సబ్ ఫీచర్

ఓల్డ్ ఈజ్ గోల్డ్ .. రెట్రో ఫ్యాషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓల్డ్ ఈజ్ గోల్డ్. రెట్రో కూడా అంతే రెట్రో ఇప్పుడు మోడ్రన్ ఫ్యాషన్‌లో వస్తోంది. ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్లకు స్ఫూర్తి నివ్వటమే కాదు. వెలకట్టలేని ఫ్యాషన్ కూడా నిలుస్తోంది. ఇప్పుడంతా రెట్రో అదేనండి పాతతరం స్టైల్ తెగ హుషారెత్తిస్తుంది. ఫ్యాషన్ వేదికల మీద, వివాహ వేడుకల్లోను, సాయంకాలం పార్టీల్లోను అంతటా తానై చూపులను దోచేస్తోంది. ఇది మోడ్రన్ డ్రెస్సుల విషయంలోనే కాదు చీరకట్టులోనూ రెట్రో తెగ ఆకట్టుకుంటోంది. బెల్‌బాటమ్ ప్యాండ్లు లేదంటే పోల్కా డాట్ షర్ట్స్ .. యాంకిల్ లెంగ్త్ బూటుల. ఫ్లేర్డ్ స్కర్ట్‌లు, నీలెంగ్త్ బూట్లు, లోఫర్లు లేదంటే జెల్లీస్ ఏదైనా కావొచ్చు. ఫ్యాషన్ రివైవ్ అవుతుంది. ట్రెండ్స్ ని మేం ఫాలో అవుతుంటాం అని చెప్పేవారితో పాటుగా ఆ ట్రెండ్స్ సృష్టిస్తామనే వారు కూడా ఫాలో అవుతున్న ట్రెండ్ రెట్రో. 80లలో ఓ వెలుగు వెలిగిన ఫ్యాషన్లు లేటెస్ట్ కట్స్, ప్యాట్రన్న్ కలర్స్ తో మళ్లీ కనువిందు చేస్తున్నాయి.
అనార్కలి, శారీ, ఫ్లేర్డ్ టాప్, యాంకిల్ లెంగ్త్‌బూట్స్, ఏవైనా సరే ఇప్పుడు డ్రెండ్ గానే వున్నాయి. ఫ్యాషన్స్ ను స్ఫూర్తిగా తీసుకొని నేటి అవసరాలకి అనుగుణంగా వినూత్నంగా ట్రై చేయటమే. పూర్తి రెట్రో అప్పీల్ కొరకు చాలామంది మహిళలు పెద్ద సన్‌గ్లాసెస్ హ్యాట్స్, బోటైస్,చోకర్స్ , కాక్‌కటైల్ రింగ్స్ వాడుతున్నారు. మగవారు బూట్లు బోటైస్, నెక్ స్కార్వ్స్ కూడా ఉపయోగిస్తున్నారిప్పు డు. ఇవి స్టైలిష్ గాను, సౌకర్యంగాను , క్లాసీగాను ఉండటం చేత యంగ్ ప్రొఫెషనల్స్ కూడా రెట్రో మార్గం పట్టారు. కళ్లకి ఆనందం ధరించడానికి సౌకర్యవంతంగా ఉండే ఈ రెట్రో డ్రెస్‌లతో పాటుగా ఐలైనర్ , రెడ్ లిప్ కలర్ పఫ్పీ హెయిల్‌స్టైల్ .. చాలుకచ్చితంగా హెడ్ టర్నర్‌గా నిలుస్తారంటున్నారు డిజైనర్లు.
సమ్మర్ లో అధికంగా కనిపించే ఫ్లోరల్ డ్రెసెస్ ఇప్పుడు కూడా కనిపిస్తుండటానికి ఈ రెట్రో ట్రెండ్ ప్రభావమే. ఎక్కువగా బూట్‌కట్ ప్యాంట్లు, క్రాప్ టాప్స్ వంటివి మోడ్రన్ టచ్‌తో ధరిస్తున్నారు. వీటితో పాటుగా క్రాప్ టాప్స్. హైవెయిస్ట్ ప్యాంట్లు. పలోజోలు వంటివి కూడా అధికంగానే ధరిస్తున్నారు. రెట్రో ఫ్యాషన్ అనేది నేటి సమకాలీన ఫ్యాషన్స్‌లో ఆహ్లాదకరమైన అనుభూతి. అవి కలర్‌పుల్ గా ఉండటమే కాదుప్రకాశవంతంగా ఉత్సాహ పూరితంగా ఉంటాయంటోంది యువత. నిజానికి రెట్రో ఫ్యాషన్ అనేది ఓ సైకిల్ లాంటిది. ప్రతిరెండు మూడు దశాబ్దాలకో మారు ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఓట్రెండ్ గా మాత్రమే కాదు..గతం రేపటికి స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుందనటానికి రెట్రో ఓ నిదర్శనం.అలంకరణలోను పాత కళను తీసుకుని రావడం ఇప్పుడు ఆధునిక వనితల అసలు సిసలైన స్టైల్‌గా మారింది.

-- తరిగొప్పుల విఎల్ల్‌న్ మూర్తి