సబ్ ఫీచర్

పిల్లలకు ఆన్‌లైన్ చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్‌నెట్‌లోని అశ్లీల సాహిత్యం, అశ్లీల చిత్రాలు, వీడియోలను పరస్పరం స్మార్ట్ ఫోన్ల ద్వారా షేర్ చేసుకోవడం ప్రైమరీ స్కూల్ పిల్లల్లో కూడా పెరుగుతోంది. ఈ విషయమై ఎంతోమంది ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తూ, పిల్లల్లో 3ఆన్‌లైన్2 ఉపద్రవాల గురించి సరియైన అవగాహన కలిగించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంటున్నారు.
3‘ది టైమ్స్’2 పత్రిక బ్రిటన్‌లో 50 పాఠశాలల్లో పదిహేను వందలమంది టీచర్లను సర్వే చేసింది. ఆ సర్వేలో వెల్లడయ్యిందేమిటంటే 12-13 సంవత్సరాల వయస్సు పిల్లలు తరగతి గదులలోనే అశ్లీల సమాచారాన్ని మొబైల్ ఫోన్ల ద్వారా పరస్పరం షేర్ చేసుకుంటున్నారు. వీరిలో 16 శాతంమంది పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న పిల్లలే.
‘ఇంటర్నెట్, సోషల్ మీడియాలు అందిస్తున్న సౌకర్యాలను పిల్లలు తమ విద్యాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలి. అదే సమయంలో ఇంటర్నెట్‌లో గల పలు ఆకర్షణలు, వాటి వలన కలిగే దుష్పరిణామాల గురించి కూడా పిల్లలు అవగాహన కలిగి ఉండాలి. అందువల్ల ఇంటర్నెట్, సోషల్ మీడియా సౌకర్యాలను సురక్షితంగా వినియోగించుకోవడంపై పిల్లల్లో సరైన అవగాహన కలిగించే బాధ్యత పాఠశాలలదే’2అని నికీ మోర్గాన్ అంటారు. ఈమె బ్రిటీష్ కన్సర్వేటివ్ పార్టీ సభ్యురాలు. బ్రిటీష్ ప్రభుత్వ విద్యా శాఖకి కార్యదర్శి కూడా.
స్కూలు విద్యార్థులు అశ్లీల సమాచారాన్ని, ఫొటోలను ఫోన్లలో పంపించుకోవడమే కాదు, కాస్త మెతకగా కనిపించే విద్యార్థులకు హోమోసెక్సువల్ బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు తరగతి గదిలో తాము పాఠాలు చెప్తుండగానే విద్యార్థులు సోషల్ మీడియాలో లభ్యమయ్యే అశ్లీల సమాచారాన్ని తమ ఫోన్లలో పరస్పరం షేర్ చేసుకుంటున్నారని ‘ది టైమ్స్2 పత్రిక సర్వే చేసిన పాఠశాలల్లోని టీచర్లు వాపోతున్నారు. 3‘నేను పాఠాలు చెప్పే తరగతిలో ఒక విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్ గ్రూపును గుర్తుతెలియని పేరుతో సృష్టించి, తోటి విద్యార్థినుల ఫొటోలను రహస్యంగా తీసి రేటింగ్ కోసం షేర్ చేయడం జరుగుతోంది’ అని ఒక టీచర్ ఫిర్యాదు చేస్తున్నారు.
‘మా తరగతిలో అయితే ఫేస్‌బుక్‌లో ఒక ఫేక్ పేజీ సృష్టించి తమ నగ్న చిత్రాలను పోస్టు చెయ్యమని విద్యార్థులందరికీ మెసేస్‌లు పంపారు’ అని మరో టీచర్ ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా విద్యార్థుల నగ్న చిత్రాలతో కూడిన ఫేస్‌బుక్ వ్యవహారం పోలీసు కేసు దాకా కూడా వెళ్లింది అని ఆ టీచర్ చెప్తున్నారు.
బెర్నాడోస్ చిల్డ్రన్స్ ఛారిటీ అన్నది 1866లో ఇంగ్లాండులో స్థాపించబడిన ఒక స్వచ్ఛంద సంస్థ. ‘ప్రాథమిక విద్య స్థాయిలో తరగతి పిల్లల స్మార్ట్ ఫోన్ల వ్యవహారం చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం. వాస్తవ ప్రపంచంలో ఆరోగ్యకరమైన మానవ సంబంధాల ఆవశ్యకతను గురించి ఆ వయసు పిల్లలనుంచి చక్కటి అవగాహన కలిగించేందుకు మనం కృషిచేయాలి. లేకపోతే ఇంటర్నెట్ వైపరీత్యాలకు రాబోయే తరం బలయ్యే ప్రమాదం ఉంది’ అని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.
‘నిరంతరం సోషల్ మీడియాలో మునిగితేలడం, అన్‌లైన్ పోర్నోగ్రఫీ వంటి ఇంటర్నెట్‌లో గల అభ్యంతకర విషయాలు పిల్లల దృష్టి మళ్లించి వారిలో తమ పట్ల, ఇతరులపట్ల అవాంఛనీయ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. చిన్న పిల్లలు, కళాశాల విద్యార్థులు స్మార్ట్ ఫోన్లలో తమ నగ్న చిత్రాలను పరస్పరం షేర్ చేసుకునే స్థాయికి ఈ వ్యవహారం వెళ్తోంది కూడా. ఇంటర్నెట్‌లోగల అవాంఛనీయ సమాచారానికి దూరంగా ఉండేందుకు పిల్లల్లో తగిన అవగాహన కలిగించడం పాఠ్యాంశాలలో భాగంగా తప్పనిసరి చెయ్యాలి. లేకపోతే వారిని రక్షించుకోవడం కష్టమైపోతుంది’ అని జావేద్ ఖాన్ అంటారు. ఈయన ‘బెర్నాడోస్ చిల్డ్రన్స్ ఛారిటీ’ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్.
నాలుగవ ఏట నుండే ఆరోగ్యకరమైన, సురక్షితమైన మానవ సంబంధాల గురించి పిల్లల్లో అవగాహన కల్పించాలి. అందుకు అనుగుణంగా ప్రస్తుత పాఠ్యప్రణాళికలో తగిన మార్పులు చేయాలి2జస్టిన్ గ్రీనింగ్ అని అంటారు. ఈమె బ్రిటీష్ పార్లమెంటులో 2005 నుండి కన్సర్వేటివ్ పార్టీ తరఫున సభ్యురాలుగా ఉంటున్నారు. 2016-18 సంవత్సరాలకుగాను ఇంగ్లండు విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఈమె పనిచేశారు.
తరగతి గదులలో పిల్లలు నడిపే సెక్స్టింగ్ వ్యవహారం టీచర్లకు పెద్ద తలనొప్పి అయ్యిందని ‘ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ టీచర్స్’ అనే టీచింగ్ యూనియన్ అంటోంది. సోషల్ మీడియా ద్వారా విద్యార్థులు తమని కూడా వేధిస్తున్నారని కొందరు టీచర్లు ఫిర్యాదు చేస్తున్నారు కూడా. తాము చేసిన సగం పైగా ఫిర్యాదులపై ఇప్పటిదాకా ఎలాంటి స్పందనా రాలేదని ఆ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పిల్లల తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా కూడా కొందరు టీచర్లని వేధిస్తున్నారట.
‘ది టైమ్స్’2 పత్రిక జరిపిన సర్వేలో పాఠశాలల్లో జరుగుతున్న దిగ్భ్రాంతిని కలిగించే విషయాలను బహిర్గతం చేస్తోంది. విద్యార్థులనుండి తమకు ఎదురౌతున్న ఆన్‌లైన్ వేధింపుల విషయంలో టీచర్లకు ఎటువంటి సహకారమూ లభించటంలేదు. మరోప్రక్క తరగతి గదులలో విద్యార్థుల అన్‌లైన్ కార్యకలాపాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు టీచర్లని వేధించడం ఓ సరదాగా తీసుకుంటున్నారు. పిల్లల్లో ఈ ధోరణిని అరికట్టాలి. ఆన్‌లైన్ వేధింపులకు గురికావడంవల్ల టీచర్లు ఎన్నో రకాలుగా మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. అది వారి భవిష్యత్తునూ, జీవితాలనూ కూడా నాశనం చేస్తుంది. తరగతి గదులలో టీచర్లు-విద్యార్థులమధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణంలో విద్యార్థులు వికాసం పొందడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలను చేట్టాలి22 అని క్రిస్ కీట్స్ అంటారు. ఈమె ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ టీచర్స్ ప్రధాన కార్యదర్శి.

-డా॥ దుగ్గిరాల రాజకిశోర్80082 64690