సబ్ ఫీచర్

రిజర్వేషన్ విధానాన్ని సంస్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ జనాభా అపరిమితంగా పెరిగిపోతోంది. 1950లో 40 కోట్ల నుంచి ప్రస్తుతం 130 కోట్లకు పెరిగి, అనతికాంలోనే చైనాను అధిగమించి, ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా పరిగణింపబడనున్నది. మనదేశ వైశాల్యం చైనాలో మూడోవంతు. చైనా ప్రజల తలసరి ఆదాయం మనకన్నా ఆరురెట్లు అధికం. చైనా జనాభా పెరుగుదలను ప్రతి కుటుంబం ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవాలనే నిబంధనను 1978 నుంచి అమలు చేసింది. 1970వ దశకం నుండి మన జనాభా సంవత్సరానికి 180 లక్షల చొప్పున పెరుగుతోంది. ఈ పెరుగుదల వివిధ వర్గాల్లో అసమానంగా ఉండటం గమనార్హం. ముస్లింలు 1961లో 10 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతం అయ్యారు. ఎస్సీలు 15 నుండి 25 శాతానికి పెరిగారని, తెలంగాణ రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ ఛైర్మన్ రవి చెబుతూ ఆ దామాషా మేరకు ఎస్‌సి రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్నారు. 7.5 శాతం నుండి 10 శాతానికి పెరిగాం కాబట్టి తమకు కూడా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ఎస్టీలు కోరుతున్నారు. రజకులు, వడ్లెర్లు తమను ఎస్టీల్లో చేర్చాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపులను బీసీలుగా పరిగణించి వారికోసం వార్షికంగా రూ.1000కోట్లు కేటాయించడాన్ని మిగిలిన బీసీ కులసంఘాల వారు వ్యతిరేకిస్తున్నారు. ఇక తెలంగాణలో తొమ్మిది శాతం ఉన్న తమను బీసీల్లో చేర్చాలంటూ రెడ్డి వర్గం వారు ఉద్యమిస్తున్నారు. నవ్యాంధ్రలో చంద్రబాబు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పరచి, దానికి నిధులివ్వడాన్ని కొన్ని క్రైస్తవ సంఘాల నేతృత్వంలోని మతం మార్చుకున్నా హిందూపేర్లున్న బృందాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో తమ వర్గం వారిని బీసీ కేటగిరీలో చేర్చారు కనుక తెలుగు రాష్ట్రాల్లో కూడ తమను అదేమాది రిగా పరిగణించాలన్న ఉద్యమం అంకుర స్థాయిలో ఉంది.
ఈవిధంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని కులాలవారు వెనుకబాటు తనం కోసం ఉద్యమిస్తున్నారు. చోద్యమేమంటే పేదల అభ్యున్నతి కోసం, వెనుకబడ్డ కులాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామంటూ అధికారాన్ని చేజిక్కించుకున్న వారంతా అగ్రసామాజిక వర్గాల ముఖ్యలే. వీరికి ఒకరిద్దరికి మించి పిల్లలు లేరు. వారికి ఇంగ్లీషు, ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో విద్య. తర్వాత అమెరికాలో చదువులు. రాజ్యాధికారం పోతే ఎలా బతకాలి? అందుకోసం సాగినంతకాలం అధికారం, అధికారం ద్వారా సంపద, ఆ సంపనను విదేశాల్లో చట్టసమ్మతంగానే పదిలం చేసుకోవడం, చాలామంది సమకాలీన నాయకులకు పరిపాటైపోయింది.
కుల నిర్మూలనను వాంఛించేవారి చేష్టలన్నీ కులాల శాశ్వతీకరణాన్ని తీవ్రతరం చేసేవిగానే ఉంటున్నాయి. కులం పేర సభ పెడితే లక్షమంది పోగవుతున్నారు. అలాగాక హిందూధర్మం పేరగాని, తెలుగు భాష పరిరక్షణ కోసం గాని, ఉగ్రవాదానికి, దేశద్రోహానికి వ్యతిరేకంగా కాని, సభ పెడితే వందలమంది కూడా రారు. చివరకు దళితుల్లో కూడా మాల, మాదిగ, దళిత క్రైస్తవులు అంటూ పరస్పర వ్యతిరేకతతో వివిధ సంఘాలు పుట్టుకొచ్చాయి. కులాలు లేవనే ముసల్మాన్లలో, పస్మందాలనే వెనుకబడ్డ వర్గాలు, సయ్యద్, ఖాన్, ఖురేషీ అనే ఉచ్ఛవర్గాలు తమ ఉనికిని ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఈవిధంగా భారతీయ సమాజం విఘటితమవుతూ, దేశ జాతీయతకు, భరత భూమి సమగ్రతకు హాని కలిగిం విధంగా మరుతోంది.
కుల స్పృహ, కులాధికారత్వం సమీకరణం యొక్క ప్రధాన లక్ష్యం.. కుల (మత) జనాభా దామాషాల్లో రిజర్వేషన్లు పొందడం, సంక్షేమ నిధుల్లో వాటా పెంచుకోవడం, వోట్ల ద్వారా రాజ్యాధికారంలో ప్రాభవం పొందడం. రాజకీయ నాయకుల, పార్టీల సంక్షేమ వాగ్దానాల్లో కొన్నింటిని నెరవేర్చడానికి భారత ప్రభుత్వం 2004లో రూ.40,000 కోట్లకు కొంచెం తక్కువగా ఖర్చు పెడితే 2014కు అది పెరిగి రూ.3,50,000 కోట్లకు చేరింది. 13వ పంచవర్ష ప్రణాళిక పేదరికపు నిర్మూలనకు కట్టుబడితే కేవలం ఒక్క ఆహార భద్రతకే 87 కోట్ల మంది తగుదురని అంటే నిరుపేదలని ప్రభుత్వం అంచనా వేసింది. ఒకవైపు జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఈ పెరుగుదల వెనుకబడ్డవారిలో, దళితుల్లో, వనవాసీల్లో, ముస్లింలలో, పేదవారిలో, విద్య తక్కువ ఉన్నవారిలో అధికంగా ఉంది. ఈ వర్గాలన్నీ తమకు రిజర్వేషన్లు పెంచాలని, పోటీలు పడుతూ ఉద్యమాలు చేపడుతున్నాయి. కేవలం నాణ్యమైన విద్య వల్లనే అర్హత, పాత్రతలు పెరుగుతాయని డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు. అందుకే బాలబాలికలకు ఎనిమిదేళ్ల పాటు నిర్బంధ ఉచిత విద్యను నేర్పించాలన్న అంశాన్ని రాజ్యాంగంలో చేర్చారు. ప్రభుత్వాలు ఈ బాధ్యతను విస్మరించాయి. అందరికీ విద్య, అందరికీ ఉపాధి అవకాశాల కల్పన లభిచాలంటే మనం తక్షణం చేపట్టవలసింది జనాభా పెరుగుదలను నియంత్రించడం! రిజర్వేషన్లను ఆ ప్రయోజనం పొందిన కుటుంబాల్లో ఒకటి రెండు తరాలకు పరిమితం చేయడం. అది కూడా ఇద్దరు బిడ్డలకు పరిమితం చేయాలి.
మనది సంపన్న దేశం కాదు. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన కొరియా, మలేసియా, సింగపూర్, శ్రీలంక, చైనాలు పేదరికాన్ని తగ్గించాయి. జనాభా పెరుగుదలను నియంత్రించాయి. పర్యవసానంగా ఆయా దేశాలన్నింటిలో అక్షరాస్యత, విద్యావంతులూ పెరిగారు. పేదలు తగ్గారు. తలసరి ఆదాయం మనకన్నా మూడు నుంచి పదహారు రెట్లు అధికంగా ఉంది. చైనా మాదిరిగా నిర్బంధ కుటుంబ నియంత్రణను విధించలేం. కాని సంక్షేమ పథక ప్రయోజనాలు, రాయితీలు ఇద్దరు బిడ్డలున్న కుటుంబాలకే వర్తిస్తాయి. మూడోబిడ్డ పుడితే, సంక్షేమ ప్రయోజనాలు రద్దవుతాయన్న నిబంధన విధించాలి.
ప్రధాని నరేంద్ర మోదీ గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని వదులుకోవాలని సంపన్నులను అభ్యర్థించారు. లక్షలమంది సబ్సిడీని వదులుకోవడం వల్ల రూ.25 వేల కోట్లు ఆదా అయ్యాయని, ఆ ధనంతో ఐదుకోట్ల బీద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లనివ్వగలుగుతున్నామన్నారు. అలాగే రిజర్వేషన్లను కూడా రెండు తరాల్లో ఇద్దరేసి పిల్లలకు వర్తింపజేస్తే, ఇంతవరకు ప్రయోజనం పొందని వారెందరికో లాభం చేకూరుతుంది. కేవలం పారిశ్రామీకరణం వల్ల ఉద్యోగాలు పెరుగుతాయనుకోవడం వట్టి భ్రమ మాత్రమే. పరిశ్రమలు రానురాను శారీరక శ్రమమీద కాకుండా, యంత్రాల మీద ఆధారపడుతున్నాయి. తత్ఫలితంగా యాంత్రీకరణ పరిజ్ఞానమున్న వారికే ఉద్యోగాలుంటాయి. యంత్రాలపై ఆధారపడటం వల్ల పెట్టుబడులు అధికమవుతున్నాయి. అందువల్ల పెట్టుబడులు ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ అన్నమాట. అందువల్ల నేటి కాలంలో పరిశ్రమలు, వ్యాపారాలు, చిన్నతరహా ఉత్పత్తిమార్గాలు మాత్రమే జీవికను సృష్టింగలుగుతాయి. ఇక ప్రభు త్వం, సంక్షేమ చర్యలకు స్వస్తి చెప్పాలి. పేదరికం నుంచి బయటపడేసే విద్య, వైద్యం, పరిమిత సంతానం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. తరతరాలుగా రిజర్వేషన్ సదుపాయం కల్పించే పద్ధతిని సంస్కరించాలి.

- టి. హనుమాన్ చౌదరి