సబ్ ఫీచర్

వెలుగే జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన కళ్ళు తయారుచేయబడ్డ విధానాన్ని బట్టి మన జీవితాల్లో వెలుగుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ మన కళ్ళు గుడ్లగూబ కళ్లలా ఉండి ఉంటే, వెలుగు మనకి అంత ముఖ్యమైంది అయి ఉండేది కాదు.
నేడు మనకు విద్యుద్దీపాలు ఉన్నాయి. కాబట్టి దీపం అవసరమేమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం సంగతిని ఊహించుకోండి. ఇంటి లోపల ఒక దీపం లేకుండా ఏమీ చేయలేరు. చారిత్రాత్మకంగా దీపం ముఖ్యంగా రెండు కారణాలవలన మన గృహాలలో ఒక అంతర్భాగం అయింది. ఒకటి, అప్పుడు విద్యుద్దీపాలు లేవు. రెండు,- ఇళ్ళు కలప, తాటాకు వంటి సేంద్రీయ పదార్థాలతో నిర్మించుకునేవారు. అందువలన వారు పెద్ద పెద్ద కిటికీలను పెట్టుకోలేకపోయేవారు. సాధారణంగా, పురాతన కాలంలో ఇళ్ళలో బాగా చీకటిగా ఉండేది. నేడు కూడా పల్లెటూర్లలో పాత ఇళ్లు, మురికివాడలు చీకటిగా ఉండటం మీరు చూశారా? అందుకనే ఆ కాలంలో పగటి సమయంలో కూడా దీపం పెట్టి ఉంచేవారు. సాధారణంగా అదే పూజాస్థలంగా ఉండేది.
సాంప్రదాయపరంగా సరైన వాతావరణాన్ని సృష్టించడానికి చేసే మొదటి పని ఒక దీపాన్ని వెలిగించడం. కాకపోతే నేడు మనకు వున్న చాలా సమస్యలవలన మనము విద్యుద్దీపాలను వెలిగిస్తున్నాము. కానీ మీలో దీపాన్ని వెలిగించే అలవాటు వున్నవారు కేవలం దీపం చుట్టూ ఉండడంవల్ల ఎంతో తేడా అనిపిస్తుందని గమనించి ఉంటారు. మీరు ఏ దేవుడినీ నమ్మనవసరం లేదు. చీకటిగా ఉండకపోయినా, చూడటానికి అవసరం లేకపోయినా, మీరు దీపం వెలిగిస్తే కొంత తేడా ఉంటుందని గమనించారా? ఇది ఎందుకంటే మీరు దీపం వెలిగించిన మరుక్షణమే కేవలం ఆ జ్వాల మాత్రమే కాదు, ఆ జ్వాల చుట్టూ ఒక గుండ్రని చక్రం లాంటి శక్తి వలయం సహజంగా ఏర్పడుతుంది.
ఎక్కడ ఎలాంటి శక్తి వలయం ఉంటుందో అక్కడ మనుషుల మధ్య అన్యోన్యత, అనుబంధాలు బాగుంటాయి. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా చలిమంట చుట్టూ కూర్చున్నారా? మీరు కనుక కూర్చుని ఉంటే, ఆ సమయంలో చెప్పుకునే కథల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మీరు గమనించారా? పాతకాలంలోనే, కథలు చెప్పేవాళ్ళు, దీన్ని అర్థం చేసుకున్నారు. చలిమంట చుట్టూ చెప్పుకునే కథలు చాలా బలంగా మనస్సులో నాటుకుపోతాయి. వాటిని మనం చాలా సులభంగా గ్రహించగలుగుతాం.
కాబట్టి మనం ఏదైనా ప్రారంభించాలనుకుంటే, లేదా ఒక నిర్దిష్టమైన వాతావరణాన్ని సృష్టించాలనుకుంటే, ఒక దీపం వెలిగిస్తాం. ఒక దీపాన్ని వెలిగించినపుడు, అది దృశ్యపరంగానే కాకుండా, శక్తిపరంగా కూడా పూర్తి ప్రదేశాన్ని ఒక భిన్నమైన శక్తితో నింపుతుందన్న అవగాహన నుండి ఈ ఆచారం వచ్చింది. ఒక నూనె దీపాన్ని వెలిగించటంలో కొన్ని సూచనలు ఉన్నాయి. దీపాన్ని వెలిగించటానికి కొన్ని ప్రత్యేకమైన నూనెల వినియోగం ముఖ్యం. ప్రత్యేకించి నువ్వుల నూనె, ఆముదం లేదా నెయ్యి, ఒక అనుకూల శక్తిని వెలువరిస్తాయి. ఆ శక్తికి దాని స్వంత శక్తి క్షేత్రం ఉంటుంది.
అగ్ని పలు విధాలుగా వెలుగుకి, జీవితానికి మూలం. ప్రతీకాత్మకంగా, మనం అగ్నిని జీవితం యొక్క మూలంగా చూస్తాము. నిజానికి, మీ జీవితమే అగ్ని అని చాలా భాషలలో ప్రస్తావిస్తారు. మీలోని అగ్నే మీరు జీవించటానికి కారణం. సూర్యుడు, ఈ గ్రహం మీద జీవానికి మూలం. అతనొక ఒక అగ్నిగోళం, అవునా, కాదా? మీరు ఒక విద్యుద్దీపాన్ని వెలిగించినా, స్టవ్‌మీద వంట చేసినా, మీ కారులోని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌ని స్టార్ట్ చేసినా అది అంతా కూడా అగ్నే. అవునా, కాదా? ఈ ప్రపంచంలో జీవాన్ని నడిపేది అంతా కూడా అగ్నే. కాబట్టి అగ్నిని జీవానికి మూలంగా చూస్తాము. అది దాని చుట్టూ ఒక శక్తి క్షేత్రాన్ని సృష్టించుకుంటుది. అన్నింటికన్నా ముఖ్యంగా అది మనకు అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మీరు మీ రోజుని ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగిస్తున్నారు. అంటే మీరు అదే నాణ్యతని, గుణాన్ని మీలోకి తీసుకురావాలనుకుంటున్నారు. అది మీ అంతర్గత స్వభావాన్ని ప్రేరేపించే ఒక విధానం.

- సద్గురు ఆశీస్సులతో