సబ్ ఫీచర్

మెదడులో సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరంలోని ప్రతి అంగానికి జ్ఞానాన్ని స్వీకరించగల శక్తి ఉన్నది. సాధన మాత్రం మెదడులోనే జరుగుతుంది. పిల్లలు సైకిల్ తొక్కుతారు. కాళ్లనుంచి ఆ జ్ఞానం మెదడుకు ప్రసరిస్తుంది. అక్కడ లెర్నింగ్ (సాధన) జరుగుతుంది. పిల్లలు ఈత కొడతారు. శరీర భాగాలు దాన్ని సంఘర్షిస్తాయి. మెదడులో ఉండే ప్రక్రియతో దానిపై సాధన జరుగుతుంది. పిల్లలకు సంబంధించి శరీరంలోని అన్ని అంగాలను ఈ ప్రక్రియలో భాగస్వామి చేయాలి. కేవలం మెదడును మాత్రమే భాగస్వామిని చేస్తే అది లెర్నింగ్ కాదు. అవి చిలుక పలుకులు అవుతాయి. కేజీ స్కూల్స్‌లో శరీరంలోని అంగాలను భాగస్వామిని చేయటమే బోధన లక్ష్యం.
చిన్నారులకు ఆరు సంవత్సరాల తర్వాత ఎక్కాలు చెబుతున్నాం. అది అభ్యాసన కాని సాధన కాదు. శరీర భాగాలను భాగస్వామిని చేస్తే వారికి ప్రాసెస్ అర్థమవుతుంది. ఈ ప్రాసెస్‌లో అంకెలు రావల్సిన అవసరం లేదు. అంకెల పరిజ్ఞానం లేకుండా కూడిక, తీసివేతలు తెలియకుండా గణితాన్ని పిల్లలు బాల్యం నుంచే బయట నేర్చుకుంటారు. సమాజం ఆ లెక్కలు చెబుతుంది. వాటిని మనం కేజీ స్కూల్‌లో చేయించాలి. చిన్న చిన్న పొడుపు కథలను చెప్పి ఆ కథలలో పిల్లలను పాత్రధారులను చేయటం- కేజీ స్కూలు పిల్లల పోషణ కోసం కాదు. శరీరంలోని భాగాలను ఉపయోగించుకుని సాధన చేయించటం.
ప్రాథమిక పాఠశాలకు ఈ పూర్వజ్ఞానంతో వెళితే దానిని సుస్థిరమైన సాధన (సన్‌స్టైబుల్ లెర్నింగ్) అంటాం. అది చిన్నపిల్లలకు కేజీలో ఇచ్చే జ్ఞానం సుస్థిరమైన సాధనకు ఉపయోగపడుతుంది. కేజీ స్కూలు నేడు విద్యారంగంలో ప్రధానమైన భాగమైపోయింది.
వ్యక్తిత్వ వికాసం..
మహాత్ములు నిర్మించిన మేధాజగత్తు నుంచి జ్ఞానరాశి అవతరించి కాలగర్భంలో ఎంతో కలిసిపోయింది. ఆ జ్ఞానరాశిని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనకున్నది కాబట్టి అప్పుడప్పుడు పిల్లలను మ్యూజియంలకు తీసుకెళతాం. అదే మాదిరిగా నన్ను ఒక విద్యాలయం వారు నిర్మల్‌లో కొండలో కలసిపోయిన జ్ఞానరాశిని చూపించటానికి తీసుకువెళ్లారు. అక్కడ కొండలపై మనకు అర్థం కాని ఎన్నో గుర్తులున్నాయి. ఒక్కొక్కరు దానిపై ఒక్కొక్క రకమైన భాష్యం చెబుతారు. ఒక మనిషి ఒక దృశ్యాన్ని చూస్తే అతని మేధస్సులో ఒక మోడల్ (నమూనా) ఏర్పడుతుంది. ఆ మోడల్ అతని వ్యక్తిత్వ వికాసానికి మూలమవుతుంది.
అమెరికా సంపన్న దేశం కాబట్టి ఎన్నో మ్యూజియంలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మ్యూజియంలు ఎందుకు ఏర్పాటుచేశారని అడిగాను మా పిల్లలను. అమెరికా చరిత్రను దీని ద్వారా చూపించి పిల్లల్లో పర్సనాలిటీని పెంచుతారని అన్నారు.
అప్పుడనిపించింది మన దేశంలోకూడా గొప్ప చరిత్ర ఉంది అని. మానవ పరిణామక్రమంలో మనది గొప్ప చరిత్ర. ఈ చరిత్రను మన పిల్లలకు తెలియజేసేందుకు మ్యూజియంలను నెలకొల్పుకోవాలి. పిల్లలు ఈ ప్రకృతిని చూస్తే పులకరిస్తారు. మట్టిలో, కొండల్లో, బండల్లో దాగిన చరిత్రను చూపిస్తే పిల్లలు వ్యక్తిత్వ వికాసం పొందుతారు. పరిశోధకులుగా మారుతారు. మన చరిత్రను వెలికితీసే సాధకులవుతారు. వారి నేలపై వారికి ప్రేమ పెరుగుతుంది. తమ ప్రాంత చరిత్రను చూసి గర్వపడతారు. తరగతి గది నాలుగు గోడల నుంచి పిల్లలను బయటకు తీసుకువచ్చి, వారిలో ఇలాంటి మేధస్సును పెంచటం మన విద్యాలయాల బాధ్యత.
పిల్లలకు సంస్కృతి...
ప్రపంచమంతా కథలు, సంఘటనలతో నిండింది. కానీ అణువులతో మాత్రం కాదు. ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు తన పాఠాన్ని కథలతో కలపాలి. సంఘటనలతో నిరూపించాలి. పాఠాన్ని యథాతథంగాకాకుండా తరగతి గదిని సంఘటనలతో జోడిస్తే పాఠశాల సమాజంలో జోడించబడుతుంది. అది చెప్పేటప్పుడు సమయానుకూలంగా ఉపాధ్యాయుడు తన ‘యాక్సెంట్’ను మారుస్తాడు. కొన్నిసార్లు రిపీట్ చేస్తాడు. కొన్నిసార్లు సామెతలు చెబుతాడు. ఇవన్నీ కూడా స్కూలు సంస్కృతికి అద్దం పడతాయి. కానీ, సమాజం హద్దులు మాత్రం దాటకూడదు.
ప్రజాస్వామ్యాన్ని తక్కువచేసి చూపించటమైనా లేక మత సామరస్యానికి భంగం కలిగించటమైనా, పీడిత ప్రజల్లో పోరాటాల పట్ల ఆసక్తిని పెంచుతూ తన పాఠాన్ని కథలతో జోడించాలి. స్కూలు కల్చర్ సమాజం కల్చర్‌లో భాగం. ఇవి సమాజంలో దీపాలు కాని ద్వీపాలు కావు. ఉపాధ్యాయుడు ఎన్ని పాఠాలు చెప్పాడన్నది ప్రధానం కాదు, ఎలాంటి సంస్కృతిని పిల్లలకు అందించాడన్నది ముఖ్యం. ఆ సంస్కృతి సమాజ సంస్కృతిని పటిష్టం చేయాలి.

-చుక్కా రామయ్య