సబ్ ఫీచర్

దీపావళికి ఇల్లు కళకళలాడాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్టోబరు, నవంబరు నెలలంటేనే పండుగల సీజన్. దసరా, దీపావళి వంటి పెద్ద పెద్ద పండుగలతో ఈ రెండు నెలలు కళకళలాడుతూ ఉంటాయి. దీపావళి అంటే బోలెడు దీపాలు, బాంబుల శబ్దాలు, బాణాసంచా, స్వీట్లు, బంధుమిత్రుల ఆత్మీయ పలకరింపులు.. ఇలా ఎన్నో.. ఇలాంటి పండుగల సమయంలో ప్రతి ఇల్లు దీపాలు, తోరణాలతో అలంకరించబడి ఉంటుంది. అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుని పండుగ కళతో మెరిసిపోతుంటారు. దీపావళికి కొన్ని రోజుల ముందే ఇంటి పనులు మొదలుపెడితే పండుగరోజు ఇల్లు మెరిసిపోతుంది. మరి ఇంటిని ఎలా మెరిపించాలో చూ ద్దామా..
* పండుగ కొద్దిరోజులుండగానే ఇల్లంతా శుభ్రం చేసుకుని కొత్త కొత్త బెడ్‌షీట్లు, కర్టెన్లతో అలంకరించుకోవాలి.
* ధన్‌తేరస్ రోజునుంచే దీపాలు వెలిగించడం మొదలుపెడతాము కాబట్టి షోయింగ్ లైట్స్‌ను ధన్‌తేరస్ ముందు రోజే అలంకరిస్తే బాగుంటుంది.
* దీపావళి రోజు మధ్యాహ్నం నుంచే తాజాపూలతోటి గుమ్మాన్ని, దేవుడి మందిరాన్ని, దేవుళ్ళని అలంకరించాలి.
* ఇంటిని అలంకరించడానికి అరోమాటిక్ కొవ్వుత్తులను ఉపయోగిస్తే ఇల్లంతా సుగంధభరితం అవుతుంది. ఇలాంటి కొవ్వుత్తులు ఏ గిఫ్ట్ షాపులో అయినా దొరుకుతాయి.
* హాలు మధ్యలో సెంటర్ టేబుల్‌పై ఒక పెద్ద బౌల్లో నీటిలో తేలియాడే కొవ్వుత్తులను వేస్తే ఇంటికి మరింత శోభ పెరుగుతుంది. ఈ కొవ్వుత్తుల మధ్యలో గులాబీ రేకులు, తామర పువ్వులూ వేస్తే కన్నుల పండుగగా ఉంటుంది చూసేవారికి.
* పండుగ రోజు ప్రతీ ఇంట్లో లాంతర్లు ముఖ్యం. గాజుసీసాలకు రంగులు వేసి మధ్యలో కొవ్వుత్తులు లేదా ఎల్‌రుూడీ బల్బులు అమర్చాలి. ఇలా అమర్చిన సీసాలను ఇంటి చుట్టూ వేళాడదీయాలి. ఇల్లంతా రంగురంగుల గ్లాసు లాంతర్లతో దీపాలు వెలుగుతూంటే ఇల్లు ఎంత బాగుంటుందో కదూ..
* దీపావళి అలంకరణలో ముగ్గులు లేకపోతే ఎలా? రంగులతో పాటు, పూలరెక్కలు, ఆకులు, దీపాలను ఉపయోగించి ముగ్గుని వేస్తే ఆ రంగవల్లిక ఎంత అందంగా ఉంటుందో చెప్పావల్సిన అవసరం లేదు. ఇంటి వాకిట్లోకానీ, హాల్లో కానీ ఇలాంటి ముగ్గొకటి వేస్తే ఇంటి శోభ మరింత రెట్టింపు అవుతుంది.
* దీపావళి రోజు లక్ష్మీదేవినీ, వినాయకుడ్ని ఇంటికి ఆహ్వానిస్తారు కాబట్టి ఇంటి మహాద్వారాన్ని రంగురంగుల దీప తోరణాలతో అలంకరించాలి. ఇవి ఇంటికి కొత్త వెలుగును తెస్తాయి.
* ఇంట్లో అక్కడక్కడా సువాసన కలిగిన పూరెక్కల్ని ఉంచితే ఇల్లంతా సువాసన వెదజల్లుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇలా దీపావళి రోజు ఇంటిని కళకళలాడేలా చేసుకుంటే పండుగ మరింత ఆనందంగా ఉంటుంది.