సబ్ ఫీచర్

‘హక్కుల గళాల’కు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మహిళలిద్దరూ ఒకప్పుడు శరణార్థులు. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన మొట్టమొదటి ముస్లిం మహిళలు. వాళ్లే ఇల్హాన్ ఒమర్, రషీదా తలీబ్. గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శరణార్థుల విషయంలో అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు ముస్లిం మహిళలు కాంగ్రెస్‌కు ఎన్నిక కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యంతర ఎన్నికల్లో ఈ ఇద్దరు ముస్లిం మహిళలు మొట్టమొదటిసారిగా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. వీరిద్దరూ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. ఇది ట్రంప్ ముస్లిం వ్యతిరేక ప్రకటనలకు ప్రతిస్పందనగా విశే్లషకులు భావిస్తున్నారు.
ఇల్హాన్ ఒమర్ ఇప్పటికే మినె్నసోటా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌కు ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. ఇల్హాన్ గత ఆగస్టులో డెమోక్రటిక్ ప్రతినిధి కీల్ ఎలిసన్ స్థానంలో తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుంది. అందరికీ వైద్య సదుపాయాలు, క్రిమినల్ జస్టిస్‌లో సంస్కరణలు, కనీస వేతనాల కోసం ఆమె పోరాడుతోంది. మధ్యంతర ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ అభ్యర్థి జెన్నిఫర్ జైలిన్‌స్కీపై విజయం సాధించింది. టైమ్ పత్రిక ప్రకారం ఆమె పనె్నండు సంవత్సరాల వయస్సులో శరణార్థిగా అమెరికాకు వచ్చింది. ‘రాజకీయ కార్యకలాపాలంటే నాకు జయాపజయాలు కాదు. నేను మార్పును ఇష్టపడతాను’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇల్హాన్. ఆమె విజయంతో ఇల్హాన్ మద్దతుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
నలభై రెండు సంవత్సరాల రషీదా తలీబ్ కూడా ఇల్హాన్‌లాగే ఒక శరణార్థి. రషీదా తండ్రి పాలస్తీనా నుంచి అమెరికాకు వచ్చాడు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బ్రెండా జోన్స్‌ను ప్రైమరీ ఎన్నికల్లో ఓడించినప్పుడు మధ్యంతర ఎన్నికలకు ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. 2008లో మిషిగాన్ లెజిస్లేచర్ ఎన్నికల్లో గెలిచినప్పుడు రషీదా చరిత్ర సృష్టించింది. మిషిగాన్ లెజిస్లేచర్‌కు ఎన్నికైన మొదటి ముస్లిం మహిళ రషీదానే. కార్మికులకు కనీస వేతనాన్ని వెయ్యి డాలర్లు చేయాలన్నది ఆమె ప్రధాన డిమాండ్. సామాజిక భద్రత, అందరికీ వైద్య సదుపాయాల కోసం రషీదా పోరాడుతోంది.