సబ్ ఫీచర్

షిరిడీవాసుని దివ్యధామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానావలి సమాధి
భగవత్ సాక్షాత్కారం పొందిన మహానుభావుడు నానావలి. ఇతను హిందువని కొందరు, మహమ్మదీయుడని కొందరు అనేవారు. శిరిడీకి రాకముందు నానావలి అనే మహాత్ముడిని సేవించినందున ఇతనికి నానావలి అనే పేరువచ్చిందని అంటారు. ఒకసారి బాబాను గద్దెపైనుంచి లేపి తాను కొద్దిసేపు కూర్చున్నాడు. బాబా భౌతిక దేహాన్ని చాలించిన పదమూడు రోజులకు నానావలి కూడా బాబాలో ఐక్యమైపోయారు. శిరిడీలోని ఈయన సమాధి స్థలంకూడా చూడతగ్గది.
విఠల్ ఆలయం
విఠల్ మందిరం చాలా పురాతనమైనది. ఈ మందిరం గురుస్థాన్ దక్షిణం వైపు రోడ్డులో సేవాధామ్‌కి వెళ్లే వీధిలో ఎడమవైపు ఉంది. సాయిబాబా హయాంలో ఈ ఆలయానికి లక్ష్మణ్ అనే ఆయన పూజారిగా ఉండేవారు. లక్ష్మణ్ పరమ నిష్టాగరిష్టుడైన బ్రాహ్మణుడు. బాబాను మొదట చాలామంది మాదిరిగానే ముస్లింగా భావించేవాడు. ఒకసారి అతని కుమారునికి జబ్బుచేస్తే బాబా స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి బాలుడిని ఆశీర్వదించి స్వస్థత కలిగించారు. దాంతో లక్ష్మణ్ బాబాకు పరమ భక్తుడైనాడు. బాబా మహాసమాధి చెందాక బాపూసాహెబు జోగ్ హారతినివ్వటం మానుకున్నాడు. అపుడు బాబా కలలో కనిపించి ‘నేను చనిపోయాననుకుని జోగ్ హారతి ఇవ్వలేదు. నువ్వు నాకు పూజచేసి కాకడ హారతి నివ్వు’అని చెప్పింది ఈ లక్ష్మణ్‌కే. ఈ మందిరాన్ని దర్శించటం ద్వారా అలనాటి అనుభవాలను సాయిభక్తులు నెమరు వేసుకోవచ్చు
నరసింహ మందిరం
ఇది చావడికి దగ్గరలోనే ఉంది. రాంగిర్‌బువా, త్రయంబక్ షెల్కే సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. షెల్కే కుటుంబంవారు ఈ మందిరం నిర్వహణ బాధ్యతలను ఇప్పటికీ చూస్తున్నారు.
బాహూకుంభార్
లెండీ వనం దగ్గరలో బాహూకుంభార్ సమాధి ఉంది. బాబా లెండీబాగ్‌లోని మొక్కలకు నిత్యం నీళ్లుపోసేవారు. నీళ్లు మోయటానికి అవసరమైన కుండలను రోజూ కుంభారే సమకూర్చేవాడు. బాబాకు పరమభక్తుడైన కుంభార్ సాయి శిరిడీలో నడిచే వీధులన్నిటినీ శుభ్రంగా ఊడ్చి, చిమ్మేవారు. ఈయన 1938లో సమాధి చెందారు.
కానిఫ్‌నాథ్ మందిరం
శిరిడీలోని పోస్ట్ఫాసుకు ఎదురుగా కానిఫ్‌నాథ్ మందిరం ఉంది. నవనాథ్‌లనబడే దేవతలలో కానిఫ్‌నాథ్ ఒక అవతారం. ఇది చాలా పురాతన ప్రాశస్త్యంగల మందిరం. బాబా నిత్యం ఖండోబా మందిరానికి వెళ్తూ మధ్యలో కానిఫ్‌నాథుని దర్శనం చేసుకునేవారట. ఈ దారిలో బాబా పాదుకలు ప్రతిష్ఠ చేయబడ్డాయి.
సాయినాథుని
దర్శనంఇలా !
ఎంతటి సాయిభక్తులైనా, ఎంతటి శ్రద్ధాసక్తులున్న వారైనా బాబా అనుమతి లభిస్తేనే శిరిడీ వెళ్లగలరు. ఇంతటి పుణ్యం లభించినవారు నిజంగా ధన్యులు. మన శిరిడీ పర్యటన ధన్యంకావాలంటే మన పూర్వీకులు విధించిన సంప్రదాయాలను అనుసరించాలి. బాబా దర్శనం నేత్రపర్వం కావాలన్నా, శిరిడీ యాత్ర ఫలప్రదం కావాలన్నా ఈ సూచనలు పాటించాలి. అప్పుడే మన శిరిడీ క్షేత్ర సందర్శన సంకల్పం సార్థకమవుతుంది. ఆ నియమాలేమిటో, బాబాను ఎలా దర్శించుకోవాలో తదితర వివరాలు తెలుసుకుందాం.
1. గురుస్థానంలో కాని, ద్వారకామాయిలో కాని మొదట బాబావారి ధూళి దర్శనం చేసుకుని తరువాత స్నానాధికాలు పూర్తిచేసి ప్రశాంతంగా సమాధి మందిరంలోకి ప్రవేశిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
2. శిరిడీ వెళ్లిన ప్రతివారు సాయి సంప్రదాయం ప్రకారం ధూళి దర్శనం తర్వాత స్నానసంథ్యలు ముగించుకుని గురుస్థానాన్ని దర్శించాలి. గురుస్థానం చుట్టూ ముమ్మార్లు లేదా ఎవరి శక్తికొలదీ వారు ప్రదక్షిణలు చేయాలి.
3. గురుస్థానాన్ని దర్శించుకున్న తరువాత బాబా అరవై ఏళ్లపాటు నివసించిన ద్వారకామాయిని దర్శించుకోవాలి. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖసంపదలు పొందగలరని బాబానే స్వయంగా చెప్పారు.
4. ద్వారకామాయి దర్శనం పూర్తయిన తరువాత సమాధి మందిరంలో అడుగుపెట్టాలి. తనను చూడవచ్చిన భక్తులను కళ్లతోనే పిలుస్తున్నట్టుండే బాబావిగ్రహాన్ని మనసులోనే ప్రతిష్టించుకోవాలి. భక్తులు తమ తాహతుకొద్దీ బాబాకు నూతన వస్త్రాలు, పూల మాలలు, టవళ్లు, శాలువా, దుప్పట్లు వంటివి సమర్పించుకుని యథాశక్తి బాబాకు సేవలుచేసుకోవచ్చు.
5. సమాధి మందిరం దర్శనానంతరం చావడిని దర్శించుకోవాలి. ఇది ద్వారకామాయికి ముందు భాగంలో ఉంది.
6. శిరిడీ వెళ్లిన ప్రతి భక్తుడు పై నాలుగు క్షేత్రాల తరువాత తప్పనిసరిగా దర్శించాల్సిన ముఖ్య స్థలం ఖండోబా మందిరం.
7. శిరిడీలో ఉన్నంతసేపు అనవసర చర్చలు, కాలక్షేపం కబుర్లతోకాక సాయి ప్రచురణలు, ధ్యానం, జపం, సాయి నామస్మరణ వంటి వాటితో గడిపితే మంచిది.
8. శిరిడీలో ఉన్న సమయంలో ఎక్కువసేపు గురుస్థానం ఆవరణలో లేదా ద్వారకామాయిలో, చావడిలో, సమాధి మందిర పరిసరాల్లో గడిపితే యాత్ర ఫలప్రదమవుతుంది. అలాచేయటంవల్ల మనసులో గూడుకట్టుకున్న చింతలు, దిగులు, కష్టాల బరువుదిగి బాబాపై ఏకాగ్రత కుదురుతుంది.
ఇంకావుంది...
=================================================================
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566