముంటుంది.
నిబద్ధీకరించడమంటే హత్య చేసినట్లే. అది మీలో సహజంగా ఉండే సమయస్ఫూర్తిని చంపేస్తుంది. అనేక కచ్చితమైన భావాలతో నింపబడిన మీ మనసు మిమ్మల్ని వాకి అనుగుణంగా ప్రతిస్పందించేలా చేస్తుందే కానీ, మిమ్మల్ని ఏమాత్రం సహజంగా స్పందించనివ్వదు. ఏ విషయంలోనైనా- చిన్న విషయం కావచ్చు, పెద్దవిషయం కావచ్చు- అది అలాగే చేస్తుంది. ఒకవేళ మీరు ధార్మిక కుటుంబంలో పుట్టి పెరిగినవారైతే ‘దేవుడు’ అనేపదం మీకుచాలా అందంగా, పవిత్రంగా కనిపిస్తుంది. అదే మీరు సామ్యవాద కుటుంబంలో పుట్టిపెరిగిన వారైతే, ఆ పదమే మీకు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి, మీరు మీ నిబద్ధీకరణల ప్రకారమే ప్రవర్తిస్తున్నట్లైతే, మీరు ఒక యంత్రంలా చాలా యాంత్రికంగా ప్రవర్తిస్తున్నట్లే. అంతేకాదు, మానవత్వమున్న మనిషి మీలో ఇంకా జన్మించనట్లే.

ఇంకావుంది...
----------------------------------------------
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.