సబ్ ఫీచర్

ఎసిడిటీ తగ్గించే యోగాసనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరంలో ఆమ్లాల ప్రతిచర్య కారణంగా గుండెల్లో మంట ఏర్పడుతుంది. అజీర్ణత సమస్య, ఆహారం తీసుకున్న వెంటనే మండుతున్నట్లుగా ఉండే అనుభూతి, ఆమ్లాల ప్రతిచర్య కారణంగా జీర్ణ ప్రక్రియలో తీవ్రమైన మంట ఏర్పడుతుంది. దీనిని సపోర్టెడ్ బ్యాక్ బెండ్స్, ఇనె్వర్శన్స్ (తలకిందులుగా ఉండడం) వంటి యోగాసనాల సాధన ద్వారా తగ్గించవచ్చు. యోగా ఈ లక్షణాల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. లెగ్ అప్ ద వాల్ భంగిమ ద్వారా గుండెల్లోని మంట నుండి ఉపశమనం పొందవచ్చు. సపోర్టెడ్ బ్రిడ్జ్ భంగిమ కూడా ఇందుకు సహాయపడుతుంది. శారీరక వ్యవస్థను కూడా శాంతింపచేయవచ్చు. ఆ యోగాసనాలేంటో ఒకసారి చూద్దాం.
లెగ్స్ అప్ ద వాల్ భంగిమ
లెగ్స్ అప్ ద వాల్ భంగిమ చేయడానికి ముందుగా గోడకు అభిముఖంగా ఉండాలి. కాలివేళ్ళను గోడకు అభిముఖంగా ఉండేట్లు నిర్ధారించుకోవాలి. వీపుని నేలకు ఆనించి గోడకు కాళ్ళను నిటారుగా ఉంచాలి. పిరుదులను గోడకు దగ్గరగా తీసుకురావాలి. ఎగువ వెన్ను భాగాన్ని, మెడను నేలపై పూర్తిగా వదిలేయాలి. ఇప్పుడు శరీరం ఎల్ ఆకారంలో ఉంటుంది. తరువాత టి ఆకారంలో ఉన్నట్లుగా చేతులను చాపాలి. మోచేతులని తొంభై డిగ్రీల వరకు వంచాలి. అరచేతులను పై కప్పు వైపు చూస్తున్నట్లుగా ఉంచి ముంజేతులను నేలపై ఉంచి విశ్రాంతిని కల్పించాలి. తరువాత తుంటి భాగం దూరం వరకు కాళ్లను విస్తరించి పాదాలను వంచాలి. ఈసమయంలో పై కప్పుపై నిలబడినట్లు ఊహించుకోవాలి. తరువాత కళ్లను మూసుకుని ఐదు నిముషాల పాటు లెగ్స్ అప్ ద వాల్ భంగిమలో ఉండాలి. ఇలా ఉన్న తర్వాత కాళ్లలోని ఒత్తిడిని వదిలేసిన అనుభూతిని పొందండి. లెగ్స్ అప్ ద వాల్ భంగిమలోని విలోమాల వల్ల పొత్తికడుపు ప్రాంతంలో రక్తప్రసరణ పెరిగి జీర్ణక్రియ సమస్యలను పోగొట్టి శరీరానికి హాయిని కలిగిస్తుంది.
సపోర్టెడ్ బ్రిడ్జ్
ముందుగా వీపును నేలకు ఆనించి పడుకుని అరికాళ్ళను నేలపై ఉంచాలి. ఒకసారి పాదాలు నేలపై ఉన్నట్లుగా మోకాళ్ళను వంచాలి. తుంటి దూరం వరకు కాళ్ళను విస్తృత పరచాలి. వీపు ఎగువ, దిగువ భాగాలు యోగా చాపతో సంబంధం కలిగి ఉన్నట్లుగా అనుభూతి పొందాలి. ఈ సమయంలో మూడు సార్లు ఊపిరిని గట్టిగా తీసుకుని వదలాలి. యోగా బ్లాగ్‌ను తీసుకుని తుంటి భాగాన్ని పైకెత్తి, ఆ బ్లాక్‌ను త్రికాస్థి వెనుక కుడ్యము(పిరుదులకు కొంచెం పైనకు) కిందన నేరుగా పెట్టండి. బ్లాక్‌పై తుంటి భాగాన్ని పూర్తిగా వదిలేయాలి. తరువాత చేతులను కాలి తొడలకు ఇరువైపులా తీసుకుని వచ్చి అరచేతులు పైకప్పును చూస్తున్నట్లుగా ఉంచాలి. వీపు, పాదాలు, భుజాలు నేలకు ఒత్తిడి కలిగిస్తున్నట్లుగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. యోగా బ్లాక్స్ వివిధ పరిమాణాలలో లభిస్తాయి కాబట్టి సౌకర్యాన్ని బట్టి అత్యల్ప, అత్యధిక స్థాయిలను ప్రయోగించి పరీక్షించుకోవాలి. బ్యాక్ బెండ్ సహాయంతో అలాగే 40 సెకన్లు పాటు ఉండాలి. తరువాత శరీరం కింది నుండి బ్లాక్‌ను తొలగించి తుంటి భాగాన్ని, వీపుని తిరిగి నేలపై ఉంచాలి. డయాఫ్రాగమ్‌ను పైకి ఎత్తడానికి బ్యాక్‌బెండ్స్ సహాయాన్ని అందిస్తాయి. ఇలా చేయడం వల్ల కడుపులో ఉన్న ఎలాంటి భారమైనా తొలగిపోతుంది. ఇది జీర్ణ వ్యవస్థలోని లోపాలను పరిష్కంచగలిగే అత్యుత్తమ ఉపాయం.