సబ్ ఫీచర్

‘ఐఏఎస్‌ల బిడ్డ’ అంగన్‌వాడీలో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగన్‌వాడీ కేంద్రాలంటే పేదవర్గాల పిల్లల కోసమేనని, అక్కడ ‘ఉచిత భోజనాలు’ తప్ప మరెలాంటి సదుపాయాలు ఉండవన్న భావన చాలమందిలో ఉంది.. ‘అంగన్‌వాడీ’ల పట్ల అనాదిగా సమాజంలో చిన్నచూపే.. ఈ ఆలోచనా విధానం సరికాదని చెప్పేందుకు ‘ఐఏఎస్ దంపతులు’ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుని అందరి చేత భాష్’ అనిపించుకున్నారు. ఖరీదైన కార్పొరేట్ పాఠశాలలో చేర్పించే ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ ఈ ఐఏఎస్ దంపతులు తమ రెండేళ్ల కుమారుడు అభ్యుదయ్‌ను అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు.
ఉత్తరాఖండ్‌లో నితిన్ భండారియా, స్వాతి శ్రీవాత్సవ జిల్లా కలెక్టర్లుగా ఉంటూ అధికారులందరికీ ఆదర్శంగా నిలిచారు. స్వాతి చమోలీ కలెక్టర్‌గా, నితిన్ అల్మొరా కలెక్టర్‌గా సేవలందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు పిల్లలకు మరింత దగ్గర కావాలన్న ధ్యేయంతో ఈ దంపతులు తమ ఆలోచనను ఆచరణలో పెట్టారు. అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించాక తమ కుమారుడు అభ్యుదయ్ మిగతా పిల్లలతో సరదాగా గడుపుతూ, వారితో హాయిగా భోజనం చేస్తున్నాడని వీరు చెబుతున్నారు. అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని వీరు గుర్తు చేస్తున్నారు. ఎదిగే పిల్లలకు తగిన పౌష్టికాహారం అందించేందుకు వీటిని సమర్ధవంతంగా నడుపుతున్నామన్నారు. పిల్లలు భోజనాన్నే కాదు, వారి ఆలోచనలను సైతం పంచుకునేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు దోహదం చేస్తాయని స్వాతి అంటున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలంటే - ఎలాంటి సౌకర్యాలు ఉండవని, నాణ్యమైన విద్య ఉండదని, నాసిరకం భోజనం పెడతారని చాలామంది అపోహ పడుతుంటారని, ఈ భావనను తొలగించేందుకు తమ కుమారుడిని అంగన్‌వాడీలో చేర్పించామన్నారు.
పేదవర్గాల వారు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారి పిల్లలను అంగన్‌వాడీల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారన్న ఆలోచన సరికాదని స్వాతి, నితిన్ అంటున్నారు. ఇద్దరు కలెక్టర్లు తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పథకాల పట్ల సమాజంలో ఆదరణ పెరుగుతుందని స్థానికలు ప్రశంసిస్తున్నారు. ఐఏఎస్ దంపతుల చొరవతో అంగన్‌వాడీ కేంద్రాలకు ఆదరణ పెరుగుతుందని రెండు జిల్లాల ప్రజలు భావిస్తున్నారు. అంగన్‌వాడీల్లో కలెక్టర్లు భోజనం చేయడం తమకు తెలుసునని, అయితే తమ కుమారుడిని ఈ కేంద్రంలో చేర్చడం ద్వారా స్వాతి, నితిన్ దంపతులు ‘మాటలు కంటే చేతలు గొప్పవ’ని నిరూపించారని స్థానికులు అభినందిస్తున్నారు.